News


15 శాతం క్రాష్‌ నుంచి కోలుకున్న యస్‌బ్యాంక్‌

Monday 4th November 2019
Markets_main1572840311.png-29323

స్‌ బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశ పరచడంతో ఈ బ్యాంక్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమైంది. రూ. 59.95 వద్ద నెగిటివ్‌లో ప్రారంభమైన ఈ షేరు 15 శాతం నష్టపోయి రూ. 56.65 స్థాయికి పడిపోయింది. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ రూ.629 ‍కోట్ల నికర నష్టాలను(కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. ఈ త్రైమాసికంలో పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్లుగా ఉండడంతో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని ఈ బ్యాంక్‌ తెలిపింది. కాగా బ్యాంక్‌ ఈ ఏడాది డిసెంబర్‌నాటికి నిధులను సమీకరిస్తుందని బ్యాంక్‌ యాజమాన్యం ప్రకటించడంతో యస్‌ బ్యాంక్‌ షేరు విలువ పతనం నుంచి కోలుకుని తిరిగి సానుకూలంగా ట్రేడవుతోంది. ఉదయం 9.53 సమయానికి 3.30 శాతం లాభపడి రూ. 69.00  వద్ద ట్రేడవుతోంది.



You may be interested

11945 పైన ముగిస్తే 12280పాయింట్ల వరకు నిఫ్టీ!

Monday 4th November 2019

నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు గతవారం పాజిటివ్‌గా ముగిశాయి. నిఫ్టీ వారాంతానికి దాదాపు 2.3 శాతం లాభపడింది. ఇప్పటివరకు ప్రధాన సూచీలే ర్యాలీ జరుపుతుండగా క్రమంగా చిన్న స్టాకులు కూడా పాజిటివ్‌గా మారుతున్నాయని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా గతవారం మిడ్‌క్యాప్‌ సూచీ 3 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2 శాతం పైచిలుకు లాభంతో ముగిశాయి. డైలీ చార్టుల్లో నిఫ్టీ డోజీ క్యాండిల్స్‌ ఏర్పరుస్తోంది. ఇవి మార్కెట్లో అనిశ్చితికి నిదర్శనాలు. కానీ వీక్లీ

ప్రారంభంలోనే సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డు

Monday 4th November 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సూచి చరిత్రాత్మక గరిష్టస్థాయి 40,400 పాయింట్లపైన ప్రారంభంకావడం ద్వారా ఈ ఫీట్‌ సాధించింది. గత శుక్రవారం నెలకొల్పిన 40,360 పాయింట్ల రికార్డును తిరగరాసిన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 250 పాయింట్లు జంప్‌చేసి 40,415 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇంకా రికార్డుస్థాయికి 1.5 శాతంపైగా దూరంగా వున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ

Most from this category