News


కోలుకుంటున్న పసిడి

Friday 22nd November 2019
Markets_main1574405356.png-29782

నిన్నటి రోజు 10డాలర్లు నష్టపోయిన పసిడి ధర శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో స్వల్పంగా కోలుకుంది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,466 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా చైనా కనీసం పరిమిత ఒప్పందం కుదుర్చుకునేందుకు బీజింగ్‌లో కొత్త రౌండ్ ముఖాముఖి చర్చలకు అమెరికా  అగ్రశ్రేణి వాణిజ్య సంధానకర్తలను ఆహ్వానించినట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. రెండు దేశాల మధ్య సత్సం సంబంధాలు కొనసాగుతున్నందున చైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని చైనీస్‌ కామర్స్‌ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. అమెరికాతో వాణిజ్య చర్చలకు మార్గం సుగమం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది వచ్చే ఏడాది వరకు మధ్యంతర ఒప్పందం కుదరదని ఆందోళనలను తగ్గించింది. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్లు నష్టపోయి 1,463.60 డాలర్ల వద్ద స్థిరపడింది. పసిడి ఇప్పుడు కనిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.. 1,500 డాలర్లు అందుకునే సత్తా ఉంది. ఈ అంశం పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను పెంచుతుంది. యుఎస్-చైనా వాణిజ్య వివాదం స్వల్పకాలికానికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. డిసెంబర్‌ 15నుంచి చైనాపై అమెరికా విధించిన కొత్త టారీఫ్‌ల అమల్లోకి రానున్న నేపథ్యంలో పసిడి ట్రేడర్లు ఇప్పుడు ఈ అంశంపై దృష్టిని సారించారని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
దేశీయంగా రూ.38వేల దిగువున పసిడి 
శీయంగా పసిడి ధర శుక్రవారం రూ.38000 దిగువున స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం సెషన్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాములు పసిడి రూ.32.00లు స్వల్ప లాభంతో రూ.37985.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 225లు నష్టపోయి రూ.37953 వద్ద స్థిరపడింది. 

దేశీయంగా వివిధ నగరాల్లో స్పాట్‌ గోల్డ్‌(24 క్యారెట్లు) నిన్నటి(22-11-2019) ముగింపు ధర కోసం ఆయా నగరాల గుర్తుపై క్లిక్‌ చేయండి



You may be interested

బ్యాంకులకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రైటాఫ్‌ల ముప్పు?

Friday 22nd November 2019

దేశీయ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్..బ్యాంకులు, బాండ్‌హోల్డర్లకు సంబంధించిన రుణాలను చెల్లించడంలో విఫలమైంది. కాగా ఈ కంపెనీ మోసపూరిత చర్యలకు పాల్పడిందనే విషయం రుజువైతే, ఈ సంస్థకు అప్పులిచ్చిన రుణ దాతలు అధికంగా దాదాపు రూ. 36,000 కోట్ల రైట్‌ ఆఫ్‌లను ఎదుర్కోవలసి​ వస్తుంది. ఒక వేళ ఈ కంపెనీకి సంబంధించి ఆడిటింగ్‌ సంస్థ కేపీఎంజీ నివేదిక కంపెనీకి సానుకూలంగా వస్తే అప్పుడు కేవలం రూ. 5,500 కోట్ల ప్రోవిజన్లు అవసరమవుతాయని

మాటలు కాదు..ఫిర్యాదును పరిష్కరించండి: మోహన్‌దాస్‌ పాయ్‌

Friday 22nd November 2019

విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదును ఎదుర్కొన్న కంపెనీలు, ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలి కానీ దేవుడు కూడా మార్చలేడంటూ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించకూడదని ఇన్ఫోసిస్‌ మాజీ ఉద్యోగి టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ గురువారం అన్నారు. కాగా ఇన్ఫోసిస్‌పై రెండవ సారి విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదుపై వచ్చిన తర్వాత మోహన్‌ దాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది మేం చేశాం. ఆ పద్ధతిని అనుసరిస్తున్నాం’ అని కొన్ని వాఖ్యలు చేయడం కాదు. కంపెనీ ఆరోపణలపై ప్రజలు

Most from this category