News


వడ్డీరేట్లపై ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

Tuesday 10th December 2019
Markets_main1575957074.png-30150

కీలక వడ్డీ రేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మరింత స్పష్టత కోసం పసిడి ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఫలితంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర నిన్న ముగింపు(1465 డాలర్లు)తో పోలిస్తే 1 డాలరు స్వల్పంగా లాభపడి 1,466 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాలపై విధించిన రెండో విడుత సుంకాల పెంపు ఈ డిసెంబర్‌ 15నుంచి అమల్లోకి రానున్నాయి. ఈలోగా వాణిజ్య చర్చల్లో పరిష్కారం మార్గం దొరకవచ్చనే ఇరుదేశ వాణిజ్య అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేటి నుంచి అమెరికాలో ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశాలు జరగనున్నాయి. పసిడిపై ప్రభావాన్ని చూపే కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ తన నిర్ణయాన్ని రేపు వెల్లడించనుంది. ఇటీవల అమెరికా ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా నమోదుకావడంతో ఈసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నిన్నరాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి 0.20 సెంట్ల స్వల్ప నష్టంతో 1465 వద్ద స్థిరపడింది.
దేశీయంగా ఐదోరోజూ నష్టాల్లోనే...
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర వరుసగా ఐదోరోజూ నష్టాల బాట పట్టింది. ఈ 5రోజుల్లో పసిడి ధర రూ.750లు నష్టపోయింది. ఇటీవల ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1460 డాలర్ల స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతుండటం తదితర కారణాలు దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.49లు నష్టపోయి రూ. 37,534.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక నిన్నరాత్రి పసిడి ధర రూ.116లు నష్టపోయి రూ.37,583 వద్ద ముగిసింది. రానున్న రోజుల్లో పసిడి మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  You may be interested

54 స్టాకుల్లో బేరిష్‌ సంకేతాలు!

Tuesday 10th December 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 54 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్‌, బంధన్‌ బ్యాంక్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, హావెల్స్‌ ఇండియా, ఫ్యూచర్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీగ్యాస్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ,

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల నుంచి టాప్‌ సిఫార్సులు

Tuesday 10th December 2019

అంతర్జాతీయ దిగ్గజ బ్రోకరేజ్‌లు ఆరు స్టాకులను రికమండ్‌ చేస్తున్నాయి. 1. ఆర్‌ఐఎల్‌: మోర్గాన్‌ స్టాన్లీ ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1735. ఆర్‌ఐఎల్‌ బలమైన ప్రదర్శన ఆరంభమైంది. ఇది ప్రసుతం తన సరాసరి పీఈ కన్నా రూ.20 శాతం అధిక ప్రీమియంతో ఉంది. టారిఫ్‌ల పెంపుతో కంపెనీ ఆర్‌ఓసీఈ మరింత పెరగనుంది. రెండేళ్లలో ఇది 11 శాతం వరకు పెరగవచ్చని అంచనా. కెమికల్స్‌ విభాగం మాత్రం కొంత కాలం సవాళ్లను

Most from this category