News


ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న పసిడి

Friday 6th December 2019
Markets_main1575610470.png-30089

అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌ కదులుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల‍్ప నష్టంతో 1481 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చలు "సరైన దిశలో పయనిస్తున్నాయి" అని ట్రంప్ తాజా వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందం ఆశలను చిగురించాయి. దీందో రిస్క్‌ అసెట్స్‌లైన ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే డాలర్‌ బలహీనత పసిడి కలిసొచ్చే అంశంగా మారింది. చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలు డిసెంబర్‌ 15నుంచి అమల్లోకి రానున్నాయి. మధ్యంతర ఒప్పందం చర్చల్లో భాగంగా ఈ సుంకాలను నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న వాటిని ఎత్తివేయాలని చైనా కోరుతోంది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,483డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

దేశీయంగానూ స్వల్ప నష్టాలో:- 
అంతర్జాతీయ మార్కెట్‌ పసిడి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతుండటంతో దేశీయంగా పసిడి స్వల్పంగా నష్టాల బాట పట్టింది. నేటి ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.58ల నష్టంతో రూ.38027.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి పసిడి ధర రూ.9లు స్వల్పంగా నష్టపోయి రూ.38,085 వద్ద స్థిరపడింది. నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.38,010-37,990 రేంజ్‌లో ట్రేడయ్యే అవకాశం ఉంది. రూ.37,900 వద్ద స్టాప్‌ లాస్‌తో రూ.38,250 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చని నిపుణులు సలహానిస్తున్నారు. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు క్రాష్‌

Friday 6th December 2019

3.30శాతం నష్టపోయి పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అంచనాలకు అనుగుణంగా కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించకపోవడంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంకింగ్‌ రంగ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 3.3శాతానికి పైగా నష్టపోయింది. మూడురోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమావేశం అనంతరం... ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడం, రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలుండం‍తో ఈధపా కీలక వడ్డీరేట్లను

11900 పాయింట్ల వద్ద కీలక మద్దతు!

Friday 6th December 2019

నిఫ్టీకి కీలకమైన మద్దతు 11900 పాయింట్ల వద్ద ఉందని, పైన 12150-12200 పాయింట్ల వద్ద నిరోధం ఎదుర్కొంటోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సూచీ చార్టుల్లో బేరిష్‌ హార్మోనిక్‌ ab=cd ప్యాట్రన్‌ కనిపిస్తోందన్నారు. ఈవారంలో నాలింగిట మూడు సెషన్లలో సూచీలు నెగిటివ్‌గానే ముగిశాయి. మార్కెట్‌ విస్తృతి కూడా డౌన్‌ట్రెండ్‌కే అనుకూలంగా ఉందని, ఇది ఆయా స్టాకుల్లో ప్రాఫిట్‌బుకింగ్‌ను సూచిస్తోందన్నారు. మరోవైపు బ్యాంకు నిఫ్టీ సైతం ఈవారం కొంత నష్టాలు చవిచూసింది. ఇకపై

Most from this category