News


మరో రెండేళ్లలో 2000డాలర్ల స్థాయికి పసిడి: సిటిగ్రూప్‌

Wednesday 11th September 2019
Markets_main1568190652.png-28308

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మరో రెండేళ్లలో 2,000డాలర్ల స్థాయికి చేరుకుంటుందని సిటిగ్రూప్‌ అంచనా వేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక మంద్య భయాలు, కీలక వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు నామమాత్రపు (సున్నా) వైఖరికి ఇష్టపడుతుండటం లాంటి అంశాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తాయని సిటి బ్యాంక్‌ అభిప్రాయపడింది.స్పాట్‌ గోల్డ్‌ దీర్ఘకాలం పాటు స్థిరమైన ర్యాలీని కొనసాగిస్తూ 2000డాలర్ల స్థాయి అధిగమించే అవకాశం ఉంది. వచ్చే ఒకటి, రెండేళ్లలో ఏదో పాయింట్‌ వద్ద కొత్త చక్రీయ గరిష్టస్థాయిని ఏర్పాటు చేస్తుంది. ఈ గరిష్టస్థాయి 2011లో పసిడి ఏర్పాటు చేసిన 1,921.17డాలర్ల గరిష్టస్థాయిని అధిగమిస్తుందని సిటి బ్యాంక్‌ తెలిపింది. నామమాత్రపు (సున్నా) వడ్డీరేట్లు, యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరమడంతో ఆర్థిక మాంద్య భయాలు, రానున్ను రోజుల్లో భౌగోళిక రాజకీయ ఉధృక్తతలు పెరగడం లాంటి అంశాలు పసిడి మార్కెట్‌లో బుల్లిష్‌ వాతావరణం ఏర్పడుతుందని సిటి బ్యాంక్‌ తెలిపింది. పసిడి ర్యాలిని ప్రస్తుతానికి అమెరికా కన్జూ‍్యమర్‌, పొటెన్షియల్‌ వృద్ధి  నిలిపిందని సిటి తెలిపింది. కామెక్స్‌ స్పాట్‌ గోల్డ్‌ పసడి ధర ఈ ఏడాది చివరి త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌) ముగిసే సరికి 125డాలర్లు పెరిగి 1,575డాలర్లును, 2020 నాటికి 14శాతం ర్యాలీ 1,675 అందుకుంటుందని సిటి బ్యాంక్‌ అంచనా వేస్తుంది. అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమన నేపథ్యంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లపై మెతక వైఖరి ప్రదర్శించడంతో ఆగస్ట్‌లో పసిడి ధర ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. ఈ వారంలో యూరోపియన్‌ యూనియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మరిన్ని ఉద్ధీపన చర్యల ప్రకటించే అవకాశంతో పాటు వచ్చే వారంలో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లపై మరోసారి కోత విధించవచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. అమెరికా అర్థికవ్యవస్థ పతనంలో నేపథ్యంలో ఈ కారణాలు ఇన్వెస్టర్లను పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తాయని బ్యాంక్‌ అభిప్రాయపడుతోంది. చివరి నాలుగునెలలో భారీగా లాభపడిన స్పాట్‌గోల్డ్‌ ధర ఈ ఏడాదిలో 16శాతం ర్యాలీ చేసింది.



You may be interested

జీఎస్టీ రేట్ల తగ్గింపు అంచనాలతో జోరుగా అటోషేర్ల ర్యాలీ

Wednesday 11th September 2019

మందగమనంలో ఉన్న అటోరంగానికి ఊతమిచ్చేందుకు అటోరంగంపై జీఎస్టీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో అటో షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఈ సెప్టెంబర్‌ 20తేదిన కేంద్రం జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనుంది. తీవ్ర సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న అటో రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం అటో రంగంపై విధించిన 28శాతం

టాప్‌గేర్‌లో టాటా మోటార్స్‌

Wednesday 11th September 2019

కలిసొచ్చిన చైనా ఆగస్ట్‌ అమ్మకాల రికవరి టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ 4రోజూ కొనసాగుతుంది. బీఎస్‌ఈలో బుధవారం మరో 8శాతం లాభపడ్డాయి. చైనాలో ఆగస్ట్‌ రిటైల్‌ అమ్మకాలు పెరగడం షేర్ల ర్యాలీకి కారణమవుతోంది. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.124.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సోమవారం సాయంత్రం ఆగస్ట్‌ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేసింది. అమ్మకాలు యూరప్‌, అమెరికాలో తగ్గినప్పటికీ.,

Most from this category