News


స్థిరంగా పసిడి

Thursday 2nd January 2020
Markets_main1577940437.png-30608

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చ ఒప్పం‍దం పురోగతి దిశగా సాగుతున్న నేపథ్యంలో డాలర్‌ బలహీనత కారణంగా గురువారం పసిడి ఫ్యూచర్ల ధర స్థిరంగా కదులుతోంది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,524డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య తొలిదశ వాణిజ్య చర్చలు కుదిరి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను మరింత మెరుగుపరచవచ్చనే అంచనాలతో ఈ ఏడాది తొలిరోజున డాలర్‌ కొంత అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్‌ క్షీణత పసిడి ధరకు కలిసొచ్చింది. ఇక ట్రేడ్‌ అంశానికొస్తే... చైనాతో కుదుర్చుకున్న తొలి దశ ఒప్పందంపై జనవరి 15న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేస్తున్నట్లు మంగళవారం వైట్‌ హౌస్‌ ప్రతినిధులు తెలిపారు. అయితే ఇన్వెస్టర్లకు మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇక నిన్న నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా ఆసియా, అమెరికా, యూరప్‌ మార్కెట్లు పనిచేయలేదు.
దేశీయంగానూ స్థిరం:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.25.00లు బలపడి రూ.39092.00లు వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న డాలర్‌ మారకంలో రూపాయి 14పైసలు బలపడిన నేపథ్యంలో ఎంసీఎక్స్‌లో రూ.39067ల వద్ద ముగిసింది. పసిడి రూ.38800 వద్ద కీలక మద్దతు ధర ఉంది. పతనమైన ప్రతిసారి రూ.38770 స్టాప్‌ లాస్‌తో రూ.39200 టార్గెట్‌ ధరగా నిర్ణయించుకొని కొనుగోలు చేయవచ్చని బులియన్‌ పండితులు సలహానిస్తున్నారు. 



You may be interested

ఐబీ రియల్టీ జోరు- సన్‌ టీవీ డీలా

Thursday 2nd January 2020

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వీక్‌ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ఈ నెల 15కల్లా ప్రాథమిక దశ ఒప్పందం కుదరనున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పైనా అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 107 పాయింట్లు ఎగసి 41,413కు చేరగా..నిఫ్టీ

జువెలర్స్‌కు ఐటీ రికవరీ నోటీసులు

Thursday 2nd January 2020

దేశవ్యాప్తంగా పలు జువెలరీ సంస్థలకు ఆదాయపన్ను శాఖ రికవరీ నోటీసులు జారీ చేసింది. 2016-17 కాలంలో నోట్ల రద్దు తర్వాత చేసిన డిపాజిట్లకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసుల్లో రికవరీలు చెల్లించాలని ఆదేశించిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ ఒక నివేదికలో పేర్కొంది. అయితే కొన్ని నెలలుగా డిమాండ్‌ స్తబ్దుగా ఉండడంతో జువెలరీ సంస్థల రెవెన్యూ అంతంతమాత్రంగా ఉంది. ఈ సమయంలో జరిమానాలు చెల్లించడం పలు జువెలరీ సంస్థలకు సాధ్యం కాకపోవచ్చని

Most from this category