News


ఈక్విటీల ర్యాలీ: తగ్గిన పసిడి

Tuesday 5th November 2019
Markets_main1572930710.png-29359

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతోంది. ఆసియా మార్కెట్లో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3.35డాలర్లు నష్టపోయి 1,507.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనాతో వాణిజ్య వివాదాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయనే సంకేతాలు బలపడటం, అమెరికా అక్టోబర్‌ వృద్ధి గణాంకాలతో పాటు చైనా తయారీ రంగం అంచనాలను మించి వృద్ధిని సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీలకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా నిన్న యూరప్ మార్కెట్లు అరశాతం పెరగ్గా, రాత్రి అమెరికా మార్కెట్లలో నాలుగు నెలల అనంతరం ఒకే రోజు డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ రికార్డ్‌ సూచీలు కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఈక్విటీలకు డిమాండ్‌ పెరగడంతో పసిడి ధర నష్టాల బాట పట్టింది. వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేయడంతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. ఈ అంశం కూడా పసిడికి ప్రతికూలాంశంగా మారింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం నష్టపోయి 1,511.10డాలర్ల వద్ద  స్థిరపడింది. 
దేశీయ మార్కెట్లో రూ.100ల నష్టం:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. వరుసగా ఏనిమిదో రోజూ దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడం, ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం లాంటి అంశాలు పసిడికి ప్రతికూలాంశాలుగా మారాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్లో  డిసెంబర్‌ కాంట్రాక్టు 10గ్రాములు పసిడి ధర రూ.100 నష్టంతో రూ.38372 వద్ద స్థిరపడింది. నిన్న మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.165లు లాభపడి రూ.38, 475 వద్ద స్థిరపడింది. 



You may be interested

పాటిటివ్‌గా మెటల్‌ షేర్లు..మొయిల్‌ 3% అప్‌

Tuesday 5th November 2019

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే అంచనాలుండడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు సానుకూలంగా ట్రేడవుతుండడంతో మంగళవారం సెషన్‌లో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.46 సమయానికి 0.84 శాతం​లాభపడి 2,664.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో మొయిల్‌ 3.17 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 2.22 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 2.14 శాతం,  హిందుస్థాన్‌ జింక్‌

యస్‌ బ్యాంక్‌ 9 శాతం అప్‌!

Tuesday 5th November 2019

ఈ ఏడాది చివరినాటికి 1 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించనున్నామని యస్‌ బ్యాంక్‌ యాజమాన్యం ప్రకటించడంతో ఈ బ్యాంక్‌ షేరు గత కొన్ని సెషన్‌ల నుంచి కోలుకుంటుంది. అంతేకాకుండా సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా బల్క్‌ డీల్‌లో భాగంగా రూ. 86.89 కోట్ల విలువైన 1.30 కోట్ల షేర్లు లేదా 0.51 శాతం వాటాను సోమవారం కొనుగోలు చేశారు. ఈ అంశం కూడా బ్యాంక్‌ షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపడంతో

Most from this category