News


కరిగిపోయిన మిడ్‌క్యాప్‌ కంపెనీల ప్రమోటర్ల సంపద..!

Thursday 27th December 2018
Markets_main1545904086.png-23265

ఈ ఏడాది మిడ్‌ క్యాప్‌ కంపెనీలు ఆశించిన స్థాయిలో రాణించలేపోయాయి. కంపెనీ లాభ నష్టాలతో పోలిస్తే వాల్యూవేషన్‌ అధికంగా వుండటం, స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు ఒడిదుడుకులను నియంత్రించేందుకు అదనపు నిఘా చర్యల(ఏఎస్‌ఎం)ను ప్రవేశ పెట్టడం, సెబీ మ్యూచువల్ ఫండ్లని పునర్ వర్గీకరణ చేపట్టడం తదితర కారణలతో ఈ ఏడాది మిడ్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడిని తీవ్రతరమైందని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ ఏడాదిలోనే ఏకంగా 15శాతం క్షీణించి మార్కెట్‌ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2011 తర్వాత ఇంతిలా మిడ్‌క్యాప్‌ షేర్లు పతనం కావడం ఇదే ‍ప్రధమం. ఇదే ఇండెక్స్‌ 2011 సంవత్సరంలో 34శాతం వరకు నష్టపోయింది. ఈ ఏడాదిలో బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ సంస్థలోని మొత్తం 104 కంపెనీల్లో 45 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 20నుంచి 60శాతం వరకు నష్టపోయాయి.  తద్వారా 45 కంపెనీలకు చెందిన రూ.3లక్షల కోట్ల విలువైన సంపద ఈ ఏడాది కాలంలో హరించుకుపోయింది. కంపెనీ ప్రమోటర్లు ఈ రూ.3లక్షల కోట్ల మొత్తంలో 65శాతం అంటే దాదాపు 1.94లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసారు. ఈ ఇండెక్స్‌ పతనంతో ప్రమోటర్లతో పాటు ఇన్వెస్టర్లు సైతం భారీగా నష్టాలను చవిచూడవల్సి వచ్చింది.
ఉదాహరణకు...
1. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో సన్‌టీవి  రూ.16వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కొల్పోయింది. తద్వారా కంపెనీలో 75శాతం వాటా కలిగిన ప్రధాన ప్రమోటర్‌ కళానిధి మారన్‌కు చెందిన రూ.12,074 కోట్ల సంపద హరించుకుపోయింది.
2. అనిల్‌ అంబానీ చెందిన 4 మిడ్‌ క్యాప్‌ సంస్థలు రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ నిప్పాన్‌లు మొత్తం రూ.30,489 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి. ఫలితంగా ఆయా కంపెనీల అధినేత అనిల్‌ అంబానికి రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లింది.
3.ఇదే ఏడాదిలో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(డీఎల్‌ఎఫ్‌) 60శాతం మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయింది. ఫలితంగా సంస్థ ప్రధాన ప్రమోటర్లకు రూ.4,300 కోట్ల నష్టం వాటిల్లింది.
వాటితో పాటు మోతీలాల్‌ ఫైనాన్షియల్‌, వాక్‌హార్డ్‌, ఇమామి, ఎన్‌సీఎల్‌ ఇండియా, బ్లూ డార్ట్‌, భారత్‌ ఫోర్జ్‌, టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌ కంపెనీలు సైతం మన ప్రమోటర్లకు నష్టాలను మిగిల్చాయి.You may be interested

రెండో రోజూ లాభాలే

Thursday 27th December 2018

మార్కెట్‌ డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగింపును లాభంతో ముగించింది. అధిక వెయిటేజ్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ అండతో సూచీలు వరుసగా రెండోరోజూ లాభాల్లోనే ముగిశాయి. యూరప్‌, ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల ట్రెండ్‌ ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పింది. అయితే బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి లోనవ్వడంతో నిఫ్టీ 10800 మార్కును నిలబెట్టుకోవడంలో విఫలమైంది. చివరకు సెన్సెక్స్‌ 157 పాయిం‍ట్ల

ఈ షేర్లపై మోతీలాల్‌ ఓస్వాల్‌ మక్కువ

Thursday 27th December 2018

ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా వచ్చే ఏడాది స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుందని పలు బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఎలాంటి ఓలటాలిటీలోనైనా రాబడినిచ్చే షేర్లు వున్నాయంటూ ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ కొన్ని షేర్లను సిఫార్సుచేశాయి. అవి.... టైటాన్‌ టార్గెట్‌ ధర: రూ. 1105 టైటాన్‌కు పెళ్ళిళ్ల సీజన్‌ బాగా కలిసొస్తున్నది. ఈ సీజన్‌ వచ్చిందంటే చాలు కన్జూమర్లు టైటాన్‌ స్టోర్లకు పోటెత్తుతుంటారు.  పెళ్ళిళ్ల సీజన్ల

Most from this category