News


స్టాక్స్‌, చమురు ధరలకు కరోనా సెగ

Thursday 27th February 2020
Markets_main1582776700.png-32128

వరుసగా ఐదో రోజు అమెరికా మార్కెట్ల పతనం
నాలగో రోజూ నేలచూపులతో ముడిచమురు
ఐదు రోజుల్లో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 8 శాతం డీలా
50 డాలర్ల దిగువకు నైమెక్స్‌ బ్యారల్‌
ఏడాది కనిష్టానికి చేరిన ముడిచమురు ధరలు

చైనాలో పుట్టి ఇరాన్‌, దక్షిర కొరియాసహా పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా అమెరికాలోనూ వ్యాపించనున్న భయాలు తలెత్తాయి. దీంతో ప్రపం‍చవ్యాప్తంగా అటు స్టాక్స్‌, ఇటు ముడిచమురు పతనంకాగా.. ట్రెజరీ బాండ్లకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే వ్యాధుల నియం‍త్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా హెచ్చరించగా.. తాజాగా యూఎస్‌ఎఫ్‌డీఏ సైతం​ఈ అంశాన్ని ప్రస్తావించడంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నీరసించాయి. మరోపక్క ముడిచమురు ధరలు ఏడాది కనిష్టానికి చేరాయి.

నేడు కూడా?
ఐదు రోజుల వరుస నష్టాలతో అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ 8 శాతం కోల్పోగా.. తాజాగా ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ 1 శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. దీంతో నేడు మరోసారి మార్కెట్లు డీలాపడే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆసియాలో​ జపనీస్‌ నికాయ్‌ 2 శాతం పతనమైంది. కాగా.. బాండ్లలో కొనుగోళ్లు పెరగడంతో 10ఏళ్ల ఈల్డ్స్‌ 1.30 శాతాన్ని తాకాయి. ఇది చరిత్రాత్మక కనిష్టంకావడం గమనార్హం! ఇక లండన్‌ మార్కెట్లో తాజాగా బ్రెంట్‌ చమురు 1.2 శాతం క్షీణించి 52.83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు 1.3 శాతం నష్టంతో 48.10 డాలర్ల వద్ద కదులుతోంది. తద్వారా చమురు ధరలు ఏడాది కనిష్టాలను తాకాయి. ఇంతక్రితం 2019 జనవరిలో నైమెక్స్‌ చమురు ఈ స్థాయికి చేరింది.

డిమాండ్‌ వీక్‌!
చైనాసహా పలు దేశాలు కరోనా వైరస్‌తో విలవిలలాడుతున్న కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో చమురుకు డిమాండ్‌ క్షీణించనుందన్న అంచనాలు బలపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు గత వారం అమెరికాలో చమురు ఉత్పత్తి స్వల్పంగా పెరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఇది చమురు ధరలను దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం సమావేశంకానున్న ఒపెక్‌ తదితర దేశాలు చమురు ఉత్పత్తిలో మరింత కోతలను అమలు చేసేందుకు నిర్ణియించవచ్చని అభిప్రాయపడ్డారు.
 



You may be interested

స్వల్పంగా పెరిగిన పుత్తడి

Thursday 27th February 2020

రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. గురువారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.24 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.42,676.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,651 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (బుధవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

170 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

Thursday 27th February 2020

11650 దిగువన మొదలైన నిఫ్టీ మార్కెట్లో కొనసాగుతున్న కరోనా భయాలు అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న మార్కెట్‌ గురువారం మరోసారి నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 170 పాయింట్ల నష్టంతో 39718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్లను కొల్పోయి 11632 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఈక్విటీ మార్కెట్లను ఇంకా వెంటాడుతుండటంతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లతో పాటు, నేడు ఆసియా మార్కెట్లు సైతం నష్టాలను

Most from this category