News


ప్రపంచ మార్కెట్లకు కరోనా షాక్‌

Friday 6th March 2020
Markets_main1583466123.png-32313

గురువారం అమెరికా ఇండెక్సులు 3.5 శాతం పతనం 
3-1 శాతంమధ్య పడిన యూరోపియన్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలోనూ భారీ అమ్మకాల ఒత్తిడి
ఆథిత్య రంగ, ట్రావెల్‌ కంపెనీ షేర్లు బోర్లా

ప్రపంచ దేశాలపై సునామీలా విరుచుకు పడుతున్న కరోనా.. స్టాక్‌ మార్కెట్లలో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మరణాలు 3,300కు చేరడం, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలలో కొత్త కేసులు నమోదుకావడంతో సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే అమెరికా సిలికాన్‌ వ్యాలీ, సియాటెల్‌లోని టెక్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి గురువారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ ఇండెక్సులు 3.5-1 శాతం మధ్య పతనమయ్యాయి.

ఇదీ తీరు
అమెరికా ఇండెక్సులలో డోజొన్స్‌ 970 పాయింట్లు(3.6 శాతం) పతనమై 26,121 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 106 పాయింట్లు(3.4 శాతం) తిరోగమించి 3,024 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 279 పాయింట్లు(3.1 శాతం) క్షీణించి 8,739 వద్ద స్థిరపడింది. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు సైతం అమ్మకాలతో డీలాపడ్డాయి. జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌ 1.5-2 శాతం మధ్య నష్టపోయాయి. ఫిబ్రవరి 19న సాధించిన గరిష్టం నుంచి అమెరికా ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ 10 శాతం దిగజారడం గమనార్హం! ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో జపాన్‌, హాంకాంగ్‌, కొరియా, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, తైవాన్‌, చైనా 2-1 శాతం మధ్య నీరసించాయి. 

ఈల్డ్స్‌ డీలా
పదేళ్ల కాలపు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ మరోసారి చరిత్రాత్మక కనిష్టాలకు చేరాయి. 0.91 శాతాన్ని తాకాయి. దీంతో ఫైనాన్షియల్‌ రంగం 5 శాతం పడిపోయింది. వీటితోపాటు ట్రావెల్‌, లీజర్‌ రంగ కౌంటర్లు డీలాపడ్డాయి. ఎస్‌అండ్‌పీ ఎయిర్‌లైన్‌ ఇండెక్స్‌ 8 శాతం పతనమైంది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ షేరు 13 శాతంపైగా పడిపోయింది. కరోనా కారణంగా ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో 113 బిలియన్‌ డాలర్ల విమానయాన రంగ ఆదాయానికి గండి పడనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే విధంగా క్రూయిజర్‌ కంపెనీలు కార్నివాల్‌, రాయల్‌ కరిబ్బియన్‌ 14-16 శాతం చొప్పున కుప్పకూలాయి.You may be interested

ఓ మై గాడ్‌... యెస్‌ బ్యాంకు నుంచి వెంకన్నే రక్షించాడు!

Friday 6th March 2020

యస్‌ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్‌  కొన్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్ల ఉపంసహరణ సాక్షి, అమరావతి: టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ యెస్‌ బ్యాంక్‌ నుంచి రూ.1300 కోట్ల విలువైన డిపాజిట్లను ఉపసంహరించుకొని వాటిని ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి మరలించారు. ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక

‘‘యస్‌’’ నుంచి ‘‘నో’’ వరకు: యస్‌బ్యాంక్‌ ప్రస్థానం

Friday 6th March 2020

యస్‌ బ్యాంక్‌ ప్రస్థానం ఇలా... జూన్‌ 12, 2018: యస్‌ బ్యాంక్‌  ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ పునర్నియామాకానికి వాటాదారుల ఆమోదం  ఆగస్టు 30, 2018: యస్‌ బ్యాంక్‌కు ఎమ్‌డీగా, సీఈఓగా రాణా కపూర్‌ కొనసాగడానికి ఆర్‌బీఐ ఆమోదం  సెప్టెంబర్‌ 19, 2018: రాణా కపూర్‌ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన ఆర్బీఐ  సెప్టెంబర్‌ 21, 2018: యస్‌ బ్యాంక్‌ షేర్‌ 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరి  సెప్టెంబర్‌

Most from this category