News


మళ్లీ ప్రపంచ మార్కెట్లు బేర్‌

Monday 16th March 2020
Markets_main1584356977.png-32510

ఫెడ్‌ ఎఫెక్ట్‌ నిల్‌..
2,700 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
760 పాయింట్లు కుప్పకూలిన నిఫ్టీ
యూరోపియన్‌ మార్కెట్లు 8 శాతం వీక్‌
యూఎస్‌ ఫ్యూచర్స్‌ 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌
పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌., ఐటీ, రియల్టీ పతనం

కోవిడ్‌-19 ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఎకాఎకిన వడ్డీ రేట్లను 1 శాతంమేర తగ్గించేసింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 0-0.25 శాతానికి చేరాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఇటీవలే 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడ్‌ 700 బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి పంప్‌ చేసేందుకు ప్రణాళికలు వేసింది. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు ఉపశమించకపోగా.. మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ 5 శాతం డౌన్‌సర్క్యూట్‌ను తాకగా.. సెన్సెక్స్‌, నిఫ్టీ మళ్లీ 8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సైతం 8 శాతంపైగా కుప్పకూలడం గమనార్హం! కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలై మాంద్యం తలెత్తనున్న ఆందోళనలు బలపడుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలియజేశారు.  కాగా..  సెన్సెక్స్‌  2713 పాయింట్లు పడిపోయి 31,390 వద్ద నిలవగా... నిఫ్టీ 758 పాయింట్లు పోగొట్టుకుని 9,197 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 33,103 వద్ద గరిష్టాన్ని తాకగా.. 31,276 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 9,602-9,165 పాయింట్ల మధ్య ఆటుపోట్లను ఎదుర్కొంది.

రియల్టీ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బోర్లా పడగా.. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఐటీ రంగాలు 9-8 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా సైతం  5.6-4.25 శాతం మధ్య తిరోగమించాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌ 18 శాతం కుప్పకూలగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, జీ 15-9 శాతం మధ్య పతనమయ్యాయి. ఇండెక్స్‌ షేర్లలో కేవలం యస్‌ బ్యాంక్‌ లాభపడింది. ఏకంగా 45 శాతం దూసుకెళ్లడం విశేషం!

ఆర్‌బీఎల్ డీలా
డెరివేటివ్స్‌లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పిరమల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌, ఆయిల్‌ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఎన్‌సీసీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌ 21-12 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. మరోపక్క మదర్‌సన్‌, హెచ్‌పీసీఎల్‌, గ్లెన్‌మార్క్‌ 4-3 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ స్టాక్స్‌లో బ్రిగేడ్‌, శోభా, ఇండియాబుల్స్‌, మహీంద్రా లైఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఫీనిక్స్‌, సన్‌టెక్‌, డీఎల్‌ఎఫ్‌, ప్రెస్జేజ్‌ 4-17 శాతం మధ్య కుప్పకూలాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 6 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 2020 నష్టపోగా.. 438 లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 6028 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 5868 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 3475 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 3918 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇదే విధంగా బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3515 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2835 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  You may be interested

మార్కెట్‌ స్థిరపడితే ఎస్‌బీఐ కార్డ్‌ ర్యాలీ..?

Tuesday 17th March 2020

స్టాక్‌ మార్కెట్లు కుదుటపడితే ఎస్‌బీఐ కార్డ్‌ షేరు పుంజుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ సంస్థ ఎండీ, సీఈవో హర్‌దయాళ్‌ ప్రసాద్‌. మార్కెట్లలో అల్లకల్లోలం సర్దుమణిగిన తర్వాత కంపెనీ బలాలు ముందుకు వస్తాయని అప్పుడు తిరిగి షేరు ధర కంపెనీ పనితీరును ప్రతిఫలిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, కంపెనీ ఆదాయం, వృద్ధి తప్పకుండా షేరులో కనిపిస్తాయని, ప్రస్తుత పతనం తాత్కాలికమేనన్నారు. కంపెనీ వృద్ధి అవకాశాలపై మాట్లాడుతూ..

మార్కెట్‌ పతనంలో ఈ 10 షేర్లను కొనవచ్చు

Monday 16th March 2020

మార్కెట్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పడు నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. గడిచిన రెండు వారాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ 17.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ధీర్ఘకాలంలో ఈ షేర్లు రివకరి అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ తరుణంలో మంచి రాబడులను ఇచ్చే స్టాక్‌లకు ఎన్నుకోవడం కొద్దిగా కష్టం. తక్కువ వాల్యూయేషన్స్‌, బలమైన ఆర్‌ఓఈ(రెవెన్యూ ఆన్‌ ఈక్విటీ), స్థిరమైన ఆదాయం,

Most from this category