News


ప్రపంచ మార్కెట్లు లబోదిబో

Thursday 19th March 2020
Markets_main1584590257.png-32571

డోజోన్స్‌ 6%, ఎస్‌అండ్‌పీ 5% పతనం
20,000 పాయింట్ల దిగువకు డోజోన్స్‌
నెల రోజుల్లో 29 శాతం జారిన ఎస్‌అండ్‌పీ
కుప్పకూలిన ఎయిర్‌లైన్స్‌, హోటల్‌ స్టాక్స్‌
యూరోపియన్‌ ఇండెక్సులు 5.5% డౌన్‌
ఆసియా మార్కెట్లు 8-2.5% మధ్య వీక్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. వెరసి అమ్మకాలు వెల్లువెత్తి అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. బుధవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 6-5 శాతం మధ్య పతనంకాగా.. యూరోపియన్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే 6-4 శాతం మధ్య తిరోగమించాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలు ఉధృతంకావడంతో కొరియా, తైవాన్‌, ఇండొనేసియా, సింగపూర్‌, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌, చైనా, జపాన్‌ 8-2.5 శాతం మధ్య పడిపోయాయి.

ట్రంప్‌ కార్డ్‌..
ట్రంప్‌ ప్రతిపాదించిన 500 బిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజికి కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేసినప్పటికీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఆగకపోవడం గమనార్హం. ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు మరో 50 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని సైతం ట్రంప్‌ ప్రకటించారు. అయినప్పటికీ బుధవారం అమెరికా మార్కెట్లు తొలుత లాభపడినప్పటికీ చివరికి తోకముడిచాయి. డోజోన్స్‌ 1338 పాయింట్లు(6.3 శాతం) కుప్పకూలి 19,899కు చేరింది. వెరసి 20,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఎస్‌అండ్‌పీ 131 పాయింట్లు(5.2 శాతం) నీరసించి 2,398 వద్ద ముగిసింది. వెరసి ఫిబ్రవరి గరిష్టం నుంచి 29 శాతం దిగజారింది. ఇక నాస్‌డాక్‌ 345 పాయింట్లు(4.7 శాతం) నష్టపోయి 6,990 వద్ద నిలిచింది.

ఆర్థిక వ్యవస్థ కుదేల్‌
కరోనా కల్లోలం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ త్రైమాసికంలో 4 శాతం, వచ్చే క్వార్టర్‌లో 14 శాతం చొప్పున క్షీణించవచ్చని జేపీ మోర్గాన్‌ తాజాగా అంచనా వేసింది. వెరసి ఈ ఏడాది జీడీపీ 1.5 శాతం తిరోగమించే వీలున్నట్లు పేర్కొంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫెడ్‌ బాటలో బుధవారం యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) 118 బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి పంప్‌చేసింది. అయినప్పటికీ బుధవారం మార్కెట్లు పతనంకావడం గమనార్హం. 

బ్లూచిప్స్‌ డౌన్‌డౌన్‌
ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోతుండటంతో ఎయిర్‌లైన్స్‌, ఆతిథ్యరంగ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. హిల్టన్‌, మారియట్‌, హయత్‌ హోటల్‌ స్టాక్స్‌ 12-19 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక ఎస్‌అండ్‌పీ ఎయిర్‌లైన్‌ ఇండెక్స్‌ అయితే ఏకంగా 21 శాతం కుప్పకూలింది.
 You may be interested

కరోనాపై పోరుకు 650 కోట్ల డాలర్లు

Thursday 19th March 2020

ప్యాకేజీని ప్రకటించిన ఏడీబీ  కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌పై పోరుకు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) 650 కోట్ల డాలర్ల (రూ.48,100 కోట్లు)ప్యాకేజీని ప్రకటించింది. కోవిడ్‌-19 వైరస్‌ అతి పెద్ద ప్రపంచ ఉపద్రవంగా మారిపోయిందని  ఏడీబీ ప్రెసిడెంట్‌ మస్సాత్సు అసకవ వ్యాఖ్యానించారు. దీనిని ఎదుర్కొనడానికి జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తీవ్రమైన చర్యలు తీసుకోవలసి ఉందని వివరించారు. తమ సభ్య దేశాల తక్షణ అవసరాల నిమిత్తం 650 కోట్ల డాలర్ల ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు.

బాకీ మొత్తం కట్టాల్సిందే..

Thursday 19th March 2020

- స్వీయ మదింపులు కుదరవు - తప్పుడు వార్తలకు టెల్కోల ఎండీలదే బాధ్యత - కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాం - ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ - టెల్కోలు, కేంద్రానికి అక్షింతలు న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత  బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

Most from this category