News


వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీపై రిటర్న్‌ 20 శాతం!

Monday 30th September 2019
Markets_main1569815214.png-28612

‘నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులు ఫ్రంట్‌ లైన్‌(బ్లూచిప్‌ స్టాకులు) స్టాకులను మించి ప్రదర్శన చేయాలంటే మరికొన్ని ఆర్థిక చర్యలవసరం. ప్రస్తుతం నిఫ్టీ కన్సాలిడేషన్‌ దశలో ఉంది. వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీ 20 శాతం రిటర్న్‌ల్ని ఇస్తుందని అంచనా వేస్తున్నాం’ అని కోటక్ సెక్యూరిటీస్ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

గరిష్ఠ స్థాయిల వద్ద నిఫ్టీ స్థిరంగా ఉండదు...
ప్రస్తుత పరిస్థితులలో నిఫ్టీ 11,700-11,800 స్థాయిని అధిగమించవచ్చు. కానీ ఫలితాల సీజన్‌ ప్రారంభం కానుండడంతో ఆ స్థాయిల వద్ద నిఫ్టీ నిలకడగా ఉండలేదు. ఒక వేళ ప్రభుత్వం నుంచి నిర్థిష్ఠ చర్యలేమైనా ఉంటే నిఫ్టీ గరిష్ఠ స్థాయిల వద్ద నిలకడగా రాణించే అవకాశం ఉంది. 
   కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించిన తర్వాత మార్కెట్‌లు భారీగా ర్యాలీ చేశాయి. కానీ నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులు మాత్రం ఫ్రంట్‌ లైన్‌ స్టాకుల ప్రదర్శనను అధిగమించలేకపోయాయి. ఈ స్టాకులు, ఫ్రంట్‌లైన్‌ స్టాకులను అధిగమించాలంటే మరికొన్ని చర్యలవసరం. మార్కెట్‌లు ప్రాధమికంగా బలంగా ఉన్నప్పుడు, వృద్ధి అంచానాలు బాగున్నప్పుడు ర్యాలీ కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం మన మార్కెట్‌లో అవి లోపించాయి. రానున్న త్రైమాసికాలలో ఈ అంశాలు తిరిగి పుంజుకుంటాయని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం నిర్ధిష్ట స్టాకులలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది.

ప్రైవేట్‌ బ్యాంక్‌లపై సానుకూలం...
బ్యాంక్‌ నిఫ్టీ, ఈ వారంలో 3.5 శాతం లాభపడినప్పటికి, సెప్టెంబర్‌ సిరీస్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఎనిమిదేళ్ల దిగువకు పడిపోయింది. చాలా వరకు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌, నిఫ్టీ ట్రెండ్‌కు అనుగుణంగా ప్రదర్శన చేస్తుంటుంది. ఈ ఇండెక్స్‌లో అధికంగా అనిశ్చితికి గురయ్యే స్టాకులుండడంతో శాతాల పరంగా నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీని అధిగమించింది. కానీ ఈ ఇండెక్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్‌ స్టాకులలో లాభాల స్వీకరణ నిలకడ కొనసాగడంతోపాటు, యెస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ వంటి స్టాకులు స్థిరంగా నష్టపోవడంతో ఓపెన్‌ ఇంట్రెస్ట్ తగ్గిపోయిం‍ది. ప్రైవేట్‌ బ్యాంక్‌లపై ప్రస్తుతం బుల్లిష్‌గా ఉన్నాం. అయినప్పటికి అర్ధ వార్షిక సర్దుబాటులో(సెమీ యాన్యుల్‌ రీబాలెన్సింగ్‌) భాగంగా మా పోర్టుపోలియోలోని నిఫ్టీ బ్యాంక్‌లోని స్టాకుల మార్పుకు అవకాశం ఉంది. బ్యాంక్‌ నిఫ్టీకి సంబంధించి ‘తగ్గినప్పుడు కొనుగోలు చేయడం’ అనే విధానాన్ని అనుసరించడం మంచిది.

కన్సాలిడేషన్‌ దశలో నిఫ్టీ..
మార్కెట్ల భారీ ర్యాలీతో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ, హెచ్‌యూఎల్(హిందుస్తాన్‌ యూనిలీవర్‌), నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన షేర్లు వాటి ఆల్‌టైం గరిష్ఠాలకు చేరుకోవడం చూశాం. గత రెండేళ్ల నుం‍చి మార్కెట్‌ కన్సాలిడేషన్‌ దశలో ఉంది. గత పదేళ్ల డేటాను గమనిస్తే ప్రతి రెండేళ్ల కన్సాలిడేషన్‌ తర్వాతా మార్కెట్‌ 20 శాతం రిటర్న్‌లను ఇచ్చింది. అంతేకాకుండా వచ్చే ఏడాదిలో వాల్యుషన్‌ బేస్‌ తగ్గనుండడంతో జనవరి 2020 తర్వాత మార్కెట్‌లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయని అంచనా వేస్తున్నాం. సాంకేతిక పరంగా ఐసీఐసీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, మారికో, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్‌పై సానుకూలంగా ఉన్నాం. ఈ స్టాకులు వచ్చే రెండుమూడు వారాల్లో 4-5 శాతం రిటర్న్‌లను ఇచ్చే అవకాశం ఉంది.

ఈ రంగాలు ఇప్పట్లో పుంజుకోవు..
ఈ వారంలో నిఫ్టీ ఫార్మా, ఐటీ ఇండెక్స్‌లు నష్టాల్లో ట్రేడయ్యాయి. రూపీ, డాలర్‌ మారకంలో బలపడుతోంది. అంతేకాకుండా సమీప కాలంలో​రూపీ బలహీనపడుతుందని అనుకోవడం లేదు. అందువలన వచ్చే రెండుమూడు వారాల్లో ఈ ఇండెక్స్‌లు తిరిగి పుంజుకుంటాయని ఆశించడంలేదు. ప్రస్తుత పరిస్థితులలో ఇన్వెస్టర్లు నిర్ధిష్ఠ స్టాకులపై దృష్ఠి సారించడం మంచిది.



You may be interested

నష్టాలతో ప్రారంభం

Monday 30th September 2019

సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 38,760 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,491 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

హెచ్‌డీఐఎల్‌ ఎక్స్‌పోజరే ముంచింది!

Monday 30th September 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సంక్షోభానికి... రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు బ్యాంకు భారీగా రుణాలను సమర్పించుకోవడమేనని వెల్లడైంది. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్‌ అంగీకరించినట్టు సమాచారం. అంటే రుణ ఆస్తుల్లో 73 శాతాన్ని ఒకే ఖాతాకు బ్యాంకు ఎలా ఇచ్చిందన్నది

Most from this category