మరో 2-3 ఏళ్ల పాటు మార్కెట్లో ర్యాలీ
By Sakshi

దేశీయ ఈక్విటీ మార్కెట్లో మరో 2-3 ఏళ్ల ర్యాలీ కొనసాగుతుందని ఆనంద్ రాఠి షేర్స్, స్టాక్ బ్రోకర్స్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సేదాని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల ఎన్డీఏ పాలనకాలంలో ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన, జీఎస్టీ అమలు, మౌలికరంగ సదుపాయాల అభివృద్ది కార్యకలాపాలతో పాటు వ్యవస్థలో కీలకమైన పాలసీలను ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధికి పునాది పడిందని సేదాని అంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ మానిఫెస్టోలో ప్రకటించిన కొత్త పథకాలు ఈక్విటీ మార్కెట్ మరింత ర్యాలీ చేసేందుకు దోహదపడుతుందని ఆయనంటున్నారు. ఈ తరణంలో మరో రెండు, మూడేళ్ల పాటు స్టాక్ మార్కెట్లో బోర్డ్ - బేస్డ్ ర్యాలీ జరుగుతుందని సేదాని విశ్వసిస్తున్నారు. "ప్రస్తుతం నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి అంత బాగోలేదు. రేటింగ్ కంపెనీలు ఆయా కంపెనీల రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేయడం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు ఎన్బీఎఫ్సీ కంపెనీలకు సంబంధించి బలమైన ఫండమెంటల్స్‌తో అంటిపెట్టికొని ఉండాలి. ఎఫ్ఎంజీసీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్షియల్, స్పెషాలిటీ కెమికల్స్ రంగాలను నుంచి వృద్ధి, వాల్యూ అవకాశాలను అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. లార్జ్ క్యాప్ షేర్ల ధరలతో పోలిస్తే మిడ్‌క్యాప్ షేర్లు 10శాతం డిస్కౌంట్లో ఉన్నందున రానున్న సంవత్సరాల్లో మిడ్‌క్యాప్ షేర్లలో ర్యాలీ జరగవచ్చు" అని సేదాని అంచనా వేస్తున్నారు.
You may be interested
ఆయిల్ డిమాండ్ అంతంతే!
Friday 14th June 2019అంచనాలు తగ్గించిన ఐఈఏ ఈ ఏడాది ఆయిల్ డిమాండ్ పెరుగుదల తక్కువగా ఉంటుందని ఇంటర్నెషనల్ ఎనర్జీ ఎజెన్సీ(ఐఈఏ) శుక్రవారం అంచనా వేసింది. ప్రపంచ వాణిజ్యం అధ్వానంగా ఉండడంమే దీనికి కారణమని తెలిపింది. అయితే ఉద్ధీపన ప్యాకేజీలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి కారణంగా 2020లో చమురు డిమాండ్‌లో వృద్ధి ఉండొచ్చని తెలిపింది. 2019 రోజూవారీ డిమాండ్ పెరుగుదలను రోజుకు 12 కోట్ల బ్యారెల్‌గా అంచనా వేసింది. తాజాగా ఈ అంచనాలను 10
22 నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు
Friday 14th June 2019ఆహార పదార్థాలు, ఇంధన, విద్యుత్ ధరలు దిగిరావడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో 22 నెలల కనిష్టానికి దిగివచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెలలో 2.45శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో ఇది 3.07శాతంగా ఉండగా, గతేడాది(2018) ఇదే మేలో 4.78శాతంగా నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి. 1. ఆహార పదార్థాల ద్రవ్యోల్బం మేలో 6.99శాతానికి పరిమితమైంది. ఏప్రిల్