News


విప్రో సీఈవో రాజీనామా- షేరు వీక్‌

Friday 31st January 2020
Markets_main1580443301.png-31356

వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న నీముచ్‌వాలా

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ సీఈవో అబిదాలీ నీముచ్‌వాలా.. పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో సీఈవో పదవికి నీముచ్‌వాలా రాజీనామా చేసినట్లు విప్రో తాజాగా పేర్కొంది. అయితే కొత్త సీఈవోను ఎంపిక చేసేటంతవరకూ నీముచ్‌వాలా పదవిలో కొనసాగన్నుట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా విప్రోకు ఆయన అందించిన సేవలను కంపెనీ కొనియాడింది. కొత్త సీఈవో ఎంపికకు బోర్డు సన్నాహాలు ప్రారంభించినట్లు కంపెనీ తెలియజేసింది. గత నాలుగేళ్లలో సమర్థవంత కార్యాచరణతో కీలక కొనుగోళ్లు, డిజిటల్‌ బిజినెస్‌ వృద్ధి తదితరాలకు నీముచ్‌వాలా సహకరించినట్లు విప్రో లిమిటెడ్‌ చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. టీసీఎస్‌ నుంచి వచ్చిన నీముచ్‌వాలా విప్రోలో  2015 ఏప్రిల్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. తొలుత గ్రూప్‌ ప్రెసిడెంట్‌, సీవోవోగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి 2016 ఫిబ్రవరిలో సీఈవో పదవిని చేపట్టారు.

షేరు వీక్‌
సీఈవో నీముచ్‌వాలా రాజీనామా నేపథ్యంలో విప్రో కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 9.30 ప్రాంతంలో విప్రో షేరు 2 శాతం క్షీణించి రూ. 236 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 235 వరకూ నీరసించింది.



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 31st January 2020

హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, వేదాంత, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, అలెంబిక్‌ ఫార్మా, అరవింద్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భరత్‌ ఇమ్మునాలాజికల్‌&బయోలాజికల్‌ కార్పోరేషన్‌, బిర్లాసాఫ్ట్‌, యూనిటెక్‌, వీ-గార్డ్‌ ఇండస్ట్రీస్‌, కాస్ట్రోల్‌ ఇండియా, కామధేను, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలతో పాటు బీఎస్‌ఈలో సుమారు 185 కంపెనీలు తమ మూడో త్రైమాసిక గణాంకాలు విడుదల చేయనున్నాయి. 

12100 వద్ద నిఫ్టీ ప్రారంభం

Friday 31st January 2020

బడ్జెట్‌కు ముందురోజు మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 232 పాయింట్ల లాభంతో 41వేల పైన 41,146.56 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల పెరిగి 12100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధిని చైనా సమర్థవంతంగా ఎదుర్కోంటుందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత సానుకూల వాతావరణం నెలకొంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మునుపటి ముగింపు(71.48)తో పోలిస్తే 4పైసలు స్వల్పంగా బలపడి 71.44

Most from this category