News


విప్రో ఏడీఆర్‌ 3.4 శాతం డౌన్‌

Wednesday 17th April 2019
Markets_main1555491981.png-25187

 

రూ. 10,000 కోట్ల విలువైన బైబ్యాక్‌ ప్రకటించినప్పటికీ, ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడంతో మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో విప్రో అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ ఏడీఆర్‌ 4.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల ఆదాయ వృద్ధి 7–8 శాతం మేర వుండగా, విప్రో ఆదాయం 4 శాతమే పెరగడం విశ్లేషకుల్ని నిరాశపర్చింది. రూ. 325 ధరతో కంపెనీ బైబ్యాక్‌ ప్రకటించగా, క్రితం రోజు ఇక్కడ ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం క్షీణతతో రూ. 282 వద్ద క్లోజయ్యింది. కాగా మరో ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ సైతం 1.9 శాతం మేర క్షీణించి 10.37 డాలర్ల వద్ద ముగిసింది. ఈ రెండు కౌంటర్లలోనూ గత రాత్రి నాస్‌డాక్‌లో భారీ ట్రేడింగ్‌ పరిమాణం నమోదయ్యింది. 
బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు అప్‌....
గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో మరోవైపు బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు జోరుగా పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 3.5 శాతం పెరిగి 11.65 డాలర్ల వద్ద ముగియగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.3 శాతం జంప్‌చేసి 115.43 డాలర్ల వద్ద క్లోజయ్యింది.



You may be interested

పదేళ్లలో నిఫ్టీ రాబడి 150 శాతం

Wednesday 17th April 2019

విదేశీ ఇన్వెస్టర్లకు డాలరు రూపేణా రాబడులిచ్చిన ప్రపంచ టాప్‌ 20 సూచీల్లో నిఫ్టీ అత్యుత్తమ ప్రదర్శన కనపర్చింది. ఏ కాలపట్టికతో పోల్చినా నిఫ్టీ ర్యాంకింగ్‌ 5 దిగువకు తగ్గకపోవడం విశేషం. ఒక ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్లు కాలంలో వరుసగా 6 శాతం, 42 శాతం, 53 శాతం, 150 శాతం చొప్పున నిఫ్టీ కంపెనీల్లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు లాభాల్ని అందుకున్నారు. అమెరికాలోని డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ సూచితోపాటు

మళ్లీ రూ.8 లక్షల కోట్ల క్లబ్‌లోకి టీసీఎస్‌

Wednesday 17th April 2019

దేశీయ ఐటీ సేవల రంగంలో అగ్రగామి సంస్థ వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మళ్లీ రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌క్యాప్‌ క్లబ్‌లోకి చేరుకుంది.  ఈ షేరు గత రెండు రోజుల్లో 5 శాతానికిపైగా ర్యాలీ జరపడంతో మార్కెట్‌ క్యాపిటిలైజేషన్‌ మంగళవారం రూ.8లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది తొలిసారిగా ఈ క్లబ్‌లోకి చేరిన టీసీఎస్‌... కొద్ది నెలల క్రితం ఈ ట్యాగ్‌ను కోల్పోయింది.  తిరిగి నిన్న బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు 1.06శాతం లాభపడి రూ.2132.45ల

Most from this category