STOCKS

News


యస్‌ బ్యాంకు ర్యాలీ కొనసాగుతుందా..?

Saturday 5th October 2019
Markets_main1570215491.png-28725

యస్‌ బ్యాంకు షేరు శుక్రవారం కూడా స్వల్పంగా లాభపడింది. అంతకుముందు రోజు 30 శాతానికి పైగా పెరిగిన విషయం తెలిసిందే. బ్యాంకు ఫైనాన్షియల్స్‌ చాలా బలంగా ఉన్నాయని, ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితుల కంటే లిక్విడిటీ (బ్యాంకు వద్ద నిధులు) ఎక్కువే ఉందంటూ యస్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్‌ మీడియాకు ఇచ్చిన స్పష్టత స్టాక్‌ ర్యాలీకి తోడ్పడింది. మరి ఈ ర్యాలీ ఇక ముందు కూడా కొనసాగుతుందా..? అన్న సందేహం చాలా మంది ఇన్వెస్టర్లలో ఉంది. దీనిపై నిపుణుల అభిప్రాయం ఇలా ఉంది.

 

తదుపరి వ్యాపార కార్యకలాపాల వృద్ధి కోసం యస్‌ బ్యాంకుకు నిధుల అవసరం ఎంతో ఉంది. బ్యాంకు సైతం నిధులను సమీకరించే ప్రణాళికతోనే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈక్విటీ పెంపునకు ఆర్‌బీఐ నుంచి కూడా అనుమతి తీసుకుంది. కాకపోతే ఈ లోపే బ్యాంకు ప్రమోటర్‌ రాణా కపూర్‌ తన వాటాలను విక్రయించడం, ఆయన తనఖాలో ఉంచిన వాటాలను కూడా రుణమిచ్చిన సంస్థ విక్రయించేయడం స్టాక్‌ పతనానికి దారితీసింది. దీంతో ఏ ధర వద్ద పడితే ఆ ధరలో నిధుల సమీకరణ చేయబోమని, బ్యాంకు ప్రయోజనాల కోణంలో సరైన ధర వద్దే ఈ పని చేస్తామని రవనీత్‌ గిల్‌ తాజాగా స్పష్టం చేశారు. అయితే, అనలిస్టులు మాత్రం యస్‌ బ్యాంకు ఎంత వేగంగా నిధులను సమీకరించగలన్న దానిపైనే స్టాక్‌ ర్యాలీ ఆధారపడి ఉందంటున్నారు. లేదంటా ప్రస్తుత ర్యాలీ పరిమితమేనంటున్నారు. 

 

యస్‌ బ్యాంకు మరో నెల పాటు నిధుల సమీకరణను సాగదీస్తే స్టాక్‌పై మరింత ప్రభావం పడుతుందన్నారు ఐఐఎఫ్‌ఎల్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభిమన్యు సోఫత్‌. రవనీత్‌ గిల్‌ వ్యాఖ్యలు కొంత కాలం వేచి చూస్తామన్నట్టుగానే ఉండడంతో సోఫత్‌ ఈ విశ్లేషణ వ్యక్తం చేశారు. యస్‌ బ్యాంకు స్టాక్‌ ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్‌ 1 వరకు ఏకంగా 83 శాతం నష్టపోయి ఇంట్రాడేలో రూ.29.20 కనిష్ట స్థాయి వరకు పడిపోయిన దృశ్యాన్ని కళ్లారా చూశాం. ‘‘తనఖాలో ఉంచిన షేర్లను అమ్మేయడం జరిగింది. నిధులను పొదుపుగా వినియోగించుకునే క్రమంలో బ్యాంకు లోన్‌బుక్‌ సైజు త్రైమాసికం వారీగా తగ్గిపోతోంది. గడిచిన రెండు వారాల కనిష్ట ధర ఆధారంగా బ్యాంకు నిధులను సమీకరించొచ్చు. ఇతర బ్యాంకుతో విలీనం విషయమై బ్యాంకుపై ఒత్తిడేమీ లేదు. ఇప్పుడు నిధులను సమీకరించడం అన్నది బ్యాంకుకు ఎంతో కీలకం. ఇది జరిగితే బ్యాంకుకు అది అతిపెద్ద సానుకూలం అవుతుంది’’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనుషా రహేజా వివరించారు. 

 

‘‘యస్‌ బ్యాంకు 2021 ఆర్థిక సంవత్సరం అంచనా పుస్తక విలువకు 0.4 రెట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధరకు రెట్టింపు వద్ద నిధులను సమీకరించినా కానీ, పుస్తక విలువ గణనీయంగా తగ్గిపోతుంది. ఇది రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీపైనా ప్రభావం చూపుతుంది. ఎన్నో రిస్క్‌లు, అనిశ్చితుల నేపథ్యంలో ఈ స్టాక్‌కు హోల్డ్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నాం’’ అని బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్‌ పేర్కొంది. యస్‌ బ్యాంకు స్టాక్‌లో వోలటాలిటీ రానున్న రోజుల్లో తగ్గొచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అంచనా వేశారు. ఆస్తుల నాణ్యత, నిధులను కాపాడుకోవడంపై బ్యాంకు దృష్టి పెట్టిందన్నారు.You may be interested

పండుగ చేస్కో!

Saturday 5th October 2019

రెపో, రివర్స్‌ రెపో రేట్లు పావు శాతం తగ్గింపు గృహ, వాహణ, వ్యక్తిగత రుణాలు చౌక వృద్ధి రేటును భారీగా తగ్గించిన ఆర్‌బీఐ ఎంపీసీ 2019-20కు 6.1 శాతంగా అంచనా ముంబై: దేశ వృద్ధికి ఆర్‌బీఐ విధానం మద్దతుగా నిలుస్తుందన్న మాటను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మరో విడత ఆచరణలో చూపించారు. ఇందుకు గాను కీలక రేట్లకు మరో పావు శాతం కోత పెట్టారు. రెపో, రివర్స్‌ రెపోలను 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున (0.25శాతం)

7 నుంచి సార్వభౌమ గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ

Saturday 5th October 2019

దసరా, దీపావళి పండుగల సందర్భంలో బంగారానికి సహజంగా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సందర్భాల్లో పెట్టుబడుల కోణంలోనూ బంగారం కొనే వారుంటారు. కనుక ఈ అవకాశాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం మలివిడత సౌర్వ భౌమ బంగారం బాండ్ల ఇష్యూను చేపట్టింది. ఈ నెల 7వ తేదీన ఇష్యూ ఆరంభమవుతోంది. ఈ నెల 11వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.    సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-5 కింద

Most from this category