News


ఈ కంపెనీలు డీపాల్ట్‌కు దగ్గరగా ఉన్నాయా?

Friday 30th August 2019
news_main1567141921.png-28103

  గత కొన్ని వారాల నుంచి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, ప్రస్తుతం చాలా కంపెనీల రుణాలు వాటి మార్కెట్‌ క్యాప్‌ కంటే అధికంగా మారాయి. బీఎస్‌ఈలో నమోదైన 190 కంపెనీలను తీసుకుంటే వాటి మొత్తం రుణాలు అగష్టు 26, 2019 నాటికి, రూ. 18.89 లక్షల కోట్లుగా ఉండగా, ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 5.54 లక్షల కోట్లను కూడా దాటలేదని ఏసీఈ ఈక్విటీ ఓ నివెదికలో తెలిపింది. ఎన్‌టీపీసీ, వోడాఫోన్‌-ఐడియా, శ్రే ఇన్ఫ్రా, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పవర్‌ ఫైనాన్స్‌ వంటి కంపెనీల రుణాలు వాటి మార్కెట్‌ విలువ కంటే అధికంగా ఉన్నాయి. 
    స్టీల్‌ తయారి, ఎగుమతి దారైనా నేషనల్‌ స్టీల్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, రుణాలు-మార్కెట్‌ క్యాప్‌ నిష్పత్తి 133 గా ఉంది. ఈ కంపెనీ రుణాలు రూ. 1,165.60 కోట్లుండగా, మార్కెట్‌ విలువ మాత్రం కేవలం రూ. 8.8 కోట్లుగా ఉంది. దీనితో పాటు టాటా టెలీసర్వీస్‌(మహారాష్ట్ర), యాడ్‌ల్యాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మెక్‌లియోడ్‌ రస్సెల్‌ ఇండియా, పీఎన్‌బీ గిల్ట్స్‌, స్టీల్‌కో గుజరాత్‌, హిందుస్తాన్‌ నేషనల్‌ గ్లాస్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల రుణాలు కూడా వీటీ మార్కెట్‌ విలువ కంటే 10 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. 

కంపెనీలను ముంచుతున్న రుణాల భారం...
‘అమెరికాలో ఏర్పడిన 2007-08 ఆర్థిక మాంద్యం తర్వాత చాలా వరకు దేశియ కార్పోరేట్‌ కంపెనీలు రుణాలను విపరీతంగా సేకరించడం మొదలుపెట్టాయి. రుణాలు, వడ్డీలు చెల్లింపులు పెరిగిపోతుండడంతో ఈ కంపెనీలు చివరికి రుణాల ఊబిలో కూరుకుపోయాయి’ అని యెస్‌ సెక్యురిటీస్‌ ప్రెసిడెంట్‌ అమర్‌ అంబానీ అన్నారు. చాలా వరకు కార్పోరేట్లు రుణాలను తీర్చడం కోసం తిరిగి రుణాలను చేస్తున్నారని, కంపెనీల రుణాలు, వాటి మార్కెట్‌ క్యాప్‌ మధ్య అసమతుల్యత..కార్పోరేట్‌ డీఫాల్ట్‌లకు సూచికని అంబాని తెలిపారు. రుణాలను తీర్చడం కోసం కంపెనీలు వాటి ఆస్తులను వేగంగా విక్రయించడం ఆర్థిక వ్యవస్థలో ఒక తీవ్ర సమస్యని, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఈ కంపెనీలు వాటి బ్యాలెన్స్‌ షీట్‌లను మెరుగుపరుచుకోవడం అంత సులభతరం కాదని తెలిపారు. ‘అదే సమయంలో, నగదు ప్రవాహం, మెరుగైన ఉత్పాదకతపై దృష్టి సారించిన కంపెనీలు కాలక్రమేణా మల్టీబ్యాగర్లుగా మారతాయి’ అని అంబానీ అభిప్రాయపడ్డారు. 

ఈ రంగాలలో కూడా డిఫాల్ట్‌లు...?
ముఖ్యంగా డీఫాల్ట్‌ల సమస్య హౌసింగ్ ఫైనాన్స్‌(హెచ్‌ఎఫ్‌సీ), ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు) లలో జరుగుతున్నప్పటికి, టెక్స్‌టైల్‌, టెలికాం, ఆటో, ఆటో అనుబంధరంగ కంపెనీలు, సిమెంట్‌ , మైనింగ్‌, రియల్‌ఎస్టేట్‌, పవర్‌, మౌలిక రంగం, ఇంజనీరింగ్‌ కంపెనీలలో కూడా ఈ సమస్య వెంటాడుతుండడాన్ని మరిచిపోకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టాటా స్టీల్ బీఎస్‌ఎల్‌, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అవధ్ షుగర్ అండ్‌ ఎనర్జీ, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, కెన్ ఫిన్ హోమ్స్, ఈమామి పేపర్, సుజ్లోన్ ఎనర్జీ, బాంబే డైయింగ్, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్‌, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, జెకె టైర్ అండ్‌ ఇండస్ట్రీస్ కంపెనీలన్నింటి రుణాలు వాటి మార్కెట్‌ విలువ కంటే అధికంగా ఉన్నాయి. ఈ కంపెనీలకు లిక్విడిటీ, ఆదాయాలు డౌన్‌గ్రేడ్‌ అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికంటే ఎక్కువ కాలం పాటు మందగమనంలో కొనసాగినట్టయితే ఈ కంపెనీ అంతర్గతంగా నిధుల ప్రవాహానికి మార్గాలను అన్వేషించుకోవాలి. కొన్ని కంపెనీలను రేటింగ్‌ సంస్థలు నిరంతరం పరిశీలించి వాటి రేటింగ్‌లను, బాహ్య దృక్పథాన్ని మారుస్తున్నాయి. ఇలాంటి పరిణామాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించాలని విశ్లేషకులు తెలిపారు.
   ఉదాహరణకు అం‍తర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ఐబీహెచ్‌) రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2 తగ్గించింది. అంతేకాకుండా ఈ కంపెనీ బాహ్య దృక్పథాన్ని ‘స్థిరమైన’ నుంచి ‘ప్రతికూల’ దృక్పథానికి మార్చింది. ఐబీహెచ్‌ లేదా ఇతర కంపెనీల రేటింగ్‌లు తగ్గడానికి గల కారణం ఈ కంపెనీలు ఖర్చులు, నిధుల లభ్యతలో సమస్యలను ఎదుర్కొవడమేనని ఈ  రేటింగ్‌ సంస్థ వివరించింది. అందువలన ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేముందు  ఆ స్టాకులను సమగ్రంగా విశ్లేషించి ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. You may be interested

సింగల్‌ బ్రాండ్‌ బాజా..!

Friday 30th August 2019

స్టోర్స్‌ ఏర్పాటుకు యాపిల్‌ తదితర దిగ్గజాల ఆసక్తి రిటైల్‌ నిబంధనల సడలింపుతో ఊతం ముందుగా ఆన్‌లైన్‌ అమ్మకాలు తర్వాత ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ఏర్పాటు     సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో ఇప్పటిదాకా ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలను కేంద్రం సడలించడంతో భారత్‌లో సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్న విదేశీ దిగ్గజ సంస్థల ప్రణాళికలకు ఊతం లభించినట్లయింది. దీంతో టెక్‌ దిగ్గజం యాపిల్‌ సహా పలు సంస్థలు భారత్‌లో సింగిల్‌ బ్రాండ్‌ విక్రయాలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశీ

డాలర్‌ ఎఫెక్ట్‌: నష్టాల్లో పసిడి

Friday 30th August 2019

డాలర్‌ ఇండెక్స్‌ నెలగరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 6 డాలర్లు నష్టపోయి 1,531 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెప్టెంబర్‌1 నుంచి 300 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై అమెరికా విధించబోయే అదనంగా 5శాతం పన్ను విధింపు అంశంపై అమెరికా వాణిజ్య అధికారులతో

Most from this category