News


బడ్జెట్‌ రోజున స్టాక్‌ ట్రేడింగ్‌ జరుగుతుందా..!?

Saturday 11th January 2020
Markets_main1578727505.png-30861

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈసారి యాధృచ్చికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు శనివారం అయింది. సాదారణంగా ప్రతి శనివారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు దినం. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు శనివారం కావడంతో స్టాక్‌ మార్కెట్‌ పనిచేస్తుందా లేదా అనే సందేహం మార్కెట్‌ వర్గాల్లో నెలకొంది. ఈ అంశంపై మీడియా వర్గాలు ఎక్స్‌ఛేంజీలను వివరణ కోరాయి. బడ్జెట్‌ రోజున పని చేసేందుకు సముఖంగా ఉన్నామని వారంలోపు దీనికి సంబంధించి ప్రకటను విడుదల చేస్తామని బీఎస్‌ఈ తెలిపింది. మరో ఎక్చ్సేంజీ ఎన్‌ఎస్‌ఈలో మాత్రం ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఇంతకుముందు 2015 ఫిబ్రవరి 28న బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు శనివారం ఐనప్పటికీ ఎక్చ్సేంజీలు పనిచేయలేదు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు (2019-20) పూర్తి బడ్జెట్‌ను జూన్‌5న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. షేర్ల బై బ్యాక్‌పై పన్ను విధింపు, లిస్టెట్‌ కంపెనీల్లో  ప్రభుత్వ కనీస వాటాను 25శాతం ఉంచి 35శాతానికి పెంచడం తదితర అంశాలతో మార్కెట్‌ వర్గాలకు మింగుడుపడకపోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ 0.98శాతం నష్టపోయింది. ఈ మరుసటి రోజు 2శాతం పతనమైంది. అదే ఏడాది ఫిబ్రవరి 1న పీయూష్‌ గోయిల్‌ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ రోజున బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.60శాతం పెరిగింది. You may be interested

ఇకపై ఇన్ఫోసిస్‌ వృద్ధి మరింత స్పీడ్‌?

Saturday 11th January 2020

రానున్న నాలుగైదేళ్లలో పటిష్ట పనితీరు ఇన్వెస్టర్లు కొత్త ధృక్పథంతో చూడాలి సెక్యులర్‌ వృద్ధిలో దేశీ ఐటీ కంపెనీలు గ్లోబల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ అంచనా దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రానున్న నాలుగు, ఐదేళ్ల కాలంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు గ్లోబల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ సహవ్యవస్థాపకులు ట్రిప్‌ చౌదరీ తాజాగా అంచనా వేశారు. ఇన్వెస్టర్లు సరికొత్త ధృక్పథంతో ఈ కంపెనీని చూడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌ ఫలితాలతోపాటు.. దేశ ఐటీ

ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి రూ. 45,000 కోట్లు..!?

Saturday 11th January 2020

కేంద్రం మరోసారి ఆర్‌బీఐ నుంచి మధ్యంతర డివిండెడ్‌ను పొందేందుకు పావులు కదుపుతోంది. పడకేసిన ఆర్థికవ్యవస్థను వృద్ధి బాటలో పయనింపజేసేందుకు కేంద్రం మధ్యంతర డివిడెండ్‌ రూపంలో ఆర్‌బీఐ నుంచి రూ.35,000 కోట్ల నుంచి రూ.45,000 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిసోస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆర్థిక వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి పతనవుతుందనే అంచనాలతో కేంద్రం ఆర్‌బీఐ తలుపు తట్టడమే మేలని భావిస్తోంది. ఆర్‌బీఐ సమకూర్చే ఈ మధ్యంతర డివిడెండ్‌ ద్వారా ఆర్థిక వ్యవస్థను

Most from this category