News


ప్రైవేట్‌ బ్యాంకుల స్వర్ణయుగం ముగిసిందా?

Monday 11th November 2019
Markets_main1573468893.png-29508

నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ మధ్య ఇన్వర్స్‌ రొటేషన్‌

ఇటీవల కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు నిఫ్టీ అత్యుత్తమ ప్రదర్శన జరుపుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకు షేర్ల అద్భుత ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ బలమైన ర్యాలీ చూపింది. పీఎస్‌యూ బ్యాంకుల ఆస్తుల నాణ్యతపై నీలినీడలు ముసురుతుంటే ప్రైవేట్‌ బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా మెరుగుపడుతూ వచ్చింది. దీంతో పీఎస్‌బీల కన్నా ప్రైవేట్‌బ్యాంకు షేర్లు మంచి లాభాలు చూశాయి. మొత్తం 8 ప్రైవేట్‌ బ్యాంకు షేర్లలో ఆరు షేర్లు పీఎస్‌బీలను తోసిరాజని ర్యాలీజరిపాయి. ఈ జోరుతో 2016తో పోలిస్తే 2019కి బ్యాంకు నిఫ్టీ 100 శాతం లాభపడింది. బ్యాంకు నిఫ్టీ ఏర్పాటైన 2000 సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికి సుమారు 3000 శాతం పెరిగింది. 2016నుంచి నిఫ్టీ ఇప్పటికి 70 శాతం, 2000 సంవత్సరం నుంచి ఇప్పటికి 700 శాతం లాభపడింది. బ్యాంకు నిఫ్టీలో అన్నింటికన్నా అత్యధికంగా కోటక్‌ మహీంద్రా బ్యాంకు భారీ లాభాలు ఆర్జించింది. ఈ షేరు 2000 సంవత్సరం నుంచి ఇప్పటికి 15040 శాతం లాభపడింది. తర్వాత స్థానాల్లో యాక్సిస్‌బ్యాంకు(13721 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(7191 శాతం), ఫెడరల్‌ బ్యాంకు(5971 శాతం), ఇండస్‌ ఇండ్‌ మరియు ఐసీఐసీఐ బ్యాంకు(చెరో దాదాపు 3000 శాతం) నిలిచాయి. ఇదే సమయంలో(2000-2019) పీఎస్‌బీల్లో పెద్దదైన ఎస్‌బీఐ కేవలం 1289 శాతం, బీఓబీ 644 శాతం లాభపడ్డాయి.  నిఫ్టీలో బ్యాంకు నిఫ్టీకి అధికంగా 40 శాతం వెయిటేజ్‌ ఉంది. రెండు సూచీల మధ్య కోరిలేషన్‌ 0.99 వద్ద ఉంది. బ్యాంకు నిఫ్టీకి చెందిన స్టాకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ మహీద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకులకు నిఫ్టీలో మంచి వెయిటేజ్‌ ఉంది.
తీరు మారుతోందా...


కొద్ది వారాల క్రితం వరకూ నిఫ్టీతో పోలిస్తే బ్యాంకు నిఫ్టీ దూకుడు చాలా స్పీడుగా ఉండేది. కానీ ఈ మధ్య ఈ సీన్‌ రివర్సయినట్లు కనిపిస్తోంది. బ్యాంకు నిఫ్టీ ఈ ఏడాది కేవలం 1 శాతం మాత్రమే లాభపడింది(నవంబర్‌ 8 క్లోజింగ్‌). ఇదే సమయంలో నిఫ్టీ 2. 5శాతం లాభపడింది. తాజాగా ఈ రెండు సూచీల చార్టుల్లో ఇన్వర్స్‌ రొటేషన్‌ ఏర్పడిందని టెక్నికల్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒక సూచీ టాప్‌ అవుట్‌ అవుతన్న వేళ మరొకటి బాటమ్‌ అవుట్‌ చెందడాన్ని ఇన్వర్స్‌ రొటేషన్‌ అంటారు. దీంతో ఇకపై బ్యాంకు నిఫ్టీ బుల్‌రన్‌కు ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకుల బుల్‌ రన్‌కు అడ్డుకట్ట పడినట్లేనని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలో బ్యాంకు నిఫ్టీలో టర్నెరౌండ్‌ ఉంటుందని తొందరలోనే తిరిగి నిఫ్టీని దాటి ప్రదర్శన చూపుతుందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీస్‌ ప్రతినిధి మిలాన్‌ వైష్ణవ్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు మరలా ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లే కారణమవుతాయని, తాజా టాక్స్‌ కట్‌తో ఈ బ్యాంకులకు మంచి లబ్ది కలుగుతుందని ఐడీబీఐ క్యాపిటల్‌ తెలిపింది. అందువల్ల వచ్చే త్రైమాసికం నుంచి తిరిగి ప్రైవేట్‌ బ్యాంకు షేర్లు సత్తా చూపుతాయన్నారు. దీర్ఘకాలానికి ప్రైవేట్‌ బ్యాంకు బెటరని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అభిమన్యు సూచించారు. ఇందుకు తగ్గట్లే సోమవారం ట్రేడింగ్‌లో బ్యాంకు నిఫ్టీ నాలుగు నెలల గరిష్ఠాలను తాకింది. You may be interested

బ్రోకరేజ్‌ల టాప్‌5 సిఫార్సులు

Monday 11th November 2019

వచ్చే 8 నుంచి 10 నెలల్లో 11-17 శాతం రిటర్న్‌లను ఇవ్వగలిగే టాప్‌ 5 స్టాకులను బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్నాయి. ఆ టాప్‌ 5 స్టాకులు ఇవే....   బ్రోకరేజి: ఆనంద్‌ రాఠి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: కొనచ్చు; టార్గెట్‌: రూ. 1,610; రిటర్న్‌: 11.4 శాతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ వ్యాపారం, గత ఆరేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ ఆదాయం  గత ఆరేళ్లలో ఏడు రెట్లు పెరగగా, లాభం 14 రెట్లు

బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో పాజిటివ్‌ ముగింపు

Monday 11th November 2019

ట్రేడింగ్‌ ఆద్యంత లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి స్వల్పలాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 21.47 పాయింట్లు పెరిగి 40,345.08 వద్ద, నిఫ్టీ 5పాయింట్ల లాభంతో 11,913 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 389 పాయింట్లు లాభపడి 4నెలల గరిష్టం 31,139 వద్ద ముగిసింది. ఆర్థిక, మీడియా, రియల్టీ రంగ షేర్లకు కూడా లాభపడ్డాయి. మరోవైపు

Most from this category