News


హిండాల్కో, ఎయిర్‌టెల్‌.. తదుపరి ర్యాలీకి లీడర్స్‌?!

Wednesday 27th November 2019
Markets_main1574828414.png-29889

నిపుణుల అంచనా
నిఫ్టీ సెప్టెంబర్‌ 19 నుంచి 1360 పాయింట్లు ర్యాలీ జరిపి మంగళవారం ఆల్‌టైమ్‌ హైని తాకింది. అయితే ఈ ర్యాలీ విస్తృతమైనది కాదని కేవలం కొన్ని స్టాకుల ప్రదర్శనే సూచీలను నడిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలలు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు షేర్ల దూకుడుతో మార్కెట్లు జీవిత కాల గరిష్ఠాలను చూశాయి. అయితే క్రమంగా ఈ జోరు అన్ని విభాగాల షేర్లకు పాకుతున్న సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇకపై ర్యాలీలో మరికొన్ని కొత్త స్టాకులు ఉత్తమ ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయంటున్నారు. ఈ కొత్త షేర్ల ఆలంబనతోనే సూచీలు ఇకపై మరింత ముందుకు సాగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ గణాంకాల ఆధారంగా పరిశీలించి హిండాల్కో, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఇన్ఫీ షేర్లు ఇకపై కొత్త నాయకులుగా అవతరిస్తాయని అంచనా వేస్తున్నారు. నవంబర్‌ సీరిస్‌లో హిండాల్కో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 63 శాతం పెరిగింది. ఎయిర్‌టెల్‌, ఇన్ఫీ, ఎస్‌బీఐల ఓఐ 55 శాతాన్ని మించి పెరిగింది. ఇదే సమయంలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకుల్లో లాంగ్‌ పొజిషన్ల ఓఐ వరుసగా 65, 130 శాతం పెరిగింది. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలల ఓఐలో పెద్దగా మార్పులు రాలేదు. ఇవన్నీ పరిశీలిస్తే ఇకపై కొత్త స్టాకులు ర్యాలీకి నాయకత్వం వహిస్తాయనిపిస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి రాజేశ్‌ పల్వియా అభిప్రాయపడ్డారు. 



You may be interested

సిటీ టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 27th November 2019

మిడ్‌క్యాప్‌ స్టాకులు ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ మంగళవారం సెషన్‌లో కొత్త గరిష్ఠాలకు చేరుకోవడంతో, ఈ ర్యాలీ అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తున్న మిడ్‌క్యాప్‌ స్టాకుల వైపు మరలుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 30 శాతం అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తుండడంతో, ఈ సమయంలో మిడ్‌క్యాప్‌లను కొనుగోలుచేయడం మంచిదని సిటీ పేర్కొంది.‘సాధరణంగా ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు మిడ్‌క్యాప్‌లు మంచి ప్రదర్శన చేస్తుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఈ నిర్ణయాన్ని

బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు

Wednesday 27th November 2019

గత సెషన్‌లో జీవిత కాల గరిష్ఠాన్ని ఏర్పరిచిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, బుధవారం సెషన్‌లో ఆ గరిష్ఠాన్ని అధిగమించి మరొక కొత్త రికార్డును ఏర్పరిచింది. గత సెషన్‌లో 31,718.35 పాయింట్ల వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌ బుధవారం సెషన్‌లో 31,832.75 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే గత సెషన్‌లో ఏర్పరిచిన 31,796.20 స్థాయిని అధిగమించి 31,893.50    పాయింట్ల వద్ద కొత్త జీవిత కాల గరిష్ఠానికి చేరుకుంది.

Most from this category