STOCKS

News


మార్కెట్లు పడతాయా.. పెరుగుతాయా..?

Friday 31st January 2020
Markets_main1580494405.png-31380

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మార్కెట్‌ను ఉత్సాహపరిచే పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్య స్థాయిని మించినాకానీ, వృద్ధి రేటు పెంపే ప్రధాన కర్తవ్యం కావాలన్న ఆర్థిక సర్వే సూచనల నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్లో కచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలకు చోటిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

 

అయితే, బడ్జెట్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తుందా..? భారీగా పడిపోతుందా..? అన్న భయాలు చాలా మంది ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. గత చరిత్రను చూస్తే మార్కెట్లు బడ్జెట్‌ రోజు ప్రతికూలంగా స్పందించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో బడ్జెట్‌ రోజన మార్కెట్లు నష్టపోయిన సందర్భాలు మూడున్నాయి. ఐదు సందర్భాల్లో ఒక శాతానికి పైగా పెరగడం, పడిపోవడం జరిగింది. ఎక్కువ సందర్భాల్లో అయితే సెన్సెక్స్‌, నిఫ్టీ బడ్జెట్‌ రోజున భారీ కుదుపులకు లోనయి, ఆ తర్వాత వారం రోజుల్లో మళ్లీ పుంజుకున్నాయి. 2019లో నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌ సమర్పించిన రోజున ప్రధాన సూచీలు ఒక శాతం మేర నష్టపోయాయి. ముఖ్యంగా లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచే చర్యలను సెబీ తీసుకోవాలని బడ్జెట్లో పేర్కొనడం, అధిక ఆదాయ వర్గాలు, ఎఫ్‌పీఐలపై ఆదాయపన్ను సర్‌ చార్జీని భారీగా పెంచుతూ చేసిన ప్రతిపాదనలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆ తర్వాత కూడా ఈ అంశాలు మార్కెట్లలో గణనీయమైన నష్టాలకు కారణమయ్యాయి. కనుక నిర్మలా సీతారామన్‌ రెండో బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చే, మార్కెట్‌ను ఉత్సాహపరిచే చర్యలు ఉండడమే కాకుండా, గత బడ్జెట్‌లో మాదిరి ప్రతికూల ప్రతిపాదనలు లేకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.

 

2018లోనూ బడ్జెట్‌ రోజున మార్కెట్లు నష్టపోయాయి. ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును ప్రవేశపెట్టింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఆ తర్వాతి వారం రోజుల్లో సూచీలు 4 శాతం నష్టపోయాయి. అంటే గత రెండు బడ్జెట్లలోనూ ప్రతికూల ప్రతిపాదనలు మార్కెట్ల సెంటిమెంట్‌ను గండికొట్టాయి. ఈ తరహా  చర్యలు తాజా బడ్జెట్‌లో ఉంటాయా? అన్నది పెద్ద సందేహం. బడ్జెట్‌ రోజున మంచి లాభాలను ఇచ్చిన సందర్భం గత పదేళ్లలో 2017 అనే చెప్పుకోవాలి. 2017 సంవత్సరం బడ్జెట్‌ రోజనున సూచీలు 1.76 శాతం పెరిగాయి. 2009 బడ్జెట్‌ మార్కెట్లకు బ్లాక్‌ డే అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజున సెన్సెక్స్‌ ఏకంగా 6 శాతం నష్టపోయింది. యూపీఏ-2 నుంచి బలమైన సంస్కరణలను మార్కెట్‌ ఆశించింది. కానీ, ఆశించినది జరగకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. 2013లో బడ్జెట్‌ రోజున 1.5 శాతం, 2012లో 1.19 శాతం సూచీలు నష్టపోయాయి. 2016లో బడ్జెట్‌ అనంతరం 7.2 శాతం ర్యాలీ చేయగా, 2012లో 3 శాతం, 2011లో 3.5 శాతం, 2010లో 4.1 శాతం ర్యాలీ జరిగింది. బడ్జెట్‌ తర్వాత రోజుల్లో గత పదేళ్లలో 6 సంవత్సరాల్లో లాభాల ర్యాలీ జరిగింది.You may be interested

‘‘అరవింద్‌’’ సమేత..

Saturday 1st February 2020

(అప్‌డేటెడ్‌...) తెలుగు వ్యక్తికి ఐబీఎం పగ్గాలు సీఈవోగా అరవింద్ కృష్ణ నియామకం బోర్డులోనూ చోటు; ఏప్రిల్‌ 6 నుంచి అమల్లోకి న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తరవాత... మరో అమెరికన్‌ ఐటీ దిగ్గజానికి సారథ్యం వహించే అవకాశం ఇంకో తెలుగు వ్యక్తికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ కృష్ణ (57)... ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సీఈవో) నియమితులయ్యారర్లీ 200 బిలియన్‌ డాలర్ల సంస్థ డైరెక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది.

ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపార విక్రయం?

Friday 31st January 2020

ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల ప్రముఖ కంపెనీ లార్సన్‌అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. లిస్డెడ్‌ కంపెనీ అయిన ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ పరిధిలో ప్రస్తుతం అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారం నడుస్తోంది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌కు ప్రమోటర్‌ ఎల్‌అండ్‌టీయే. కంపెనీ నుంచి విస్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా దీనిపై ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రధానం కాని వ్యాపార

Most from this category