News


నిఫ్టీ ఆప్షన్స్‌ ఏం సూచిస్తున్నాయి?

Saturday 29th June 2019
Markets_main1561810542.png-26692

దేశీయ మార్కెట్‌ గతవారం ఒత్తిడిలో ముగిసింది. నిఫ్టీ డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది, వీక్లీచార్టుల్లో బుల్లిష్‌ హరామీ ఏర్పాటు చేసింది. ఇకపై నిఫ్టీలో అప్‌మూవ్‌ ఉండాలంటే 10822 పాయింట్ల పైన బలంగా కొనసాగాల్సిఉంటుంది. ఒకవేళ ఫెయిలైతే తిరిగి 11650 స్థాయిలను చూడవచ్చు. ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 11500, 11000 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా ఉండగా, 12000, 12500 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. కొత్త పుట్‌రైటింగ్‌ 11500, 11300 పాయింట్ల వద్ద కనిపించగా కొత్త కాల్‌రైటింగ్‌ 12000, 12300 పాయింట్ల వద్ద ఎక్కువగా నమోదయింది. దీన్ని బట్టి నిఫ్టీ ఈ సీరిస్‌లో 12250- 11650 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని నిపుణుల అంచనా. ప్రస్తుతం ఇండియా వీఐఎక్స్‌ 15 స్థాయికి దగ్గరలో ఉంది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 313100 పాయింట్ల పైన క్లోజవలేకపోయింది. డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. బ్యాంకు నిఫ్టీలో అప్‌మూవ్‌ కొనసాగాలంటే 31వేల పాయింట్ల పైన బలంగా కదలాడాలి. లేదంటే 30600 పాయింట్ల వరకు దిగజారవచ్చు. నిఫ్టీ ఫ్యూచర్స్‌ ప్రస్తుతం 11843 పాయింట్ల వద్ద ఉంది. ఇకపై సూచీలో మరో దఫా డౌన్‌ లెగ్‌ మూవ్‌ ఉండొచ్చని షేర్‌ఖాన్‌ అంచనా వేసింది. నిఫ్టీ పైకి వచ్చినప్పుడల్లా షార్ట్‌కు అవకాశంగా భావించాలని సూచించింది. 11911 పాయింట్లకు వచ్చినప్పుడు నిఫ్టీని షార్ట్‌ చేయవచ్చని, షార్ట్‌ టార్గెట్‌ 11625, 11500 పాయింట్లని తెలిపింది. జూలై సీరిస్‌లో కెనరాబ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, ఐడీబీఐ, ఆర్‌ఈసీ కౌంటర్లలో లాంగ్‌ బిల్డప్‌ జరిగింది. 



You may be interested

స్మాల్‌క్యాప్‌లో రేసు గుర్రాలు!

Sunday 30th June 2019

దీర్ఘకాలానికి మన మార్కెట్లు ఈ స్థాయిల నుంచి మంచి రాబడులను ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని, నాణ్యమైన స్టాక్స్‌ను వెతికి పట్టుకుని క్రమంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఆ విధంగా చూసినప్పుడు అధిక రాబడులు కోరుకునే వారు, స్మాల్‌క్యాప్‌ విభాగంలో నాణ్యమైన స్టాక్స్‌ కోసం వీటిని పరిశీలించొచ్చన్నది వ్యాల్యూ రీసెర్చ్‌ సూచన.   భారత్‌ రసాయన్‌ 1989లో ఏర్పాటైన ఈ కంపెనీ టెక్నికల్‌ గ్రేడ్‌ రకం పురుగుమందుల ఫార్ములేషన్స్‌ను తయారు చేస్తోంది. బీ2బీ విభాగంలో

తుఫాను ముందు నిశ్శబ్దం?

Saturday 29th June 2019

సూచీల్లో పెరుగుతున్న డౌన్‌సైడ్‌ ఒత్తిడి నిఫ్టీ తన సరాసరి ట్రెండ్‌లైన్‌కు అటుఇటుగా ట్రేడవుతూ వస్తోంది. నిఫ్టీలోని వివిధ రంగాల్లో కొన్ని డౌన్‌ట్రెండ్‌లో, కొన్ని అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. అందువల్ల సూచీలు స్పష్టంగా ఒక ట్రెండ్‌ ఏర్పరుచుకోలేకపోతున్నాయి. అయితే అంతర్లీనంగా సూచీలో డౌన్‌సైడ్‌ ఒత్తిడి పెరిగిపోతోందని, నిఫ్టీ 11600 పాయింట్లను కోల్పోతే డౌన్‌ట్రెండ్‌ బయటపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌ వరకు కొత్తగా పొజిషన్లు తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బడ్జెట్టే

Most from this category