News


మీ కంపెనీ సెప్టెంబర్‌లో ఏజీఎం నిర్వహిస్తోందా..?

Thursday 20th February 2020
Markets_main1582137528.png-31941

చివరి ఘడియల వరకు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)ను కంపెనీలు వాయిదా వేయడం మంచి సంకేతం కాదంటున్నారు విశ్లేషకులు. నిబంధనల ప్రకారం గడువు ముగియడానికి చివరి సమయంలో ఏజీఎంను కంపెనీలు నిర్వహిస్తున్నాయంటే అనుమానించాల్సిన అవసరం ఉందంటోంది ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌). ఈ సంస్థ తన బ్లాగ్‌లో ఈ విషయమై పోస్ట్‌ను పెట్టింది. ‘‘బలహీనమైన పనితీరు కలిగిన కంపెనీలు చివరి నిమిషం వరకు ఏజీఎం నిర్వహణకు కాలయాపన చేస్తున్నాయి. దీంతో వాటాదారులు కంపెనీ బలహీన ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టకపోవచ్చని, నూతన ఆర్థిక సంవత్సరంలోని పనితీరుపై వారి దృష్టి మరులుతుందని కంపెనీలు భావిస్తుండొచ్చు’’ అంటూ ఐఐఏఎస్‌ ఎండీ టాండన్‌ ఈ పోస్ట్‌లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

మారిన నిబంధనల ప్రకారం టాప్‌ 100 లిస్టెడ్‌ కంపెనీలు ఆర్థిక సంవత్సరం ముగిసిన ఐదు నెలల్లోగా ఏజీఎం నిర్వహించాల్సి ఉంటుంది. మార్కెట్‌ విలువ ఆధారితంగా టాప్‌ 100 కంపెనీలకు ఇది వర్తిస్తుంది. దీంతో మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వీలైనంత ముందుగా ఏజీఎం నిర్వహణకు ప్రాధాన్యం ఏర్పడింది. సెబీ నూతన నిబంధనలు అమల్లోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2019లో టాప్‌-500 కంపెనీల్లో 105 కంపెనీలు తమ ఏజీఎంను సెప్టెంబర్‌ చివర్లో నిర్వహించేందుకు నిర్ణయించినట్టు ఐఐఏఎస్‌ అధ్యయనం గుర్తించింది. ‘‘2018-19లో నిఫ్టీ 500లోని 479 కంపెనీల్లో 66 శాతం కంపెనీలు ఆగస్ట్‌, సెప్టెంబర్‌లోనే ఏజీఎం నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. 2014లో మా మొదటి అధ్యయనం నాటి గణాంకాలతో పోలిస్తే ఇందులో పెద్దగా మార్పు లేదు’’ అని టాండన్‌ వివరించారు. 

 

సెప్టెంబర్‌లో ఏజీఎం చేపట్టే కంపెనీల రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ రేషియో తక్కువగానే ఉంటున్నట్టు ఐఐఏఎస్‌ తెలిపింది. ఈ ధోరణిని పరిశీలించడం వరుసగా ఆరో ఏడాది అని పేర్కొంది. 2018-19లో నిఫ్టీ టాప్‌ 500 కంపెనీల్లో 40 కంపెనీలు నష్టాలను ప్రకటించగా, ఈ కంపెనీలన్నీ కూడా ఏజీఎంను సెప్టెంబర్‌లోనే నిర్వహించినట్టు ఐఐఏఎస్‌ తెలిపింది. దివాలా చర్యల కింద తొలి విడతగా గుర్తించిన 12 పెద్ద కంపెనీలు కూడా 2014-2017 మధ్య ఏజీఎంలను సెప్టెంబర్‌లోనే చేపట్టినట్టు ఈ సంస్థ వెల్లడించింది. దీంతో ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల పనితీరును నిశితంగా పరిశీలిస్తుండాలని ఈ సంస్థ సూచించింది.You may be interested

బొమ్మ బంపర్‌ హిట్‌..!

Thursday 20th February 2020

టికెట్ల అమ్మకాలు రయ్‌రయ్‌... గతేడాది 103 కోట్ల టికెట్లు సేల్‌ రూ.10,948 కోట్లు వెచ్చించిన సినీ ప్రియులు పైరసీతో సినీ రంగం నష్టపోతోందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకుల సంఖ్యేమీ తగ్గడం లేదు. సినిమా కలెక్షన్లు అలవోకగా వందల కోట్లు దాటడమూ ఆగడం లేదు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం భయాల్లాంటివి ఎలా ఉన్నా .. సినీ ప్రేమికులు రేటెంతైనా సరే టికెట్టు కొనుక్కుని చూసేందుకు మొగ్గుచూపుతున్నారని నివేదికలు

డీమార్ట్‌ అధినేత కొత్తగా కొన్న మూడు స్టాక్స్‌

Thursday 20th February 2020

డీమార్ట్‌ పేరుతో అత్యంత విలువైన రిటైల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, దేశంలో ముకేశ్‌ అంబానీ తర్వాత రెండో అత్యంత సంపన్నుడిగా అవతరించిన రాధాకిషన్‌ శివకిషన్‌ ధమానీ, టాప్‌ ఇన్వెస్టర్‌గానూ పరిచయస్తుడే. ఒకవైపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ప్రమోటర్‌గా ఉన్న ఆయన, మరోవైపు తన తొలి వ్యాపారమైన స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ను ఇప్పటికీ చురుగ్గానే కొనసాగిస్తున్నారు. డిసెంబర్‌ త్రైమాసికంలో రాధాకిషన్‌ ధమానీ కొత్తగా మూడు స్టాక్స్‌ను తన పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకున్నారు. అవి సింప్లెక్స్‌

Most from this category