News


అంతలోనే అంత ర్యాలీ..? తర్వాత ఏంటి..?

Wednesday 5th February 2020
Markets_main1580842088.png-31509

స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ రోజు గత శనివారం భారీ నష్టాల తర్వాత.. మంగళవారం భారీ లాభాల వర్షం కురవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఇంత ర్యాలీ చేసిన తర్వాత తదుపరి సూచీల గమనం ఏంటి? అన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...

 

చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సానుకూలం. మన విదేశీ మారక నిల్వలు త్వరలోనే అర ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటనున్నాయి. మోస్తరు ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారుల చేతుల్లో మరిన్ని వనరులు ఉంటాయి. ఇది కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతుంది. చైనాలో కరోనా వైరస్‌ విజృంభణ మన దేశానికి అవకాశాలు తెచ్చిపెడుతుంది.

- జి.చొక్కలింగం, ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ

 

మార్కెట్లు బడ్జెట్‌ రోజున మరీ అధికంగా అమ్మకాలకు గురయ్యాయి. బ్యారెల్‌ చమురు ధరలు 55 డాలర్ల వద్ద ఉండడంతో.. ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోటు అదుపులో ఉంటుంది కనుక.

- సంజీవ్‌ భాసిన్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌

 

బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం పూర్తయింది. చమురు ధరలు క్షీణించడం మన మార్కెట్లకు పెద్ద సానుకూలం. ఎంఎస్‌సీఐ పెట్టుబడులు వస్తాయన్న అంచనాతో షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. అధిక వెయిటేజీ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి.

- ఎస్‌.రంగనాథన్‌, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌

 

బడ్జెట్‌ భారం ముగిసింది. ఇన్వెస్టర్లు తాజా కాల్స్‌కు మొగ్గు చూపించారు. అదనంగా జనవరి నెల వాహన విక్రయ గణాంకాలు చక్కగా ఉన్నాయి. ఇతర ప్రతికూల వార్తలేవీ లేకపోవడం మార్కెట్ల ర్యాలీకి దోహదపడింది.

- ఉమేష్‌ మెహతా, శామ్కో సెక్యూరిటీస్‌

 

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, చమురు ధరల క్షీణత మంగళవారం స్టాక్స్‌ ర్యాలీకి దోహదపడ్డాయి. బడ్జెట్‌ అనంతరం దృష్టి ఇప్పుడిక కంపెనీల ఫలితాలు, స్థూల ఆర్థిక అంశాలపైకి మళ్లుతుంది. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మన మార్కెట్లకు సానుకూలం. అయితే కరోనా వైరస్‌ ఆందోళనల ప్రభావంతో సమీప కాలంలో మార్కెట్లలో అస్థిరతలు కొనసాగొచ్చు.

- అజిత్‌ మిశ్రా, రెలిగేర్‌ బ్రోకింగ్‌

 

వాట్‌ నెక్ట్స్‌..
నిఫ్టీ 11,980పైన ముగిసి డైలీ చార్ట్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. 200డీఎంఏను తాకిన తర్వాత నిఫ్టీ 200, 100 డీఎంఏల పైన క్లోజయింది. ప్రస్తుతం సూచీకి మద్దతు శ్రేణి 11,910-11,850కు మారింది. ఈ స్థాయిలకు పైన నిలదొక్కుకుంటే తదుపరి నిరోధ శ్రేణి 12,050-12,120 వరకు సూచీల గమనం ఉండొచ్చు.

- రోహిత్‌ సింగ్రే, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌

 

నిఫ్టీ ఇప్పుడిక 50 శాతం, 61.8 శాతం ఫిబోనాచి రీట్రేస్‌మెంట్‌ స్థాయిలు 12,020ను సమీపించింది. ఈ నిరోధ స్థాయికి పైన ట్రేడ్‌ అయితే తదుపరి 12,060-12,120 స్థాయిలకు వరకు వెళ్లొచ్చు. 11,900 బలమైన మద్దతు స్థాయి అవుతుంది. దీన్ని కోల్పోతే లాభాల స్వీకరణతో 11,875-11,855 వరకు వెళ్లొచ్చు.

- ఆదిత్య అగర్వాల్‌, యస్‌ సెక్యూరిటీస్‌You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాలు రూ.1,035 కోట్లు

Wednesday 5th February 2020

ఏజీఆర్‌ వడ్డీ కేటాయింపుల భారం  9 శాతం వృద్ధితో రూ.21,947 కోట్లకు ఆదాయం రూ.135కు పెరిగిన ఏఆర్‌పీయూ న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,035 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి) బకాయిల వడ్డీకి సంబంధించిన కేటాయింపులు, 3జీ నెట్‌వర్క్‌ పరికరాలపై తరుగుదల, తదితర అంశాల కారణంగా ఈ నష్టాలు వచ్చాయని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. కంపెనీకి వరుసగా మూడో

మల్టీబ్యాగర్‌ను గుర్తించడం కాదు.. కలసి నడవాలి..!

Wednesday 5th February 2020

ఒక స్టాక్‌ను మల్టీబ్యాగర్‌గా గుర్తించడంతోనే సక్సెస్‌ రాదని, అది మల్టీ బ్యాగర్‌ రాబడులు ఇచ్చేంత వరకు.. అవసరమైతే సుదీర్ఘకాలం పాటు ఆ స్టాక్‌లో పెట్టుబడులను కొనసాగించడం ముఖ్యమని పేర్కొన్నారు యూటీఏ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ వెట్రి సుబ్రమణియన్‌. లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ మధ్య అంతరం, మల్టీబ్యాగర్‌ విషయాలపై తన అనుభవాలను ఆయన ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.   స్మాల్‌క్యాప్‌ వర్సెస్‌ లార్జ్‌క్యాప్‌ ‘‘గత 20 ఏళ్ల డేటాను గమనించినట్టయితే లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్స్‌ అత్యంత

Most from this category