News


ప్రస్తుతం వేచి చూసే ధోరణే మంచిది: ఎంజెల్‌ బ్రోకింగ్‌

Wednesday 24th July 2019
Markets_main1563954294.png-27279

  • మిడ్‌క్యాప్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌ను పరిశీలించవచ్చు: మయూరేష్ జోషి

ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో మీడియా, ఎన్‌బీఎఫ్‌సీ, ఆటో రంగంలోని షేర్లపై వేచి చూసే ధోరణిని అనుసరించడం మంచిదని ఎంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్ జోషి ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

వీటి కోసం వేచి చూడడం మంచిది..
మీడియా రంగంలో జీ ఒప్పందం మార్కెట్లకు ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ కారణంగా ఆదాయాల వృద్ధి మందగించినప్పటికి ఈ కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. చం‍దాదారులు, మార్జిన్ల వృద్ధి కలిసొచ్చే అంశం. మీడియా రంగం గురించి మాట్లడుకుంటే జీ షేరు మంచి స్థాయిలోనే ఉంది. జీ ఒప్పంద వాల్యుషన్‌ల కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు. 
  ఆటో రంగలో ఉన్న మందగమనం ఎన్‌బీఎఫ్‌సీ రంగంపై కూడా ప్రభావం చూపింది. ఫలితంగా ఆటో రంగంపై ఆధారపడి నడుస్తున్న ఫైనాన్సింగ్ విభాగం నష్టాలను చవిచూసింది. ఉదాహరణకు  శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఆస్తి నాణ్యత పరంగా స్టేజ్‌ 3 స్థూల ఎన్‌పీఏ (నాన్‌ ప్రాఫిటబుల్‌ ఎసెట్స్‌)లు 7.4 శాతం, నికర ఎన్‌పీఏలు 5.7 శాతం వద్ద పెరుగుదలను చూశాయి.ఫలితంగా ఆటో, ట్రాక్టర్ ఫైనాన్సింగ్ విభాగంలో  వచ్చే నికర లాభాలపై ఇది గణనీయంగా ప్రభావితం చూపింది. ఎన్‌బీఎఫ్‌సీలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి వేచి చూసే ధోరణి అనుసరించడం మంచిది. 
    ప్రాథమికంగా మొత్తం ఆటో పరిశ్రమ అనిశ్చితిలో ఉంది. కంపెనీల వాల్యూమ్‌లు తగ్గాయి. గత రెండు, మూడు త్రైమాసికాల నుంచి ఈ రంగం నష్టాల్లోనే ఉంది. ఈ రంగంలో తిరిగి డిమాండ్‌ పుంజుకోవడానికి చాలా సమయం తీసుకోవచ్చు.  వాహనాల కొనుగోలుకు  సంబంధించిన వడ్డీ రేట్ల విషయంలో కూడా ఇంకా సమస్యలున్నాయి.  వ్యవస్థలో విక్రయం కాని వాహనాల జాబితా పెరగడం చూశాం. అంతేకాకుండా ఆటో కంపెనీలు ఉత్పత్తి కోతను విధించడం గమనించాం. ఇవన్ని వ్యవస్థలో ఈ రంగానికి డిమాండ్‌ తగ్గిందన్న విషయాన్ని తెలుపుతున్నాయి. రుతుపవనాలు సరియైన సమయంలో వచ్చి ఖరీఫ్‌ సీజన్‌ బాగుంటే తప్ప గ్రామీణ వినియోగం పెరగదు. ఇది ద్విచక్ర వాహనాల విక్రయాలపై ప్రభావం చూపనుంది. బీఎస్‌6 నిబంధనలకు మారడంతో వాహనా తయారి ఖర్చులు పెరిగనున్నాయి. ఇది కంపెనీల వాల్యుమ్‌లపై ప్రభావం చూపనుంది. ఆటోరంగంలో ఇన్వెస్టచేయడానికి కూడా సరియైన సమయం ‍ కోసం వేచి చూడడం మంచిది. 

ప్రైవేట్‌ పెద్ద బ్యాంకులు...
సాధారణంగా బ్యాంకులపై అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లేదా కోటక్ బ్యాంక్ వంటి బలమైన బ్యాంకుల రుణాల పంపిణీ వృద్ధి మందగించడం గమనించవచ్చు. కానీ ఈ కంపెనీల ఆస్తి నాణ్యత, మూలధనం వంటి పారామితులలో ఈ రంగంలోని ఇతర పోటిదారుల కన్నా ఇవి బలంగా ఉన్నాయి. వ్యవస్థలోకి లిక్విడిటీ తిరిగి అందుబాటులోకి రావడంతో మరికొద్ది త్రైమాసికాలలో డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ బ్యాంకులు అద్భుతమైన ప్రదర్శన చేస్తాయి. ఇతర బ్యాంకుల కంటే ఇవి బాగుండడంతో వీటి ప్రీమియంలు పెరిగే  అవకావం ఉంది. బ్యాంకింగ్‌ రంగంలో నాణ్యమైన పెద్ద ప్రైవేటు బ్యాంకులను పరిశీలించడం మంచిది. 

మిడ్‌క్యాప్‌లో ‘ఫెడరల్‌’
మిడ్‌ క్యాప్‌ రంగంలో ఫెడరల్ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులపై ఆశాజనకంగా ఉన్నాం. ఫెడరల్‌ బ్యాంక్‌ ఫలితాలు నిరాశపరిచినప్పటికి బ్యాలెన్స్‌ షీట్‌ వృద్ధిపై మేనేజ్‌మెంట్‌ ఆశాజనకంగా ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఏర్పడిన ఖాళీని పూడ్చడానికి ఫెడరల్‌ బ్యాంకుకు, కొన్ని గోల్డ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలకు మంచి అవకాశం ఉం‍ది. ఈ బ్యాంక్‌ ప్రస్తుత స్థాయిల వద్ద పుస్తకం విలువ కూడా ఆకర్షిణియంగా కనిపిస్తోంది. అందువలన మిడ్‌క్యాప్‌ సెక్టార్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌తో వెళ్లనున్నాం. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం క్రాష్‌

Wednesday 24th July 2019

స్టాక్‌ మార్కెట్‌ వరుస పతనంలో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం మరో 1శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 29,085.45 వద్ద ప్రారంభమైంది. నేటి ఇంట్రాడేలో బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనంతో 257 పాయింట్లు నష్టపోయి(0.85శాతం) 29000 స్థాయిని కోల్పోయి 28,871.00 వద్దకు క్షీణించింది. తదుపరి కాస్త రివకరీని సాధించి మిడ్‌సెషన్‌ కల్లా తిరిగి 29000 స్థాయిని తిరిగి అందుకుంది.

నిలిచిపోయిన ఆర్‌ఐఎల్‌, అరామ్‌కో డీల్‌..!

Wednesday 24th July 2019

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీకి చెందిన అరామ్‌కో ఆసక్తి చూపుతుందన్న విషయం తెలిసిందే కాగా, ఈ డీల్‌ నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో లెక్కించిన విలువకు.. ఆర్‌ఐఎల్‌ వాల్యుయేషన్‌కు అంతరం అధికంగా ఉన్న కారణంగానే ఈ డీల్‌ నిలిచిపోయినట్లు చెబుతున్నాయి. ఈ

Most from this category