News


భారీ పతనానికి కారణాలు..!

Tuesday 1st October 2019
Markets_main1569926387.png-28660

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో వరుసగా మంగళవారం ట్రేడింగ్‌లో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బ్యాంకింగ్‌ షేర్లు భారీగా పడిపోవడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 114.55 పాయింట్లు కోల్పోయి 11,359.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 361.92 పాయింట్లు కోల్పోయి 38,305.41 పాయింట్లు వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 377.75 పాయింట్లు పతనమయ్యి 28,725.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. భారీగా మార్కెట్లు పడిపోడానికి ప్రధాన కారణాలు..
బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి:
బ్యాంకింగ్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో భారీగా పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్‌ 2.44 శాతం నష్టపోయింది. యస్‌ బ్యాంక్‌ (22 శాతం), ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌(18 శాతం) షేర్లు భారీగా నష్టపోయాయి. కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం‍క్‌ షేర్లు తప్ప మిగిలిన బ్యాంక్‌ షేర్లన్ని నెగిటివ్‌లోనే ట్రేడయ్యాయి. మరికొన్ని కంపెనీల రుణ చెల్లింపు సామర్ధ్యంపై పుకార్లు రావడంతో మంగళవారం ట్రేడింగ్లో బ్యాంక్‌ షేర్లు నిట్టనిలువునా పడిపోయాయి. ఇండియా బుల్స్‌ గ్రూప్‌పై ప్రతికూల వార్తలు రావడంతో ఈ గ్రూప్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల షేరు విలువ  సోమవారం ట్రేడింగ్‌లో కూడా పడిపోయింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొండిబకాయిలు పెరిగే అవకాశం ఉందని జెఫరిస్‌ నివేదిక పేర్కొంది. కంపెనీల  రుణ చెల్లింపు సామర్ధ్యానికి, కంపెనీల రేటింగ్‌లకు మధ్య చాలా తేడా కనిపిస్తోందని ఈ నివేదిక తెలిపింది. కాగా అనిల్‌ ధీరూబాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌), కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, సీజీ పవర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎస్సార్‌ షిప్పింగ్‌ వంటి కంపెనీలకు అధికంగా రుణాలిచ్చిన యెస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా పడిపోయాయి.
బలహీనమైన స్థూల ఆర్థిక డేటా:
గత నాలుగేళ్లలో మొదటి సారిగా దేశ మౌలిక రంగం ఉత్పాదకత ఈ ఏడాది అగష్టులో పడిపోయింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో బలహీన డిమాండ్‌కు ప్రతీకని విశ్లేషకులు తెలిపారు. మౌలికరంగం ఇండెక్స్‌లోని బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌, సిమెంట్‌, ఎలక్ట్రిసిటీ వంటి ఎనిమిది కీలక రంగాల ఉత్పాదకత అగష్టులో 0.5 శాతం పడిపోయింది. మౌలికరంగంలో ఉత్పాదకత 2015 ఏప్రిల్‌లో చివరిగా పడిపోవడం గమనార్హం. 
తగ్గిన ఆటో విక్రయాలు:
సెప్టెంబర్‌ నెలకు సంబం‍ధించి దేశీయ దిగ్గజ ఆటో కంపెనీల వాహన విక్రయాలు పడిపోయాయి. ఎం అండ్‌ ఎం వాహన అమ్మకాలు సెప్టెంబర్‌లో 21 శాతం పడిపోగా, ఎస్‌ఎంఎల్‌ ఇసుజు 26 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 30 శాతం, అశోక్‌ లేలాండ్‌ 27 శాతం పడిపోయాయి. ఇది నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 0.7 శాతం పతనమవ్వడానికి కారణమయ్యింది. కానీ ఎస్కార్ట్స్‌ అమ్మకాలు 2.2 శాతం, అతుల్‌ ఆటో అమ్మకాలు 4 శాతం పెరగడం గమనార్హం.



You may be interested

మూడో రోజూ నష్టాలే ..11, 400 దిగువకు నిఫ్టీ!

Tuesday 1st October 2019

బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనం 362 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ 11400 దిగువన ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ మూడో రోజూ నష్టంతో ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సెన్సెక్స్‌ 362 పాయింట్లు పతనమై 38,305 వద్ద, నిఫ్టీ 114.55 పాయింట్లు నష్టపోయి 11,360 వద్ద ముగిశాయి. బలహీన ఆర్థిక గణాంకాలతో పాటు, నేడు పలు కంపెనీలు వెల్లడించిన అటోరంగ షేర్ల విక్రయాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం, పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభ

రాణా కపూర్‌ ఎఫెక్ట్‌: రెండోరోజూ కుప్పకూలిన యస్‌బ్యాంక్‌

Tuesday 1st October 2019

ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం మరోసారి భారీ నష్టాన్ని చవిచూశాయి. నేటి ఎన్‌ఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్లు రూ.42.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో ప్రైవేట్‌రంగ షేర్లకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 7శాతం మేర లాభపడ్డాయి. బ్యాంక్‌ ప్రధాన ప్రమోటర్‌ రాణా కపూర్‌ కంపెనీ మోర్గాన్‌ క్రెడిట్స్‌ తన మొత్తం వాటాలో 2.16శాతం వాటాకు సమానమైన 5.2కోట్ల ఈక్విటీ షేర్లను 26-27 తేదీల్లో ఓపెన్

Most from this category