News


ఇప్పుడు బంధన్‌ బ్యాంకే నయం: బందోపాధ్యాయ

Tuesday 1st October 2019
Markets_main1569869268.png-28636

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా బ్యాంకింగ్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అందుకు సూక్ష్మ రుణ సంస్థలనే సిఫారసు చేస్తానని చెప్పారు ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ గ్రూపు చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ. దురదృష్టవశాత్తూ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవల రంగం నుంచి దుర్వార్తలను వినాల్సి వస్తోందన్నారు. పీఎంసీ బ్యాంకు ఉదంతాన్ని ప్రస్తావించారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకును దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి ఆర్‌బీఐ తీసుకురావడం కూడా దురదృష్టకరంగా అభివర్ణించారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకుతో విలీనం కోసం ప్రయత్నం చేస్తున్న ఇండియాబుల్స్‌ హౌసింగ్‌పైనా ఈ ప్రభావం ఉంటుందన్నారు. ఇరు సంస్థలు ఎన్నో రకాలుగా వివరణలు ఇస్తున్నా కానీ, వీటికున్న రియల్‌ ఎస్టేట్‌ రుణ ఎక్స్‌పోజర్‌ కారణంగా ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గడం లేదని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగం పట్ల తాము చాలా అప్రమత్తతతో ఉన్నామని తెలిపారు. తాజాగా ఈ రంగంలో పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే సూక్ష్మ రుణ సం‍స్థలను పరిశీలించొచ్చని, ఈ విభాగంలో బంధన్‌ బ్యాంకును పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించారు. 

 

ఆటోమొబైల్‌ వాహన అమ్మకాల గణాంకాలు సెప్టెంబర్‌లోనూ బలహీనంగానే ఉంటాయని, గొప్ప గణాంకాలు వస్తాయని ఎవరూ ఊహించడం లేదన్నారు సుదీప్‌ బందోపాధ్యాయ. బజాజ్‌ ఆటో ఎగుమతి గణాంకాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. పండుగల అమ్మకాలపైనే ఎక్కువ అంచనాలు ఉన్నట్టు చెప్పారు. ఇండియాబుల్స్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు విలీనానికి ఎన్నో అడ్డంకులు ఉన్నట్టు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల విషయంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. ‘‘ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు రుణాలు ఇస్తోంది. ఎన్నో రుణాలను సమీకరించింది. ఇప్పటి వరకు రుణాలకు చెల్లింపులు చేస్తూనే ఉన్నారు. కానీ, నియంత్రణ సంస్థలకు (ఆర్‌బీఐ) ఆందోళనలు ఉ‍న్నాయి. లక్ష్మీ విలాస్‌ బ్యాంకు పరిస్థితి కూడా బాగాలేదు. దానికి తక్షణం ఆర్థిక మద్దతు అవసరం. అందుకే వీటి విలీనం విషయంలో ఆర్‌బీఐ ఎంతో ఆచితూచి వ్యవహరిస్తోంది’’ అని బందోపాధ్యాయ వివరించారు. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై మాట్లాడుతూ... ఒక ప్రభుత్వరంగ సంస్థను మరో ప్రభుత్వరంగ సంస్థకు విక్రయించడం ఇన్వెస్టర్లకు ఆకర్షణీయం కాబోదన్నారు. వ్యూహాత్మకంగా ప్రైవేటు ఇన్వెస్టర్‌కు విక్రయించడం అవసరమన్నారు. ప్రభుత్వం ఈ దిశగానే అడుగులు వేస్తోందని.. బీపీసీఎల్‌, కాంకర్‌ తదితర కంపెనీల విషయంలో ఇదే జరిగితే అది మార్కెట్‌కు అతిపెద్ద సానుకూలమవుతుందని అభిప్రాయపడ్డారు. You may be interested

ఆర్థిక రంగం... అంతా నిరాశే!

Tuesday 1st October 2019

ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్‌... ద్రవ్యలోటు... రూపాయి... విదేశీ రుణ భారం... ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి సోమవారం వెలువడిన లెక్కలన్నీ ఆర్థిక విశ్లేషకులకు నిరాశ కలిగిస్తున్నాయి. ఆయా అంశాలను పరిశీలిస్తే... ద్రవ్యలోటు... 5 నెలల్లోనే భయాలు..! ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు ఆగస్టు ముగిసే నాటికే 5,53,840 కోట్లకు చేరింది. 2019-2020 మొత్తంలో బడ్జెట్‌ నిర్దేశించుకున్న పరిమాణంలో ఇప్పటికే 78 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద

భారత్‌లో వ్యాపార వృద్ధిపై నిప్పన్‌ లైఫ్‌ దృష్టి

Tuesday 1st October 2019

జపాన్‌కు చెందిన అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఆర్‌నామ్‌)లో నియంత్రిత వాటాతో ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. కంపెనీలో రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఉన్న వాటాలను నిప్పన్‌ లైఫ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌నామ్‌లో నిప్పన్‌ లైఫ్‌ వాటా 75 శాతానికి చేరింది. తన రుణ భారాన్ని తగ్గించుకునేందుకు గాను ఆర్‌నామ్‌లో తన వాటాలను రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయించి

Most from this category