STOCKS

News


13శాతం లాభపడ్డ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Friday 9th August 2019
Markets_main1565333724.png-27664

ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో 13శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈ ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు రూ.446.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో షేరు ఒకదశలో 13.31శాతం పెరిగి రూ.503.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఉదయం గం. 11:00లకు షేరు కిత్రం ముగింపు ధర(రూ.444.35)తో పోలిస్తే 11.30శాతం పెరిగి రూ.494.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.425.40  రూ.1380.95లుగా నమోదయ్యాయ్యాయి.
ర్యాలీ ఎందుకంటే:-లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ విలీన ప్రక్రియ విజయవంతం కావడానికి ఇండియాబుల్స్‌ ఫౌండర్‌ గ్లెహట్‌ కంపెనీపై తనకున్న సర్వహక్కులను, నియంత్రణాధికారాలను వదులుకుంటాని ఆర్‌బీఐకి హామి ఇచ్చారు. అలాగే కంపెనీలో ప్రమోటర్‌ వాటా 10శాతానికి మించి ఉండకూదనే బ్యాంకు ప్రతిపాదనకు యాజమాన్యం ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి విలీనానికి అనుమతులు లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీపై వచ్చిన రూ.1లక్ష కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు తిప్పికొట్టడంతో కంపెనీ విజయవంతమైందని ఎడెల్వీజ్‌ కంపెనీ తెలిపింది. విలీనం ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియ అనేక అనిశ్చితి ఎదుర్కోంటుందని వ్యాల్యూవేషన్లను ఒత్తిడిలోకి నెడుతుందని ఎడెల్వీజ్‌ అభిప్రాయపడింది. నిర్వహణ అవుట్‌లుక్‌పై వీడని అనిశ్చితి, కొన్ని ఆరోపణలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటం అందోళన కలిగించే అంశాలుగా ఎడెల్వీజ్‌ పేర్కోంది. ఇటీవల తన నాన్‌ కోర్‌ వ్యాపారమైన రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొంతభాగాన్ని ఎంబసీ గ్రూప్‌నకు విక్రయించింది. దీంతో కంపెనీకి వ్యాపారలావాదేవీలకు సంబంధించి ఎలాంటి అంక్షలు లేవనే సంకేతాలను మార్కెట్‌కు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేర్లకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నిధుల మళ్లింపు ఆరోపణలు, కంపెనీలో ద్రవ్య కొరత పుకార్లతో ఈ ఏడాది కాలంలో ఈ షేర్లు 48శాతం క్షీణించాయి.You may be interested

ఏడాది గరిష్ఠానికి 9 స్టాకులు

Friday 9th August 2019

ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 9 స్టాకులు శుక్రవారం వాటి 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. అబోట్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు వాటి ఏడాది గరిష్ఠాన్ని తాకిన షేర్లలో ఉన్నాయి.  నీఫ్టీ 50 ఇండెక్స్‌లో 35 షేర్లు లాభపడి ట్రేడవుతుండగా, 15 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, వేదాంత, యుపిఎల్ షేర్లు

ఇన్వెస్టర్లకు రిస్క్‌ ఫండ్‌లపై ఆసక్తి!

Friday 9th August 2019

ధీరేంద్ర కుమార్  మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు, ప్రమాదకర ఫండ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వాల్యు రిసెర్చ్‌, వ్యవస్థాపకుడు, సీఈఓ ధీరేంద్ర కుమార్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకుంటున్నారు.. లిక్విడ్ ఫండ్స్‌తో పాటు, ఈక్విటీ ఫండ్స్ కూడా మంచి స్థితిలోనే ఉన్నాయి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోడానికి ఆత్రుతగా ఉన్నారు. ఒకసారి ఫోకస్ ఫండ్లలోకి

Most from this category