News


వాటా విక్రయ వార్తలతో బీపీసీఎల్‌ 4శాతం ర్యాలీ

Monday 18th November 2019
Markets_main1574052240.png-29665

కేంద్రం వాటా విక్రయ వార్తలతో ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌ షేరు సోమవారం బీఎస్‌ఈ ఎక్చ్సేంజీలో  2.50శాతానికి పైగా లాభంతో రూ.520.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 4.50శాతం వరకు లాభపడి రూ.528.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ505.90)తో పోలిస్తే 2.83శాతం లాభంతో రూ.520.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.261.00, రూ.547.50లు నమోదయ్యాయి.

వచ్చే మార్చికల్లా ఎయిరిండియా, బీపీసీఎల్‌లో వాటా విక్రయం: కేంద్ర ఆర్థిక మంతి
వచ్చే ఏడాది మార్చిలోగా ప్రభుత్వరంగ సంస్థలైన బీపీసీఎల్‌, ఏయిర్‌ ఇండియాల్లో ప్రభుత్వ వాటా విక్రయ ప్రకియను పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్దేశించుకున్న రూ.1.05 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరణ  లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రెండు సంస్థల్లో వాటాల అమ్మకం సహాయపడుతుందని ఆర్థికమంత్రి భావిస్తున్నారు. బీపీసీఎల్‌లో కేంద్రం తనకున్న 53.29 శాతం వాటాను విక్రయించేందుకు గత నెలలోనే అంగీకరించింది. ఈ మొత్తం విలువ దాదాపు రూ.65 వేలు ఉంటుంది. ఇక ఎయిర్ ఇండియాలో వాటాను విక్రయించడం ప్రభుత్వానికి ఇది రెండవ ప్రయత్నం. క్రితం ఏడాది ఎయిర్ ఇండియాలో కేంద్రం 76శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. అయితే వాటాల కొనుగోలుకు పెట్టుబడుదారులు ఆసక్తి చూపకపోడంతో ఈ ప్రతిపాదన విఫలమైంది. 



You may be interested

ఎయిర్‌టెల్‌ 6 శాతం జంప్‌..ఏడాది గరిష్ఠానికి షేరు

Monday 18th November 2019

టెలికాం ఎజీఆర్‌ వివాదంపై ప్రభుత్వం సానుకూల చర్యను తీసుకుంటుందని అంచనాలు మార్కెట్‌ వర్గాలు ఉన్నాయి. ఒకవేళ ఏజీఆర్‌ బకాయిలన్నింటిని ప్రభుత్వం చెల్లించమని ఆదేశించినప్పటికి, టెలికాం కంపెనీలు కన్సాలిడేట్‌ అయ్యి, భారతీ ఎయిర్‌టెల్‌ లబ్దిపొందుతుందంటూ బ్రోకరేజిల రిపోర్టులు వెలువడటంతో భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారం మరో 6 శాతం జంప్‌చేసింది. గత సెషన్లో 9 శాతం పైగా లాభపడి రూ. 393.05 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో కూడా అదే ర్యాలీని కొనసాగిస్తోంది. ఉదయం

బలపడిన రూపీ

Monday 18th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్‌లో 11 పైసలు బలపడి 71.68 వద్ద ప్రారంభమైంది. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో శుక్రవారం సెషన్‌లో(నవంబర్‌ 15) రూపీ డాలర్‌ మారకంలో 18 పైసలు బలపడి 71.79 వద్ద ముగిసింది. నవంబర్‌ 15 తో ముగిసిన వారంలో రూపీ డాలర్‌ మారకంలో ఏకంగా 50 పైసలు నష్టపోయి 71.79 స్థాయికి చేరుకుంది.

Most from this category