News


టాటా స్టీల్‌పై విశ్లేషకులు బుల్లిష్‌

Wednesday 27th November 2019
Markets_main1574848581.png-29901

యూరప్‌లో వున్న అనుబంధ కంపెనీలను పునరుద్ధరించడంతో పాటు, కంపెనీ ఉత్పత్తిని మెరుగుపరచడం, చౌక స్టీల్‌ దిగుమతులను ఇండియా నిషేదించడం వంటి అంశాల వలన టాటా స్టీల్‌ షేరు భవిష్యత్తులో మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా స్టీల్‌ గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌ రేషియో) రేషియో 4.7 వద్ద ట్రేడవుతోంది. ఇది ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇండెక్స్‌లో అత్యంత తక్కువ కావడం గమనార్హం. కాగా  గతేడాది ఈ కంపెనీ 50 శాతానికి పైగా తన అమ్మకాలను విదేశాలలో జరిపింది. గత వారం ఉద్యోగులను తగ్గించడం, ఇతర ఖర్చు నిర్వహణ చర్యలను యురొప్‌లో తీసుకోవడం, కంపెనీకి కలిసివస్తుందని విశ్లేషకులు తెలిపారు. ‘కనీస దిగుమతి ధరను విధించడంతో దేశీయ స్టీల్‌ ధరలు పుంజుకోవడం ప్రారంభించాయి’ అని ఈక్విరస్‌ సెక్యురిటీస్‌, ఎనలిస్ట్‌ సిద్ధార్థ గడ్కెర్‌ అన్నారు. ‘ఈ  విధంగా ధరలు స్థిరంగా ఉంటే ఇన్వెస్టర్లకు నమ్మకంగా ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.
    ఇండియాలో స్టీల్‌ డిమాండ్‌ 2020 నాటికి 7 శాతం విస్తరిస్తుందని వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ పేర్కొంది. స్టీల్‌ను వినియోగిస్తున్న టాప్‌ 10 దేశాలలో ఈ వృద్ధే అధికం కావడం గమనార్హం. అందువలన దేశీయంగా తమ సామర్ధ్యాన్ని పునరుద్ధరించేందుకు టాటా స్టీల్‌ ప్రయత్నిస్తోంది. చౌక స్టీల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన టాటా స్టీల్‌ దేశీయ విభాగాలు లాభపడనున్నాయి. వీటి వాల్యుషన్లు పెరగడం, ఉత్పత్తి మిశ్రమం మెరుగుపడడం, రుణ భారం తగ్గించుకునే చర్యలు పెరగడం వంటి కారణాలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి.  ‘కంపెనీ పైప్‌లైన్‌ విభాగం‍లోకి అడుగుపెట్టడంతో టాటా స్టీల్‌ అమ్మకాల పరిమాణం, మొత్తం పరిశ్రమ కంటే అధికంగా ఉంటుంది’ అని బ్లూమ్‌బర్గ్‌ ఇంటెలిజెన్స్‌, విశ్లేషకుడు రిచర్డ్‌ లేంగ్‌ అన్నారు. ‘ఆటో మొబైల్‌ రంగంలో డిమాండ్‌ తగ్గడంతో మొత్తం పరిశ్రమ వృద్ధి వచ్చే ఏడాది కూడా నెమ్మదిస్తుంది’ అని అన్నారు. దేశీయంగా కోరస్‌ గ్రూప్‌ పీఎల్‌సీని 13 బిలియన్‌ డాలర్లతో, భూషణ్‌ స్టీల్‌ను 5.3 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయడంతో టాటాస్టీల్‌ డెట్‌-ఈక్విటీ నిష్పత్తి ఇతర పోటి కంపెనీల కంటే అధికంగా ఉంది. అయినప్పటికి యూరొపియన్‌ వ్యాపారాలలో తీసుకుంటున్న ఖర్చు నియంత్రణ చర్యల వలన, తక్కువ లాభదాయకత ఉన్న కార్యకలాపాలు పుంజుకునే అవకాశం ఉందని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడింది. ‘డౌన్‌ సైకిల్‌లో అధిక రుణ భారం ఉన్న కంపెనీలు రాయితీతో ట్రేడవుతాయి’ అని ఈక్విరస్‌ సెక్యురిటీస్‌, గడ్కెర్‌ అన్నారు. ‘టాటాస్టీల్‌ లాభాలు, ప్రస్తుత స్టీల్‌ ధరలను పరిశీలిస్తే, కంపెనీ...దాని రుణాలను సులభంగా అధిగమిస్తుంది’ అని తెలిపారు.You may be interested

రాబోయే రోజులు చిన్నస్టాకులవే!

Wednesday 27th November 2019

కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ వచ్చే రెండేళ్లలో పెద్ద స్టాకులతో పోలిస్తే చిన్న స్టాకులు, డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌ ఎక్కువ రాబడినిచ్చే ఛాన్సులున్నాయని కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ అంచనా వేశారు. ఎకానమీ తిరోగమనంలో ఉంటే లార్జ్‌క్యాప్స్‌ గరిష్ఠాల వద్ద ఉన్నాయని చెప్పారు. కానీ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం ఇంకా తమ ఆల్‌టైమ్‌ హైలకు చాలా దిగువనే ఉన్నాయని తెలిపారు. ఎకానమీలో కనిపించే మందగమనమే విస్తృత స్థాయి మార్కెట్లో

ఎంఎస్‌సీఐ సూచీలో కీలక మార్పులు, చేర్పులు

Wednesday 27th November 2019

ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) ఇండియా సూచీలో కొత్తగా కొన్ని షేర్లను కలపడం, ఉన్నవాటిలో కొన్నింటిని తీసివేయడం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అసెట్‌మేనేజ్‌మెట్‌ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇన్ఫో ఎడ్జ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బర్గర్‌ పెయింట్స్‌ ఇండియా, కాల్గేట్‌ పాలిమాలివ్‌, డీఎల్‌ఎఫ్‌, సిమెన్స్‌ షేర్లను ఎమ్‌ఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో చేర్చాయి. మరోవైపు గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వోడాఫోన్‌ ఐడియా, యస్‌ బ్యాంక్‌ షేర్లను తొలగించింది.  ఎంఎస్‌సీఐ

Most from this category