News


రిలయన్స్‌పై విశ్లేషకులు బుల్లిష్‌గా ఎందుకున్నారు?

Tuesday 26th November 2019
Markets_main1574749992.png-29866

రిలయన్స్‌ జియో టారిఫ్‌లను పెంచేందుకు సిద్ధమవుతుండడంతో, గత కొన్ని సెషన్‌ల నుం‍చి గరిష్ఠ స్థాయిలో వద్ద ట్రేడవుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు, మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్‌ ప్రధాన వ్యాపారం బలహీనంగా ఉన్నప్పటికి, వినియోగధారిత  రిటైల్‌, టెలికాం వ్యాపారాలు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. ఇవి కంపెనీ స్టాక్‌ వాల్యుషన్లు పెరగడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఏడాది ప్రారంభం నుం‍చి ఇప్పటి వరకు గమనిస్తే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విలువ  38.9 శాతం పెరిగింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 13 శాతం వృద్ధి చెందింది. ఈ ప్రదర్శనతో దేశీయ మార్కెట్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిక విలువ కలిగిన కంపెనీగా నిలుస్తోందని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నవంబర్‌ 20 వ తేదీన రూ. 1,571 వద్ద కొత్త రికార్డును ఏర్పరిచి, రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌కు దగ్గరయిన విషయం గమనార్హం.
రిలయన్స్‌పై జేపీ మోర్గాన్‌..
    జియో టారిఫ్‌లను పెంచుతుందని గత వారం కంపెనీ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. అంతేకాకుండా టెలికాం సెక్టార్‌ను బలపరచడానికి, స్థిరమైన పెట్టుబడుల కోసం అవసరమైన చర్యలను తీసుకుంటుందని తెలిపింది. కాగా రిలయన్స్‌ జియో టారిఫ్‌లను పెంచే ప్రకటన, జియో ప్రత్యర్థి కంపెనీలయిన వొడాఫోన్‌-ఐడియా, ఎయిర్‌టెల్‌‍ వచ్చే నెల నుం‍చి టారిఫ్‌లను పెంచనున్నామని ప్రకటించిన తర్వాతా వెలువడింది. 35.5 కోట్ల కస్టమర్ల బేష్‌ ఉన్న రిలయన్స్‌ జియో టారిఫ్‌లను పెంచడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాకుపై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు తెలిపారు.  ‘టెలికాం సెక్టార్‌లోని కంపెనీలన్ని టారిఫ్‌లను పెంచనున్నామని పబ్లిక్‌గా ప్రకటించడంతో, ఈ సెక్టార్‌లోని తక్కువ ఏఆర్‌పీయూ(వినియోగదారుని సగటు రెవెన్యు) దశ ముగిసిందని అంచనావేస్తున్నాం’ అని జేపీ మోర్గాన్‌ విశ్లేషకుడు ఓ నివేదికలో నవంబర్‌ 20 న తెలిపారు. జియో వచ్చే రెండేళ్లలో  25 శాతం వరకు టారిఫ్‌లను పెంచితే, ఆర్థిక సంవత్సరం 21-22లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పాట్‌(పన్ను తర్వాత లాభం) 12 శాతం పెరుగుతుందని ఈ బ్రోకరేజి అంచనావేసింది. ‘టారిఫ్‌లను పెంచనుండడంతో జియో మల్టిపుల్స్‌ను 10 రెట్లు నుంచి 12 రెట్లుకు పెంచుతున్నాం. దీంతో ఆర్‌ఐఎల్‌ టార్గెట్‌ ధరను రూ. 1,400 నుంచి రూ. 1,565 కు సవరించాం. రిలయన్స్‌ ప్రధాన వ్యాపారం బలహీనంగా ఉన్నప్పటికి ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్‌ షేరు ఇండెక్స్‌ ప్రదర్శనను అధిగమించింది’ అని జేపీ మోర్గాన్‌ విశ్లేషకుడు తెలిపారు. ‘వినియోగధారిత వ్యాపారాలలో రీరేటింగ్‌, డీ లివరేజింగ్‌ జరుగుతుందనే అంచనాలు,  ప్రస్తుత స్థాయి నుంచి రిలయన్స్‌ షేరును నడిపిస్తాయని ఆశిస్తున్నాం. అయినప్పటికి  వాల్యుషన్‌ మల్టిపుల్స్‌ విస్తరించడం, ప్రధాన వ్యాపారం బలహీనంగా ఉండడం వంటి కారణాల వలను ఆర్‌ఐఎల్‌ షేరుపై న్యూట్రల్‌ రేటింగ్‌ను కలిగివున్నాం’ అని అన్నారు. 
బ్రోకరేజిలు రిలయన్స్‌పై బుల్లిస్‌..
    రాయిటర్స్‌ డేటా ప్రకారం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై 16 ‘స్ట్రాంగ్‌ బై’, 10 ‘బై’, ఐదు ‘హోల్డ్‌ లేదా న్యూట్రల్‌’, ఒకటి ‘సెల్‌’, ఒకటి ‘స్ట్రాంగ్‌ సెల్‌’ రేటింగ్‌లున్నాయి. ‘టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచడానికి సిద్ధమవుతుండడంతో , ఆర్‌ఐఎల్‌పై మా అంచనాలు, వాల్యుషన్లు పెరిగాయి’ అని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ తెలిపింది. అంతేకాకుండా ఈ బ్రోకరేజి నవంబర్‌ 21 వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో కంపెనీపై ‘బై’ రేటింగ్‌ను కలిగివున్నట్టు పేర్కొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై రూ. 1,700 టార్గెట్‌ ధరను కలిగివున్నామని ఎడెల్విస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, హోల్‌సేల్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జల్‌ ఇరాని అన్నారు. ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొత్తంగా 60 బిలియన్‌ డాలర్ల మూలధనాన్ని ఖర్చుచేసింది. ఇప్పుడు దీని ఫలితాన్ని కంపెనీ రెవెన్యు, లాభం వృద్ధి చెందుతుండడం వలన చూస్తున్నాం’ అని తెలిపారు. అధిక మొత్తంలో మూలధనాన్ని ఖర్చుపెట్టడం వలన, కంపెనీ లాభాల వృద్ధి వచ్చే ఐదేళ్లలో 12-15 శాతం వృద్ధి చెందుతుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ రిలయన్స్‌ రిఫైనరి వ్యాపారానికి సంబంధించి కంపెనీ 6 బిలియన్‌ డాలర్ల​ విలువ కలిగిన పెట్రోలియం కోక్‌-గ్యాసిఫైర్‌ ప్రాజెక్ట్‌ను వాణిజ్య ఉత్పత్తిగా ఈ డిసెంబర్‌ త్రైమాసికంలో లేదా మార్చి త్రైమాసికంలో కంపెనీ ప్రకటించనుంది’ అని తెలిపారు. ‘అదేవిధంగా అప్‌స్ట్రీమ్‌ ఆయిల్‌, గ్యాస్‌ సెక్టార్‌లో 6 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తిని వచ్చే ఏడాది మధ్యలో కంపెనీ ప్రారంభించనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వలన వార్షికానికి కంపెనీకి రూ. 10,000-14,000 కోట్లు జతకానున్నాయి. కేవలం టెలికాం కంపెనీ మాత్రమే కాదు, రిలయన్స్‌ సాంప్రదాయక వ్యాపారం కూడా లాభాదాయకంగా ఉంది’ అని అన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై రేటింగ్‌ ‘హోల్డ్‌’ నుంచి ‘బై’ కి ఎమ్కే గ్లోబల్‌ బ్రోకరేజి నవంబర్‌ 4న నవీకరించింది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం 21, 22 లో జియో ఇబిటా 3 శాతం, 20 శాతం చొప్పున పెరుగుతుందనే అంచనాలతో ఆర్‌ఐఎల్‌ షేరు టార్గెట్‌ ధరను రూ. 1,680 కి ఈ బ్రోకరేజి పెంచింది. ఇది ప్రస్తుత టార్గెట్‌ ధర నుంచి 9 శాతం అధికం. దీంతో పాటు రిలయన్స్‌ ఓ2సీ(ఆయిల్‌ టూ కెమికల్స్‌) వ్యాపారం 75 బిలియన్‌ డాలర్లగా(ఆరామ్‌కో డీల్‌ కలిపి) ఉంటుందని విలువకట్టింది. ‘ఆర్థిక సంవత్సరం 2021/22 లో కంపెనీ ఈపీఎస్‌ అంచనాలను 2 శాతం/15 శాతానికి పెంచుతున్నాం. అంతేకాకుండా ముందుకెళ్లే కొద్ది ఈఏపీ(ఏమ్కే ఆల్పా పోర్టుఫోలియో) లో  ఈ స్టాక్‌పై ఓవర్‌వెయిట్‌ కలిగివున్నాం’ అని ఏమ్కే విశ్లేషకులు తెలిపారు.
    ఈ ఏడాది అగష్టులో జరిగిన కంపెనీ జనరల్‌ మీటింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ముఖేష్‌ అంబాని మాట్లాడుతూ..కంపెనీ ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించనున్నామని, జియో ఫైబర్‌ సేవలను, బ్రాడ్‌ బ్యాండ్‌, టీవీ, ల్యాండ్‌ లైన్‌ సేవలను ప్రారంభించనున్నామని ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే 18 నెలల్లో కంపెనీని సున్నా రుణమున్న కంపెనీగా మార్చేందుకు, మేనేజ్‌మెంట్‌కు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను కలిగివుందని ఉందని తెలిపారు. You may be interested

టెలికాం షేర్లలో అమ్మకాల ఒత్తిడి

Tuesday 26th November 2019

టెలికం రంగ షేర్లు మంగళవారం ఉదయం సెషన్లో నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ రద్దు కావడంతో ఆయా కంపెనీలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్‌ఈలో టెలికం రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ టెలికాం ఇండెక్స్‌ 4శాతం మేర నష్టపోయింది. ఈ రంగానికి చెందిన భారతీ ఇన్ఫ్రాటెల్‌ 7శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 5శాతం, ఆప్టిమస్‌

2వారాల కనిష్టానికి పసిడి

Tuesday 26th November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 2వారాల కనిష్టానికి దిగివచ్చింది. అమెరికా చైనాల మధ్య మధ్యంతర వాణిజ్య చర్చలు త్వరలోనే సఫలం కాగలనే అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల నష్టంతో  1,453.80డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చలు ఇప్పటికి సాజావుగా జరుగుతున్నాయి. అలాగే ఈ వారంలో మెరుగైన ఆర్థిక గణాంకాలు వెలువడే అవకాశం ఉంది. ఇవన్ని ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు పురిగొల్పుతున్నాయి.

Most from this category