News


ఇన్సూరెన్స్‌ రంగంలో..ఈ మూడు స్టాకులు: ఐఐఎఫ్‌ఎల్‌

Friday 5th July 2019
Markets_main1562320607.png-26828

  • ఐసీఐసీఐ లొంబార్డో, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్టాకులను పరిశీలించవచ్చు
  • ఎఫ్‌ఎంసీజీ స్టాకులకై వేచి చూసే ధోరణి అవసరం: అభిమన్యు సోపత్‌

మార్కెట్‌ పరిస్థితి తక్కువ కాలవ్యవధిలో ఎలా ఉన్నప్పటికి వచ్చే రెండుమూడేళ్లలో  ఇన్సూరెన్స్‌ రంగం వృద్ధి చెందగలదని ఐఐఎఫ్‌ఎల్‌ వీపీ రిసెర్చ్‌ అభిమన్యు సోపత్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....

ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్‌కు వేచి చూడాలి...
ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాకుల కొనుగోలుకు రెండు విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటి వృద్ధి రేటు మందగించడం, రెండవది ఆర్థిక మందగమనం. ఆర్థిక మందగమనం ఓ రెండు మూడు నెలల పక్రియ కాదు. అది దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉంది. ఇంకో విషయం గమనించాలి. ఇళ్లలో పొదుపు రేటు 18 శాతానికి పడిపోయింది. దీనర్ధం ఏంటంటే వినియోగం పెరిగే అవకాశం ఉందని. గత రెండు మూడేళ్ల నుంచి ఈ రంగంలోని కొన్ని కంపెనీల వృద్ధికి వినియోగ వృద్ధి పెరగడమే కారణం అయ్యింది. కానీ ఇప్పుడు ఆర్ధిక మందగమనం నుంచి బయటపడి వినియోగ దారులకు అందుబాటులో నగదు దొరకక పోతే పొదుపు రేటు తగ్గిన వినియోగం పడిపోయే అవకాశం ఎక్కువ. ఈ రంగం‍లోని కంపెనీల మార్జిన్‌ల విస్తరణలో చాలా భాగం గత రెండు మూడు త్రైమాసికాల నుంచి గమనించాం. అందువలన వాల్యుషన్లు బాగున్నాచాలా వరకు స్టాకులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరియైన ధర స్థాయి కాదు. ఈ స్టాకుల వినియోగం ఎలా ఉందో గమనించాక వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించాలి. 

ఖరీదును పట్టించుకోవడం లేదు...
   స్వతంత్ర డైరక్టర్లు, ఆడిటర్‌లు వైదొలగడం, రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌లను తగ్గించడం వంటి చర్యలు కార్పోరేట్‌ ఇండియాకు సమస్యలుగా మారాయి. కంపెనీల నాణ్యత, వాటి స్థిరమైన వృద్థి ఉన్న కంపెనీల వైపు మదుపర్లు ఎప్పుడూ ఆకర్షితులవుతారు. టైటాన్‌ను ఉదాహరణగా తీసుకుంటే ఎక్కువ ఖరీదుతో ట్రేడవుతుంది. కానీ ఈ కంపెనీ సుమారు 23-24 రెట్లు వృద్ధి చెందుతుందని నమ్మేవారు ఉన్నారు. సహచర కంపెనీలకు రుణాలు దొరకడం కష్టమైన ఇటువంటి పరిస్థితులలో ఈ కంపెనీలు ఇలాంటి ప్రీమియంలను అనుభవిస్తున్నాయి. వీటి వృద్ధి రేటు 25శాతం మించి ఉండే అవకాశం ఉంది.  ఇప్పటికిప్పుడు మార్కెట్‌ సెంటిమెంట్‌ మారే అవకాశం లేదు. కాబట్టి బజాజ్‌ ఫైనాన్స్‌ లేదా టైటాన్‌ కంపెనీల భవిష్యత్తు ఊహించే విధంగానే ఉంది. ప్రజలు కూడా ప్రమాదకరమైన స్టాకులలో ఇన్వెస్ట్‌ చేయాలనుకోడం లేదు. ఆ కారణాన ఖరీదు అధికంగా ఉన్న పట్టించుకోవడం లేదు. ఈ స్టాకులు అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. 

ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో వృద్ధి  ...
  ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో మూడు కంపెనీల స్టాకులను పరిశీలించవచ్చు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ వైపు ఐసీఐసీఐ లొంబార్డ్‌ ను తీసుకోవచ్చు. ఎందుకంటే  జనరల్‌ ఇన్సూరెన్స్‌లో గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తున్నాం. ఈపీఎస్‌ వృద్ధి పరంగా ఇది వచ్చే మూడేళ్లలో మూడురెట్ల వృద్ధిని నమోదు చేయవచ్చు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వైపు ఎస్‌బీఐ లైఫ్‌ మార్కెట్‌ వాటా పెరుగుతోంది. ఎస్‌బీఐ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్‌ఐసీ నుంచి దీనివైపు మరలడానికి ప్రజలకు సౌలభ్యంగా ఉంది. ఈ కంపెనీ వాల్యుషన్ల పరంగా కూడా ఐసీఐసీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంటే చవకగా ఉండడంతో బాగా ప్రదర్శన చేసే అవకాశం ఉంది. ఎస్‌బీఐ ప్రస్తుత ధర స్థాయి వద్ద వాల్యుషన్లు అనుకూలంగా ఉన్నాయి. ఈ రెండు స్టాకులతో పాటు తక్కువ స్థాయిలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ను కూడా పరిశీలించవచ్చు. ఈ మూడు కంపెనీలు మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. చాలా వరకు కంపెనీల మార్జిన్‌లు 120-250 బేసిస్‌ పాయింట్లు విస్తరించి ఉండడంతో మార్కెట్‌ పరిస్థితి తక్కువ కాలవ్యవధిలో ఎలా ఉన్నప్పటికి వచ్చే రెండుమూడేళ్లలో ఈ రంగం వృద్ధి చెందుతుంది.  

 



You may be interested

ఒకేరోజు రూ. 730 పెరిగిన బంగారం

Friday 5th July 2019

బంగారం, విలువైన మెటల్స్‌ దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 12.5శాతానికి పెంచడంతో శుక్రవారం ఎమ్‌సీఎక్స్‌ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 2.14శాతం లాభపడింది. ఫలితంగా రూ.731 పెరిగి పది గ్రాములు రూ.34,948.00 గా ట్రేడవుతోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూ. 34,250.00 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ. 34,205.00 ఇంట్రడే కనిష్ఠాన్ని తాకింది. 

మార్కెట్‌కు బడ్జెట్‌ ఎందుకు నచ్చలేదు?

Friday 5th July 2019

కొత్త ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్‌ ఒకదశలో 600 పాయింట్ల కదలికలు చూపింది. మధ్యాహ్న సమయానికి నిఫ్టీ 11850 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ 39636 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి. బడ్జెట్‌ ప్రసంగం జరుగుతున్నంత సేపు స్వల్ప శ్రేణిలో కదలాడిన సూచీలు అనంతరం ఒక్కమారుగా పతనమయ్యాయి. బడ్జెట్లో ఇన్‌ఫ్రాపై భారీ వ్యయాలు పెంపు, ఎన్‌బీఎఫ్‌సీలకు ప్యాకేజీ, పీఎస్‌బీలకు అధిక మొత్తంలో రీక్యాప్‌ కల్పించడం, ఎస్‌టీటీ

Most from this category