News


లబ్ది ఎయిర్‌టెల్‌కా? జియోకా?

Saturday 15th February 2020
Markets_main1581745332.png-31821

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ మధ్య పోటీ తీవ్రం!
ఎయిర్‌టెల్‌ వ్యయాలు పెరగవచ్చంటున్న నిపుణులు
40 శాతం వొడాఫోన్‌ కస్లమర్లు ఎయిర్‌టెల్‌ చెంతకు?

ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా ఎలా స్పందించనుం‍దన్న అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీలు, వడ్డీలు, పెనాల్టీలు తదితరాలతో కలసి వొడాఫోన్‌ ఐడియా బకాయిలు రూ. 53,000 కోట్లను అధిగమించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గతేడాది రైట్స్‌ ఇష్యూ ద్వారా ప్రమోటర్లు వొడాఫోన్‌ ఐడియాలో కొంతమేర నిధులను పంప్‌ చేశారు. అయితే కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించింది. వెరసి వరుసగా ఆరో క్వార్టర్‌లోనూ నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. ఈ పరిస్థితులలో వొడాఫోన్‌ ఐడియా ప్రమోటర్లు మరోసారి ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చబోమంటూ ఇటీవల ప్రకటించారు. అంతేకాకుండా ఏజీఆర్‌ బకాయిల విషయంలో ప్రభుత్వం కలుగజేసుకోవాలంటూ గతేడాదిలోనే.. అభ్యర్థించారు. వడ్డీలు, పెనాల్టీలను రద్దు చేయడంతోపాటు.. ఏజీఆర్‌ అసలు బకాయిలను చెల్లించేందుకు పదేళ్ల గడువును కోరారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు టెలికం కంపెనీలన్నీ ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సిందేనంటూ ఆదేశించడంతో వొడాఫోన్‌ ఐడియా ఏం చేయనుందన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాన ప్రత్యర్ధి కంపెనీలలో రిలయన్స్‌ జియో.. స్వల్పంగా ఉన్న బకాయిలను ఇప్పటికే చెల్లించగా.. ఎయిర్‌టెల్‌ ఇందుకు అనుగుణంగా 300 కోట్ల డాలర్ల(సుమారు రూ. 21,000 కోట్లు)ను సమీకరించింది! 

ఎన్‌సీఎల్‌టీ దారి?
వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు కొనసాగడమే మేలని గత నెలలో భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్లు పేర్కొన్నారు. దేశీ మొబైల్‌ టెలికం రంగంలో మూడు కంపెనీలకు చోటున్నదని వ్యాఖ్యానించారు. ఇది పరిశ్రమకు మేలు చేయగలదని అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రభుత్వం స్పందించకుంటే కార్యకలాపాల మూసివేత(దివాళా) చేపట్టవలసి ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా గతంలోనే స్పష్టం చేసింది. దీంతో ఒకవేళ వొడాఫోన్‌ ఐడియా దివాళా ప్రక్రియ కోసం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయిస్తే నెలకొనే పరిస్థితులపై విశ్లేషకులు పలురకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా.. ఏజీఆర్‌ బకాయిల జాబితా ప్రకారం.. ఎయిర్‌టెల్‌ రూ. 35,586 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌ రూ. 13,823 కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ. 20,434 కోట్లు చొప్పున చెల్లించవలసి ఉంది. అయితే రిలయన్స్‌ జియో(రూ. 195 కోట్లు)  ఇప్పటికే చెల్లించింది.

నష్టమా.. లాభామా?
ఇండస్‌ టవర్‌ తదితరాల ద్వారా మొబైల్‌ టెలికం మౌలికసదుపాయాలను భారతీ ఎయిర్‌టెల్‌ పంచుకుంటున్న అంశాన్ని పరిశ్రమవర్గాలు ఈ సందర్భంగా పేర్కొంటున్నాయి. వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు నిలిచిపోతే ఇందుకు విఘాతం కలగవచ్చని తద్వారా వ్యయాలు పెరగవచ్చని చెబుతున్నాయి. టవర్ల షేరింగ్‌ తదితరాలకు అడ్డంకులు ఎదురైతే ఎయిర్‌టెల్‌కు నెట్‌వర్క్‌, కస్టమర్‌ సర్వీసింగ్‌ వ్యయాలు 15 శాతం వరకూ పెరిగే వీలున్నట్లు రీసెర్చ్‌ సంస్థ ఎస్‌బీఐ క్యాప్స్‌ తెలియజేసింది. దీంతో దశాబ్ద కాలంగా కస్టమర్లకు కంపెనీ అందిస్తున్న చౌక వ్యయాల సర్వీసులకు చెక్‌ పడవచ్చని అభిప్రాయపడింది. ఇండస్‌ టవర్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ మధ్య విలీనం పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు నిలిపివేస్తే.. ఎయిర్‌టెల్‌కు భవిష్యత్‌లో టవర్‌ కాంట్రాక్టు వ్యయాలు పెరిగే అవకాశమున్నట్లు రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ పేర్కొంది. అంతేకాకుండా పరిశ్రమలోని సమస్యలను నియం‍త్రణ సంస్థల దృష్టికి తీసుకువెళ్లే అంశంలో నమ్మకమైన భాగస్వామిని ఎయిర్‌టెల్‌ కోల్పోయినట్లవుతుం‍దని నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్‌ జియో.. విభిన్న వ్యూహాలతో వేగవంతంగా ఎదుగుతున్న నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా స్పందనకు ప్రాధాన్యత ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు నిలిచిపోతే..  కనీసం 40 శాతంమంది సబ్‌స్క్రయిబర్లను ఎయిర్‌టెల్‌ సొంతం చేసుకోగలుగుతుందని తద్వారా పెరగనున్న వ్యయాలను మించి లబ్ది పొందగలదని ఎస్‌బీఐ క్యాప్స్‌ అభిప్రాయపడింది.You may be interested

ఆధార్‌కార్డుతో పాన్‌ను ఇంకా లింక్‌ చేయలేదా? అయితే ఇది మీకే!

Saturday 15th February 2020

పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని పలుమార్లు సూచించిన ఆదాయ పన్నుశాఖ తేదీలను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా తుది హెచ్చరికను జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా ఆధార్‌ నెంబర్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేయాలి. లేదంటే లింక్‌ కాని పాన్‌ కార్డులు పనిచేయవని ఐటీ శాఖ ప్రకటించింది. మరి ఈ రెండింటిని ఎలా లింక్‌ చేయాలో తెలుసుకుందాం.. రెండే నిమిషాల్లో పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు.  పాన్‌కార్డును

5 శాతం జీడీపీ వృద్ధితో 15 శాతం ఈపీఎస్‌ వృద్ధి!

Saturday 15th February 2020

మెరిలించ్‌ సలహాదారు రాజ్‌శర్మ ఎకానమీలో జీడీపీ వృద్ధి బాగుంటే అది క్రమంగా కంపెనీల ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌లో ప్రతిబింబిస్తుందని మెరిలించ్‌ ఎండీ రాజ్‌శర్మ చెప్పారు. జీడీపీ 5 శాతం వృద్ది ఉంటే 15 శాతం ఈపీఎస్‌ వృద్ధి నమోదవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇండియా వాల్యూషన్లు చౌకగా లేవని కానీ దేశీయ వృద్ధి అవకాశాలు చూస్తే వచ్చే 3-5 ఏళ్లలో మార్కెట్లు మంచి వృద్ధినే నమోదు చేస్తాయని అంచనా వేశారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌కు

Most from this category