News


పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం: ఇన్ఫీ చైర్మన్‌

Tuesday 22nd October 2019
Markets_main1571739693.png-29060

 స్వల్పకాలానికి గాను కంపెనీ మార్జిన్‌లు, లాభాలు పెరగడం కోసం ఇన్ఫోసిస్‌ అనైతిక విధానాలను అనుసరిస్తోందని గుర్తుతెలియని ఉద్యోగుల గ్రూప్‌ యుఎస్‌ నియంత్రణ, ఎక్సేంజ్‌కు, ఇన్ఫోసిస్‌ బోర్డుకు ఫీర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలకేని స్పందించారు. ఇన్ఫోసిస్‌పై వచ్చిన విజిల్‌ బ్లోవర్‌(కంపెనీపై ఆరోపణలు చేసేవారు) ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని స్టాక్‌ ఎక్సేంజికిచ్చిన సమాచారంలో నందన్‌ నీలకేని పేర్కొన్నారు. కాగా ఇన్ఫోసిస్‌ సీఈఓ పరేఖ్‌, సీఎఫ్‌ఓ రాయ్‌పై ప్రధానంగా ఈ ఆరోపణలు  వచ్చాయి.  ‘తేది కూడా లేని విజిల్‌ బ్లోవర్‌ ఫిర్యాదులో సీఈఓ యుఎస్‌, ముంబై కి చేస్తున్న ప్రయాణాలకు సంబంధించి ఆరోపణలు అధికంగా ఉన్నాయి’ అని నీలకేని తెలిపారు. కాగా ఉద్దేశ పూర్వంగానే గత త్రైమాసికంలో తప్పుడు ప్రకటనలు చేశారని, అకౌంటింగ్‌ కి సంబంధించి నియంత్రణలను పాటించలేదని  విజిల్‌బ్లోవర్లు లేఖలో పేర్కొన్నారు. గత త్రైమాసికంలో వీసా ఖర్చులను గుర్తించకుండా లాభాలు అధికంగా ఉండేలా చూడాలని ఫైనాన్సియల్‌ టీమ్‌పై ఒత్తిడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తమ వద్ద మెయిల్స్‌, వాయిస్‌ రికార్డులున్నాయని తెలిపారు. మరోవైపు ఫిర్యాదుకు సాక్ష్యాధారంగా కంపెనీకి ఎటువంటి ఈ-మెయిల్స్‌, వాయిస్‌ రికార్డింగ్‌లు అందలేదని నీలకేని తెలిపారు. అక్టోబర్‌ 11 బోర్డు సమావేశం తర్వాత కంపెనీ ఆడిటింగ్‌ కమిటీ, స్వతంత్ర ఆడిటర్స్‌(ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌)తో ఈ విషయంపై సహకారం తీసుకుంటుందని నీలకేని తెలిపారు. వీటితోపాటు ఇన్ఫోసిస్‌ చట్టబద్ధమైన ఆడిటర్‌ డెలాయిట్‌ ఇండియా కూడా ఈ అంశంపై అప్‌డేట్‌ చేస్తుందని అన్నారు. 



You may be interested

మార్కెట్‌కు ‘‘ఇన్ఫీ’’ నష్టాలు

Tuesday 22nd October 2019

39000 దిగువన సెన్సెక్స్‌  11600 కింద ముగిసిన నిఫ్టీ 16.50శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు మార్కెట్‌ ఆరురోజుల ర్యాలీకి ఇన్ఫోసిస్‌ షేర్ల భారీ పతనం అడ్డుపడింది. కంపెనీ యాజమాన్యం ఆదాయం, లాభాలను పెంచి చూపుతుందని విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి రావడంతో నేడు ఇన్ఫోసిస్‌ 16.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌ షేర్ల క్షీణత సూచీల భారీ నష్టాలకు కారణమైంది. అలాగే బ్రెగ్జిట్ ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను కొంతమేర దెబ్బతీసింది. ఫలితంగా మార్కెట్‌

కోటక్‌ మహీంద్రా బ్యాంకు లాభం 51 శాతం అప్‌

Tuesday 22nd October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. త్రైమాసిక ఫలితాల్లో కీలకాంశాలు... బ్యాంకు నికర లాభం గతేడాదితో పోలిస్తే 51 శాతం పెరిగి రూ. 1724.5కోట్లకు చేరింది. అనలిస్టుల సరాసరి అంచనా లాభం రూ. 1555 కోట్లు మాత్రమే. బ్యాంకు గతేడాది క్యు2లో రూ. 1142 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 25.2 శాతం పెరిగి రూ. 2676

Most from this category