News


ట్రేడ్‌వార్‌తో వీటికి లాభం!

Saturday 14th July 2018
Markets_main1531557380.png-18318

మేడ్‌ ఇన్‌ ఇండియాకు జోరంటున్న నిపుణులు 
యూఎస్‌ ఆరంభించిన వాణిజ్యయుద్దం పరోక్షంగా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు వరంలాంటిదని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం చైనా దాదాపు 50వేల కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రిక్‌ మెషినరీ, 38వేల కోట్ల డాలర్ల విలువైన కంప్యూటర్‌ మెషనరీ, 8900 కోట్ల డాలర్ల విలువైన ఫర్నిచర్‌ బెడ్డింగ్‌, లైటింగ్‌ను, 15వేల కోట్ల డాలర్ల విలువైన క్లోతింగ్‌, యాక్సెసరీస్‌ను, 7000 కోట్ల డాలర్ల విలువైన మెడికల్‌ సామాగ్రిని, అంతే విలువైన ప్లాస్టిక్‌ వస్తువులను ఎగుమతి చేస్తోంది. ట్రేడ్‌వార్‌ మరింత ముదిరే కొద్దీ ఈ రంగాల్లో చైనా ఎగుమతులు తగ్గుతాయి. ఇదే మేర భారత్‌ తన ఎగుమతులను పెంచుకోగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణుల అంచనా. ఈ రంగాల్లో ఏర్పడే శూన్యతను భర్తీ చేసే దిశగా దేశీయ కంపెనీలు ముందుకు రావాలని సూచిస్తున్నారు. దేశీయ పెట్టుబడిదారులకు ట్రేడ్‌వార్‌తో విస్తృత అవకాశాలు దొరుకుతాయంటున్నారు.
- ట్రేడ్‌ వార్‌ కారణంగా ఎల్‌ అండ్‌ టీ, ఏబీబీ, సీమెన్స్‌, లక్ష్మి మెషిన్స్‌, సెంచరీ ప్లే, గ్రీన్‌లామ్‌, హావెల్స్‌, వెల్‌స్పన్‌ ఇండియా, సుప్రీం ఇండస్ట్రీస్‌, నీల్‌కమల్‌ కంపెనీలు ప్రయోజనం ఉండొచ్చని, వీటి షేర్లను పరిశీలించవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 
మార్కెట్లలో అప్రమత్తత!
దేశీయ మార్కెట్లు మరోమారు రికార్డుల పరంపర కొనసాగిస్తూ దూసుకుపోతున్నాయి. అయితే మార్కెట్‌ లోపలి పరిస్థితులు మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. మార్కెట్లో అడ్వాన్సుల కన్నా డిక్లైన్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ఆరోగ్యకరమైన సంకేతం కాదని నిపుణుల అభిప్రాయం. నిజానికి బుల్‌ మార్కెట్‌లో దాదాపు అన్ని రంగాలు, అన్ని స్టాకులు ముందుకు సాగాలి. కానీ ఈ సారి పరిస్థితి తద్భిన్నంగా ఉంది. సూచీలు కేవలం కొన్ని స్టాకుల బలంతో ముందుకు పోతుంటే, ఎక్కువ స్టాకులు వెనక్కులాగుతున్నాయి. ఈ పరిస్థితి మారి క్రమంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ సైతం పరుగులు ఆరంభిస్తేనే బుల్‌ మార్కెట్‌లో మరో లెగ్‌ ర్యాలీ ఆరంభమైనట్లు భావించాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం రంగాలవారీగా ఎంపిక చేసిన స్టాకులపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణుల సలహా. బాగా క్షీణించి ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్న నాణ్యమైన స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని, లార్జ్‌క్యాప్స్‌వైపు మొగ్గేట్లయితే ఇబ్బంది పడే అవకాశాలున్నాయని వారి సూచన. ఎందుకంటే ఈ తరహా మార్కెట్లలో క్రమంగా చిన్న స్టాకుల్లో ఉత్సాహం ఆరంభమయ్యే కొద్దీ పెద్ద స్టాకులు నీరసించడం ఆరంభిస్తాయని అందువల్ల ఈ సమయంలో పెద్దస్టాకులను ఎంచుకోకపోవడమే మంచిదని వివరిస్తున్నారు. You may be interested

‍పెన్షన్‌ సమస్య? పరిష్కారముంది..

Saturday 14th July 2018

మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్‌ తీసుకుంటున్నారా? మీకు పెన్షన్‌కు సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా? మీ సమస్యను ఫిర్యాదు చేసినా అది పరిష్కారం కాలేదా? ప్రభుత్వ విభాగం కానీ, బ్యాంక్‌ ఉద్యోగులు కానీ స్పందించడం లేదా? లేకపోతే సమస్యను ఎవరికి తెలియజేయాలో తెలియడం లేదా? అయితే మీరు www.pensionersportal.gov.in వెబ్‌సైట్‌ చూడండి. ఇందులో మీ సమస్యను ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ మీరు చేసిన ఫిర్యాదు సంబంధిత విభాగానికి చెందిన సీనియర్‌

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ తిరస్కరణకు గురైతే??

Saturday 14th July 2018

ఒక ప్రాంతాన్ని చూడటానికి టూర్‌ వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. అందుకే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ట్రావెల్‌ చేసేటప్పుడు ట్రిప్‌ రద్దవ్వడం, బ్యాగేజ్‌ తస్కరణ, ఊహించని ప్రమాదాలు, విదేశాల్లో పాస్‌పోర్ట్‌ కనిపించకుండా పోవడం, మెడికల్‌ ఎమర్జెన్సీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్‌ పాలసీ మనకు భరోసానిస్తుంది. అయితే కొన్నిసార్లు  దురదృష్టవశాత్తు పాలసీ ఉన్నా కూడా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ రిజెక్ట్‌ అవ్వొచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఇలా అవ్వచ్చొ ఒకసారి చూద్దాం.. మద్యంతో

Most from this category