News


యస్‌ బ్యాంకు గమనం ఎటు?

Friday 20th December 2019
Markets_main1576865546.png-30340

గురువారం 7 శాతం వరకు లాభపడిన యస్‌ బ్యాంకు, శుక్రవారం కూడా తన ర్యాలీని కొనసాగించింది. మరో 3 శాతం లాభపడి రూ.51.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో కొనుగోళ్ల మద్దతుతో రూ.53.50 వరకు పెరిగింది. టెక్నికల్‌గా ఈ స్టాక్‌కు తక్షణ నిరోధం రూ.57 వద్ద ఉందని, దీన్ని అధిగమిస్తే తదుపరి రూ.62.-67 శ్రేణి వరకు వెళుతుందని, ఎగువవైపున 7-26 శాతం ర్యాలీకి అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

 

యస్‌ బ్యాంకు స్టాక్‌ ఇప్పటికీ సెక్యులర్‌ డౌన్‌ట్రెండ్‌లోనే ఉందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. ‘‘ఇది తాత్కాలిక బోటమ్‌ను ఏర్పాటు చేసి, రివర్సల్‌కు ప్రయత్నించింది. రూ.29 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసిన తర్వాత, గరిష్ట బోటమ్‌ను రూ.40 వద్ద ఏర్పాటు చేసి అక్కడి నుంచి అధిక స్థాయిల దిశగా కదిలింది. సాంకేతికంగా ఇది తన మద్దతు స్థాయిని రూ.40 స్థాయికి మార్చుకుంది’’ అని వైష్ణవ్‌ తెలిపారు. ఈ స్టాక్‌ రూ.55-62 వద్ద బలమైన నిరోధాన్ని చూడొచ్చని విశ్లేషించారు. 20డీఎంఏ రూ.56.20, 50 డీఎంఏ 57.32 వద్ద, 100 డీఎంఏ రూ.62 వద్ద ఉన్నాయని తెలిపారు.

 

యస్‌ బ్యాంకు స్టాక్‌ అవుట్‌లుక్‌ సానుకూలంగా ఉందన్నారు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి. బోటమ్‌ రివర్సల్‌ సంకేతాలను ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘ఈ స్టాక్‌ రూ.40-41 వద్ద స్వల్ప కాలానికి కనిష్ట స్థాయిని ఏర్పాటు చేసింది. ఈ స్టాక్‌లో మరింత ర్యాలీకి అవకాశం ఉంది. అయితే ఈ పెరుగుదల రూ.60 స్థాయిలో ఆగిపోవచ్చు’’ అని నాగరాజ్‌శెట్టి విశ్లేషించారు. ఎగువవైపున ఈ టార్గెట్‌ వచ్చే రెండు మూడు వారాలకేనని స్పష్టం చేశారు. యస్‌ బ్యాంకు స్టాక్‌కు టార్గెట్‌గా రూ.53-57, మద్దతు స్థాయిలు రూ.45-43 అని ప్రభుదాస్‌ లీలాధర్‌ సీనియర్‌ టెన్నికల్‌ అనలిస్ట్‌ వైశాలిపరేఖ్‌ తెలిపారు. ఒకవేళ ఈ స్టాక్‌ నిశ్చయాత్మకంగా రూ.57 స్థాయిని అధిగమిస్తే రూ.67 వరకు వెళుతుందన్నారు. ఎఫ్‌అండ్‌వోలో యస్‌ బ్యాంకు లాట్‌ సైజును వచ్చే సిరీస్‌ నుంచి నాలుగింతలు చేయవచ్చని, నిధుల సమీకరణను బ్యాంకు త్వరలోనే ప్రకటించొచ్చన్న వార్తలు యస్‌ బ్యాంకు పట్ల ఆసక్తికి దారితీసినట్టు విశ్లేషణ వినిపిస్తోంది.You may be interested

మందగమనాన్ని ఎదుర్కొనే సత్తా ఉంది

Saturday 21st December 2019

ఎకానమీ మళ్లీ అధిక వృద్ధి బాట పడుతుంది కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టాలి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి జీడీపీ వృద్ధికి ఊతమివ్వాలి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు .. ప్రస్తుత మందగమనం నుంచి బైటపడే సత్తా ఉందని, మళ్లీ అధిక వృద్ధి బాట పట్టగలదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఊతమిచ్చేలా పెట్టుబడులకు సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కార్పొరేట్లకు పిలుపునిచ్చారు. పరిశ్రమల సమాఖ్య

డెట్‌ రాబడులపై ఆర్‌బీఐ ‘ఓఎంఓ’ ప్రభావం

Friday 20th December 2019

ఆర్‌బీఐ ఉన్నట్టుండి ఒక నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రూపొందించిన ‘ఆపరేషన్‌ ట్విస్ట్‌’ విధానాన్ని తాను కూడా అనుసరించనున్నట్టు ప్రకటించింది. రూ.10,000 కోట్లతో ఈ నెల 23న ఆర్‌బీఐ ప్రత్యేక ఓఎంఓను నిర్వహించనుంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఆబీఐ నిర్ణయంతో లాంగ్‌ డ్యురేషన్‌, డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ ఎక్కువగా లాభపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ ఈ తరహా ఓఎంవోను ప్రకటించడం

Most from this category