News


రుణం తీసుకుని ట్రేడ్‌ చేస్తున్నారా..?

Sunday 2nd February 2020
Markets_main1580666667.png-31447

మన చుట్టూ ఉన్న ఇన్వెస్టర్లలో రుణం తీసుకుని ట్రేడ్‌ చేసే వారూ (లెవరేజ్‌) ఉన్నారు. రుణం తీసుకుని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి రుణం తీసుకుని ఇలా ట్రేడ్‌ చేయడం ఎంతో రిస్క్‌ అన్న మాటలు వినిపిస్తుంటాయి. రుణం తీసుకుని ట్రేడ్‌ చేయడంలో ఉండే రిస్క్‌? ఇందుకు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలన్నది ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ తెలియజేశారు.

 

‘‘లెవరేజ్‌ విధానాన్ని ట్రేడర్లు చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే అధిక లెవరేజ్‌ అధిక రిస్క్‌కు దారితీయగలదు. ఆ రుణంతో పెట్టుబడులను అలాగే కొనసాగిస్తే అప్పుడు ఆదాయ అవకాశాలు పరిమితంగా ఉంటాయి. లెవరేజ్‌ను తప్పకుండా తార్కిక పరిమితులకు లోబడే వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది అటు అధిక లాభాలకు, అధిక నష్టాలకూ దారితీస్తుంది. అవకాశం తనవైపు ఉందని అత్యంత స్పష్టమైన అవకాశాల కోసమే లెవరేజ్‌ను ఉపయోగించాలి. అలాగే ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. లెవరేజ్‌ అన్నది బ్రోకర్‌ లేదా ఆర్థిక సంస్థ ట్రేడర్‌కు అందించే సదుపాయం. తన ఖాతాలో బ్యాలన్స్‌ను తనఖాగా ఉంచి పొజిషన్లు తీసుకోవడానికి అనుమతిస్తారు. ఇది మార్కెట్లో అధిక ఎక్స్‌పోజర్‌కు అవకాశం కల్పిస్తుంది. ఇది రెండువైపులా పదునున్న కత్తి వంటిది.

 

లెవరేజ్‌ను సరిగ్గా వినియోగించుకుంటే అది మంచి ఫలితాన్నే ఇస్తుంది. అధిక లెవరేజ్‌ అన్నది ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. మార్జిన్లపై కొనుగోలు చేసే ఆప్షన్ల ట్రేడింగ్‌, ఫ్యూచర్‌ కాంట్రాక్టులు అన్ని కూడా లెవరేజ్‌ ట్రేడింగ్‌ ఉదాహరణలు. అధిక లెవరేజ్‌ తీసుకుని చేసే ట్రేడ్‌ వ్యతిరేక ఫలితం ఇస్తే అది వేగంగా ఇన్వెస్ట్‌మెంట్‌ను హరించివేస్తుంది. కనుక లెవరేజ్‌తో తీసుకునే పొజిషన్లను జాగ్రత్తగా ట్రాక్‌ చేస్తూ, స్టాప్‌లాస్‌ను పెట్టుకుని, భారీ నష్టాలు రాకుండా ఇతర మార్కెట్‌ ఆర్డర్లను వినియోగించుకోవాలి. భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవాలి. ట్రేడింగ్‌ ప్లాన్‌కు కట్టుబడి ఉండడం అవసరం. అలాగే, తప్పులను విశ్లేషించుకోవడం కూడా ఎప్పుడూ చేస్తుండాలి. ప్రతీ ట్రేడ్‌కు ప్రత్యేకమైన వ్యూహం అవసరం. రిస్క్‌ తీసుకుంటే వచ్చే రాబడులు ఏ మేరకు అన్న అధ్యయనం లేకుండా పొజిషన్‌ తీసుకోవద్దు. అలాగే, ట్రేడర్‌ ఒక సింగిల్‌ ట్రేడ్‌లో నష్టాన్ని 1-2 శాతానికే పరిమితం చేసుకోవాలి’’ అని అగర్వాల్‌ వివరించారు. 



You may be interested

బడ్జెట్‌ ఫలితాలు దీర్ఘకాలంలోనే.. స్వల్ప కాలంలో పెయిన్‌

Sunday 2nd February 2020

బడ్జెట్‌ ప్రతిపాదనల ఫలాలు దీర్ఘకాలంలోనే కనిపిస్తాయని, స్వల్ప కాలానికి మార్కెట్లలో నొప్పి భరించక తప్పదని శామ్కో సెక్యూరిటీస్‌ జీఈవో జిమీత్‌మోదీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌పై అంచనాలు, కరోనా వైరస్‌ ఆందోళనలతో గత వారం మార్కెట్లపై ఒత్తిడి నెలకొందని, చివరికి బడ్జెట్‌ ప్రతిపాదనలు మరింత దీర్ఘకాలానికి ఉద్దేశించినవి కావడంతో మార్కెట్లు నష్టాలతో ముగియడానికి కారణమైనట్టు విశ్లేషించారు. స్టాక్‌ మార్కెట్లు ఆర్థిక వృద్ధి కోసం స్వల్పకాలిక బూస్ట్‌ను ఆశించినట్టు చెప్పారు. ఓ ప్రముఖ వార్తా

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు

Sunday 2nd February 2020

దేశీయంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశీయంగానే వీటి తయారీకి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించే విధానంలో భాగంగా దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. మొబైల్‌ విడిభాగాలపైనా కస్టమ్స్‌ సుంకాన్ని సవరిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. పూర్తిగా నిర్మితమై (సీబీయూ) దేశంలోకి దిగుమతి అయ్యే వాణిజ్య విద్యుత్‌ వాహనాలపై 2020

Most from this category