News


స్టాక్స్‌ను మళ్లీ ఈ ధరల్లో చూడలేం...?

Friday 23rd August 2019
Markets_main1566502533.png-27955

మార్కెట్లకు క్షీణ దశ ముగుస్తున్నట్టేనన్నారు ప్రముఖ నిపుణులు, కార్నెలియన్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ఖేమాని. వచ్చే మూడు నాలుగు నెలల కాలం మంచి షేర్ల కొనుగోలుకు అనుకూల సమయంగా సూచించారు. రికవరీ అన్నది మొదలైతే మళ్లీ ఈ ధరల్లో స్టాక్స్‌ లభించవన్న విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్లకు సంబంధించిన అంశాలపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. 

 

‘‘ఆర్థిక రంగంలో కదలికకు ప్రభుత్వం వంతుగా ఎంతో చేస్తుందని ఆశించొచ్చు. నాలుగు విడతలుగా రేట్ల కోత జరిగింది. అయితే, వ్యాపారం లేదా వినియోగదారునికి అసలు ప్రయోజనం బదిలీ కాలేదు. ఇదే అతిపెద్ద సవాలు. దీనికి సమయం పడుతుంది. మొత్తానికి అక్టోబర్‌ లేదా నవంబర్‌ నాటికి దారుణ పరిస్థితులు ముగిసిపోయినట్టే. క్షీణ దశ నుంచి రికవరీ దశలో ఉంటాం’’ అని వికాస్‌ ఖేమాని వివరించారు. ఆటో రంగంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అంగీకరించారు. ఉద్యోగాలు కోల్పోతున్నట్టు వింటున్నామని, రియల్‌ ఎస్టేట్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లోనూ ఈ పరిస్థితులు ఉన్నట్టు చెప్పారు. ఈ పరిస్థితి విస్తరిస్తోందని, ఉద్యోగాలు పోవడంతో అది జీవనంపై, వినియోగంపైనా, ఇంటి రుణాల ఈఎంఐల చెల్లింపులపైనా ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే ఆస్తుల నాణ్యత సమస్యకు దారితీస్తుందని, రిటైల్‌ రుణాలు కూడా పెద్ద సమస్యగా మారతాయన్నారు. 

 

ప్రైవేటు బ్యాంకులు ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నట్టు ఖేమాని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రభుత్వరంగ బ్యాంకులతో వాటికి పోటీ తీవ్రత తగ్గిందన్నారు. కాసా డిపాజిట్ల వృద్ధితో అవి లాభపడుతున్నాయని, ఎన్‌పీఏ సైకిల్‌ ముగిసినట్టేనన్నారు. రిస్క్‌ తీసుకునే వారికి ప్రైవేటు బ్యాంకు స్టాక్స్‌ మంచి అనుకూల స్థితిలో ఉన్నట్టు చెప్పారు. అంతర్జాతీయ అంశాల పరంగా ఆస్థిరతల నేపథ్యంలో మార్కెట్లు మరికొంత ఆటుపోట్లకు గురికావచ్చన్నారు. ఇప్పటి నుంచి వచ్చే మూడు నాలుగు నెలల్లో మంచి పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు అనుకూల సమయంగా పేర్కొన్నారు. ‘‘చెత్త కంపెనీలు పక్కకు వెళ్లిపోయాయి. స్థిరీకరణ జరిగింది. బలమైన కంపెనీలు మరింత బలోపేతంగా తయారవుతున్నాయి. రికవరీ అన్నది మొదలైతే స్టాక్స్‌ మళ్లీ ఈ ధరల్లో అందుబాటులో ఉండవు. వచ్చే మూడు నాలుగు నెలల కాలం కొనుగోలుకు అనుకూల సమయం. చాలా రంగాల్లో, స్టాక్స్‌లో మంచి విలువ సంతరించుకుంటోంది. నేను ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నా. కాకపోతే ఈ సమయంలో అస్థిరతలను తట్టుకుని నిలబడగలగాలి. క్రమానుగతంగా, ఓపికతో ఇ‍న్వెస్ట్‌ చేయాలి’’ అని ఖేమాని వివరించారు.You may be interested

‘40 ఏళ్ల అనుభవంలో ఈ స్థాయి సంపద విధ్వంసాన్ని చూడలేదు’

Friday 23rd August 2019

దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సగం సమస్యలు... ప్రభుత్వం తన బకాయిలను చెల్లించడం వల్ల పరిష్కరించొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థపాకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. ‘‘30 రోజుల బిల్లును ప్రభుత్వం కనీసం 30 రోజుల్లోపు చెల్లించినా మూడింట ఒక వంతు సమస్యలు పరిష్కారం అవుతాయి’’ అని పేర్కొన్నారు. హీరో మైండ్‌మైన్‌ సదస్సు 2019 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రామ్‌దేవ్‌ అగర్వాల్‌ మాట్లాడారు. విధాన నిర్ణేతలు భారతీయ వృద్ధి

భారీ పతనానికి ఐదు కారణాలు

Thursday 22nd August 2019

దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు వరుసగా మూడవరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. మెటల్‌, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల పతనంతోపాటు, ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందడంతో గురువారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 587.44 పాయింట్లు లేదా 1.59 శాతం తగ్గి 36,472.93 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 180.95 పాయింట్లు లేదా 1.67 శాతం తగ్గి 10,737.75 వద్ద ముగిశాయి. కాగా మార్కెట్‌ పతనానికి కారణమైన ఐదు అంశాలు... ఉద్దీపనంపై

Most from this category