News


రిలయన్స్‌ షేరు పెరిగే ఛాన్స్‌

Monday 12th August 2019
Markets_main1565605596.png-27718

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌  విభాగాలలో  సౌదీ ఆరామ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం పాజిటివ్‌గా కదులుతుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్‌ఐఎల్‌ ఎజీఎం మీటింగ్‌లో కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ముకేష్‌ అంబానీ మాట్లాడుతూ..వచ్చే 18 నెలలో కంపెనీని జీరో నికర అప్పు కలిగిన కంపెనీగా తీర్చుదిద్దుతామని, వచ్చే కొన్నేళ్లలో బోనస్‌లు, డివిడెండ్‌లు అధికంగా పంచనున్నామని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం 5.32 లక్షల కోట్ల విలువ కలిగిన ఆర్‌ఐఎల్‌ ఆయిల్‌ టూ కెమికల్స్‌(ఓటీసీ) ఎంటర్‌ప్రైజ్‌లో సౌదీ ఆరామ్‌కోకు 20 శాతం వాటా దక్కనుంది. ‘
   ‘ఆర్‌ఐఎల్‌ స్టాక్  సానుకూలంగా కదిలే అవకాశం ఉంది. షార్ట్‌ కవరింగ్‌ ఉంటే పెరుగుదల అధికంగా ఉంటుంది’  అని కెఆర్ చోక్సే, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌, మేనేజింగ్ డైరెక్టర్ దేవెన్ చోక్సే అన్నారు. గత ఏడాది జులైలో జరిగిన ఏజిఎం నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాకు విలువ 20 శాతం పెరిగింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5 శాతం లాభడడం గమనర్హం. అతి పెద్ద అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లను ఆకర్షించి రూ. 1.25 లక్షల కోట్లను సమీకరించే లక్ష్యంతో ఆర్‌ఐఎల్‌ తన టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఆస్తులను రెండు వేరువేరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్టులుగా విడదీసింది. ఆర్‌ఐఎల్‌ రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్సియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ల కోసం వాల్యు అన్‌లాకింగ్‌ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని దీని ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ నిర్వహిస్తున్న కంపెనీగా మారనున్నామని ఏజిఎం మీటింగ్‌లో అంబానీ తెలిపారు. ఆర్‌ఐఎల్‌ వినియోగధారిత వ్యాపారలైన రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ను వచ్చే ఐదేళ్లలో మార్కెట్‌లో నమోదు చేయనున్నామని అన్నారు.
మార్కెట్‌ స్వాగతిస్తుంది..    
రిలయన్స్ జియో, రిటైల్ ఆస్తుల మొత్తం విలువ వచ్చే రెండుమూడేళ్ల్లలో 100 బిలియన్ డాలర్లకు మించి ఉంటుందని, ప్రస్తుత ఆర్‌ఐఎల్‌ విలువను మించిపోతుందని చోక్సే అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీ సౌదీ అరామ్‌కోకు ఆర్‌ఐఎల్‌ ఆయిల్-టు-కెమికల్ (ఓటిసి) వ్యాపారంలో 20 శాతం వాటాను ఆర్‌ఐఎల్‌ విక్రయించడాన్ని మార్కెట్ హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది’ అని ప్రభుదాస్‌ లిల్లాధర్‌, సీఈఓ-పీఎంఎస్‌ అజయ్ బోడ్కే అన్నారు. ‘ఓటీసీ, ఫైబర్, టవర్ వంటి వ్యాపారాలలో దూకుడు మరింతగా కొనసాగించడానికి, రాబోయే 18 నెలల్లో సున్నా రుణ సంస్థగా అవతరించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది. దీని వలన ఈ కంపెనీ స్టాక్‌ రీ రేటింగ్‌కు అవకాశం ఉంటుంది’ అని బోడ్కే అన్నారు. 
  రియోలెన్స్ జియో ఇప్పటివరకు 1,600 పట్టణాల్లో జియో ఫైబర్ కోసం 1.5 కోట్ల రిజిస్ట్రేషన్లను లాగిన్ చేసిందని, రాబోయే 12 నెలల్లో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మొదలుపెట్టడానికి జియో సిద్ధమవుతుందని అంబానీ అన్నారు. జియో ఐఓటీ (ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్) ప్లాట్‌ఫాంపై 100 కోట్ల గృహాలను అనుసంధానించాలని రిలయన్స్ జియో లక్ష్యంగా పెట్టుకుందని, ఈ విభాగంలో రూ .20,000 కోట్లకు పైగా ఆదాయ అవకాశాలను గుర్తించామని ఆయన వివరించారు. జియో ప్రతి నెలా దాదాపు కోటీ వినియోగదారులకు చేరువవుతుందని తెలిపారు. జియో ఫైబర్ సేవలు 2019 సెప్టెంబర్ 5 నుంచి లభిస్తాయని, ఐఓటీ వ్యాపారం 2020 జనవరి 1 నుంచి ప్రారంభించనున్నామని వివరించారు. ఆర్‌ఐఎల్ స్టాక్‌పై ప్రస్తుతం 9 ‘స్ట్రాంగ్ బై’ రేటింగ్స్, 13 ‘బై’ రేటింగ్స్, 9 ‘హోల్డ్’ రేటింగ్స్, 3 ‘సేల్’,  2 ‘స్ట్రాంగ్ సేల్’ రేటింగ్‌లు ఉన్నాయని రాయిటర్స్ డేటా తెలిపింది.You may be interested

అందరి దృష్టి ఆల్గోట్రేడింగ్‌ పైనే!

Monday 12th August 2019

విపరీతంగా పెరిగిపోతున్న ఆల్గోమెథడ్‌ కామన్‌ ట్రేడర్లకు కూడా అందుబాటులో టెక్నాలజీ ఇటీవల కాలంలో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఆల్గోట్రేడింగ్‌(కంప్యూటర్ల ద్వారా ఆటోమేటిగ్గా ఆర్డర్లు ఎగ్జిక్యూట్‌ చేయడం) పెరిగిపోతోంది. ఆల్గోట్రేడింగ్‌తో టెక్‌ ట్రేడర్లకు మరింత పవర్‌ పెరిగింది. మార్కెట్లో వచ్చే అతి స్వల్ప వేగవంతమైన మార్పును కూడా ఒడిసిపట్టగలుగుతున్నారు. దీంతో మానవ సంబంధిత తప్పులు తగ్గాయి. కానీ ఇదే సమయంలో పెరిగిపోతున్న ఆల్గోట్రేడింగ్‌ క్రమంగా సాధారణ ట్రేడర్స్‌ను బెంబెలెత్తించి మార్కెట్‌కు దూరమయ్యేలా చేస్తోందంటున్నారు కొందరు నిపుణులు.

సెప్టెంబర్‌5 నుంచి జియో ఫైబర్‌ సేవలు

Monday 12th August 2019

జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ తెలిపారు. మంగళవారం జరిగిన రిలయన్స్‌ 42వ ఏజీఎం సమావేశంలో ముఖేష్‌ మాట్లాడుతూ ‘‘అమెరికా లాంటి అభివృద్ధి చెందని దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 90ఎంబీపీపీస్‌గా ఉంది. ఇప్పుడు జియో ప్రవేశపెట్టే జియో ఫైబర్‌ పథకంలో ఇంటర్నెట్ సగటు వేగం 100 ఎంబీపీపీస్‌లు ఉంటుంది. ఈ వేగాన్ని 1000ఎంబీపీపీస్‌ పెంచుకునేందుకు మాకు ప్రణాళికలున్నాయి.

Most from this category