News


ఎఫ్‌ఐఐలు ఇప్పుడప్పుడే మళ్లీ తిరిగి వస్తారా...?

Tuesday 10th September 2019
Markets_main1568057252.png-28275

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక రంగం పుంజుకునేందుకు గాను పలు చర్యలను ప్రకటించినా కానీ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మాత్రం భారత్‌ పట్ల ఇంకా ఆందోళనతోనే ఉన్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి వారి పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోవడం అదే సూచిస్తోంది. భారత ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడమే వారి ప్రధాన ఆందోళనకు కారణం. ముఖ్యంగా ఆర్థిక రంగ పునరుత్తేజానికి ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోకపోవడం, బడ్జెట్‌లో తీవ్ర స్థాయిలో పన్నులు వేసేయడం సెంటిమెంట్‌ను విఘాత పరిచినట్టు వారు చెబుతున్నారు. 

 

విదేశీ ఇన్వెస్టర్లు జూలై నుంచి ఇప్పటికి రూ.35,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల తర్వాత కూడా వారి అమ్మకాలు ఆగకపోవడం గమనార్హం. ‘‘ఆర్థిక మంత్రి తీసుకున్న చర్యలు సానుకూలం. కానీ, తిరిగి విశ్వాసం ఏర్పడడానికి సమయం పడుతుంది. వెంటవెంటనే సానుకూల, ప్రతికూల వంటి షాక్‌కు గురిచేసే చర్యలు దీర్ఘకాలంలో బలమైన బంధానికి మంచివి కావు’’అని సింగపూర్‌కు చెందిన సిల్వర్‌డేల్‌ క్యాపిటల్‌ సీఐవో సంజయ్‌ గుగ్లానీ పేర్కొన్నారు. బడ్జెట్‌లో మూలధన లాభాల పన్నుపై సర్‌ చార్జీ మోపడం, ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే. 

 

ఇన్వెస్టర్ల సంఖ్య పెంచుకునేందుకు గాను నిర్దేశిత ప్రతిపాదనలపై కొంత కాలం పాటు అయినా సంప్రదింపులు చేపట్టి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని గుగ్లానీ సూచించారు. కనీసం 90 రోజుల పాటు సంప్రదింపులకు సమయం ఇచ్చి, ఆ తర్వాతే గెజిట్‌ విడుదల చేయడం అన్నది దీర్ఘకాల ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా అవసరమన్నారు. ‘‘రిస్క్‌ తీసుకునేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు వెనుకాడరు. భారత్‌ కంటే అధిక రిస్క్‌ ఉన్న దేశాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి నిబంధనలు మార్చేయడం సరికాదు’’ అని గుగ్లానీ పేర్కొన్నారు. నోర్డియా సీనియర్‌ స్టా‍్రటజిస్ట్‌ హెర్టా అలవా ప్రస్తుతం భారత్‌ విషయంలో తటస్థ వైఖరి ప్రదర్శించారు. ‘‘భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అంత ఆకర్షణీయం కాదు. దీర్ఘకాలానికి మాత్రం చాలా భారత కంపెనీలను మేం ఇష్టపడతాం’’ అని అలవా తెలిపారు. ఉత్తమ కంపెనీలు అధిక వ్యాల్యూషన్లలో ఉంటాయని, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే వాటి ఆదాయాలు నిరాశపరుస్తాయన్నారు. 

 

‘‘వర్ధమాన మార్కెట్ల విభాగంలో భారత ఈక్విటీలు పట్ల అప్రమత్తతో కూడిన సానుకూలతతో ఉన్నాం. అమెరికా-చైనా వాణిజ్య వివాదం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత్‌ ప్రయోజనం పొందగలదు’’ అని ఎన్‌ఎన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌కు చెందిన వర్ధమాన మార్కెట్ల సీనియర్‌ వ్యూహకర్త మార్టీన్‌ జాన్‌ బక్కుమ్‌ తెలిపారు. ‘‘వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే అంతర్జాతీయ వాణిజ్యం పరంగా భారత్‌ తక్కువ ప్రభావితం అవుతుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం విషయంలో భారత ప్రభుత్వం కట్టుబడి ఉండడం మధ్య కాలానికి మార్కెట్లకు సానుకూలం. అయితే, భారత వృద్ధి స్టోరీపై ఇన్వెస్టర్లు కొంత ప్రతికూలంగా ఉన్నారు’’ అని బక్కుమ్‌ పేర్కొన్నారు. అయితే, వర్ధమాన మార్కెట్లలో చైనా, వియత్నాం తర్వాత భారత్‌పైనే అధిక వెయిటేజీతో ఉన్నట్టు చెప్పారు.You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Tuesday 10th September 2019

మొహర్రం సందర్భం‍గా మంగళవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా బుధవారం (10న) ప్రారంభమవుతుంది. ఇక ఆర్థిక మందగమన పరిస్థితులను చక్కదిద్దే మరిన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టనున్నదన్న అంచనాలతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్‌ రెండోరోజూ

11,042 దాటితే మరింత పైకి..!

Tuesday 10th September 2019

నిఫ్టీ-50 ఇక తదుపరి 11,042ను అధిగమించి నిలదొక్కుకుంటే తదుపరి ర్యాలీ చేయగలదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిఫ్టీ సోమవారం కీలకమైన 11,000 మార్క్‌ పైన క్లోజ్‌ అయింది. దీంతో డైలీ చార్ట్‌లో చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. గరిష్టంలో గరిష్టం, కనిష్టంలో కనిష్టాన్ని నమోదు చేయడం నిఫ్టీ వరుసగా మూడో రోజని మద్దతు స్థాయిలు అధిక స్థాయికి చేరాయనడానికి ఇది సూచికగా అనలిస్టులు పేర్కొంటున్నారు. దిగువ స్థాయిలో నిఫ్టీకి 10,900

Most from this category