News


బడ్జెట్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు ఇవి..

Monday 3rd February 2020
Markets_main1580753963.png-31477

కేంద్ర బడ్జెట్‌పై అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలకు మంచి విలువ ఉంటుంది. విదేశీ ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టుబడులు ఎలా ఉండొచ్చన్నది వీటి అభిప్రాయాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు.

 

గోల్డ్‌మ్యాన్‌శాక్స్‌
శనివారం బడ్జెట్‌ ప్రకటన అనంతరం భారత ఈక్విటీలు నష్టాలపాలయ్యాయి. ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణకు 2020-21 సంవత్సరం ఎంతో కీలకమైనదని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ద్రవ్యలోటు స్థిరీకరణ ఉండొచ్చని అంచనా వేసింది. బడ్జెట్‌ ప్రకటనలు వృద్ధి దిశగా ఆర్‌బీఐకి సౌకర్యాన్ని ఇస్తాయని పేర్కొంది.

 

సీఎల్‌ఎస్‌ఏ
బీమా స్టాక్స్‌ శనివారం చూసిన నష్టాల నుంచి రివకరీ అవుతాయని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. డివిడెండ్‌ పంపిణీ పన్ను (డీడీటీ) ఎత్తివేయడాన్ని సానుకూల చర్యగా అభివర్ణించింది. సిగరెట్లపై పన్నును పెంచడం ఐటీసీకి ఆందోళనకర అంశంగా పేర్కొంది. అధిక డివిడెండ్‌ ఈల్డ్‌ ఉన్న స్టాక్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది.

 

జేపీ మోర్గాన్‌
2020-21 బడ్జెట్‌లో ద్రవ్య లోటు గణాంకాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని జేపీ మోర్గాన్‌ పేర్కొంది.

 

క్రెడిట్‌ సూసే
ద్రవ్యలోటు స్థిరీకరణపై దృష్టి సారించడం ప్రోత్సాహకరంగా ఉందని క్రెడిట్‌ సూసే పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాలకు సంబంధించి ప్రత్యేకమైన విధానాలు లేకపోవడం మార్కెట్‌ను నిరాశపరిచిందని, వృద్ధి స్తబ్దుగానే ఉండొచ్చని అభిప్రాయపడింది.



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 4th February 2020

భారతీ ఎయిర్‌టెల్‌, టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ, త్రివేణి ఇంజనీరింగ్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌, టైటాన్‌ కంపెనీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సీఎస్‌బీ, బ్యాంక్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, గతి, జిందాల్‌ సా, అదానీ ఎనర్జీ గ్రీన్‌, అవంతి ఫీడ్స్‌లు కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్పరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. 

ఈ ఇండెక్స్‌ స్టాక్స్‌ రేటింగ్‌లో మార్పులు

Monday 3rd February 2020

ఇండెక్స్‌ స్టాక్స్‌ అయిన ఐటీసీ, మారుతి సుజుకీ, ఐవోసీ, ఎస్‌బీఐ రేటింగ్‌లను అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు సవరించాయి.   ఐటీసీ ఐటీసీ స్టాక్‌కు ఇప్పటి వరకు కొనసాగించిన ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను జేపీ మోర్గాన్‌ తాజాగా న్యూట్రల్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరగా రూ.235ను పేర్కొంది. సిగరెట్లపై తాజా బడ్జెట్‌లో పన్నును పెంచేయడంతో స్టాక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. బడ్జెట్‌లో పన్నుల పెంపు ఐటీసీ సిగరెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని జేపీ మోర్గాన్‌ తెలిపింది. రానున్న 6-12

Most from this category