News


క్యూ2 ఫలితాలపై బ్రోకరేజీల అంచనాలు

Wednesday 9th October 2019
Markets_main1570643323.png-28789

ఈ నెల 10 నుంచి ముఖ్యమైన కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక కాలానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ముందస్తు పన్ను చెల్లింపులు చేశాయి కూడా. దీంతో గత నెలలో కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం తాలూకూ ఫలితాలు సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల్లో ప్రతిఫలించకపోవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ పేర్కొంది. 

 

బలహీనంగా ఉంటాయి..: మోతీలాల్‌
క్యూ2లో కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉంటాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. నిర్వహణ వాతావరణం ఎంతో ప్రతికూలంగా ఉందని పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలైన బ్రిటానియా, కోల్గేట్‌, డాబర్‌, ఇమామీ, జీఎస్‌కే కన్జ్యూమర్‌, నెస్లే కంపెనీల నిర్వహణ పనితీరు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. 

 

4.6 శాతం తగ్గొచ్చు: కోటక్‌
వార్షికంగా క్రితం ఏడాది క్యూ2తో పోలిస్తే ఈ ఏడాది క్యూ2లో ఆటో, మెటల్స్‌, మైనింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లో కంపెనీల పన్ను ముందస్తు లాభం 4.6 శాతం క్షీణించొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. నిఫ్టీ కంపెనీల నికర లాభం క్యూ2లో వార్షికంగా చూస్తే 4 శాతం తగ్గొచ్చని ఎడెల్‌వీజ్‌ అంచనా. 

 

కొంచెం తగ్గొచ్చు: సెంట్రమ్‌
నిఫ్టీ కంపెనీల ఆదాయం 7 శాతం, ఎబిట్డా 15.7 శాతం, నికర లాభం 17.1 శాతం చొప్పున పెరుగుతాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది తక్కువని తెలిపింది.

 

ఆర్థిక రంగ పరిస్థితి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (జూన్‌)లో దేశ జీడీపీ వృద్ధి 5 శాతానికి తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి వృద్ధి. వృద్ధికి ప్రోత్సాహాన్నిచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు ఆదాయపన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. గత వారం ఆర్‌బీఐ సైతం మరో విడత వడ్డీ రేట్లను తగ్గించింది. ఇవన్నీ రానున్న కాలంలో కంపెనీలు మంచి ఫలితాలు ప్రకటించేందుకు దోహదపడే అంశాలే. 



You may be interested

లార్జ్‌ క్యాప్స్‌లో ఇవి చాలా చౌక!

Wednesday 9th October 2019

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో వోలటాలిటీ అన్నది మిగిలిన ‍స్టాక్స్‌తో పోలిస్తే కొంత తక్కువ. రిస్క్‌ కొంచెం తక్కువ ఉండాలనుకునే వారు, మార్కెట్‌ ర్యాలీలో ముందు లాభాలు గడించాలనుకునే వారికి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ అనుకూలం. ప్రస్తుత కరెక్షన్‌ నేపథ్యంలో ఈ లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఆకర్షణీయమైన స్టాక్స్‌ ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా తర్వాతి బుల్‌ ర్యాలీలో లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. గత ఐదు సంవత్సరాల సగటు పీఈతో పోల్చి చూసినప్పుడు ప్రస్తుత

మూడు రంగాలపై బుల్లిష్‌

Wednesday 9th October 2019

సుందరం ఎంఎఫ్‌ ఎండీ సునీల్‌ సుబ్రమణ్యం వచ్చే మూడు నాలుగు నెలలకు మార్కెట్లో అప్రమత్తంగా ఉండాలని, ఈ సమయంలో సూచీలు తీవ్ర ఒడిదుడకులు చూపవచ్చని సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సిఈఓ సునీల్‌ సుబ్రమణ్యం చెప్పారు. రాబోయే కాలానికి మూడు రంగాలపై బుల్లిష్‌గా ఉన్నామని, సైక్లిక్స్‌, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. బ్రెగ్జిట్‌, ట్రంప్‌పై అవిశ్వాస పరీక్ష, ట్రేడ్‌వార్‌

Most from this category