News


రేట్ల కోతపై విశ్లేషకుల మాట...

Wednesday 7th August 2019
Markets_main1565201465.png-27615

ఆర్‌బీఐ ఎంపీసీ తాజా నిర్ణయాలపై విశ్లేషకులు, నిపుణులు దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. కాకపోతే ఆర్‌బీఐ రేట్ల తగ్గింపును బ్యాంకులు రుణ గ్రహీతలకు బదలాయించినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేశారు. 

 

50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింపును మేం ఆశించాం. అయితే అసాధారణంగా 35 బేసిస్‌ పాయింట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది మార్కెట్లకు కొద్ది మేర సానుకూలం. అయితే ఆర్‌బీఐ జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి తగ్గించింది. ఇది ఎక్కువ మంది అంచనా వేసిందే. మార్కెట్‌ స్వల్పకాలంలో ఎక్కువగా ఫాల్‌ అవకపోవచ్చు. మొత్తం మీద ఇది సర్దుబాటుతో కూడిన విధానం. ఇతర అభివృద్ధి చెందిన, వర్ధమాన మార్కెట్ల ధోరణులకు అనుగుణంగానే ఉంది. ఒక్కో ఎన్‌బీఎఫ్‌సీకి బ్యాంకుల ఎక్స్‌పోజర్‌ వాటి టైర్‌ 1 క్యాపిటల్‌లో 15 శాతం నుంచి 20 శాతానికి పెంచడం వంటి మంచి చర్యలు కూడా ఉన్నాయి. బ్యాంకులు రేట్ల తగ్గింపును ఆర్థిక వ్యవస్థకు బదలాయించాల్సి ఉంది. మొత్తం మీద ఇది మంచి పాలసీ. లిక్విడిటీ, వినియోగం, డిమాండ్‌ను పెంచేందుకు తోడ్పడుతుంది. ద్రవ్యోల్బణ అంచనాల ఆధారంగా చూస్తే... వృద్ధి రేటును పెంచేందుకు ఆర్‌బీఐ తదుపరి కూడా రేట్ల తగ్గింపు చేపడుతుందని అంచనా వేస్తున్నాం. 

- రాజీవ్‌ సింగ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈవో

 

ఆర్‌బీఐ విధానం, ముఖ్యంగా 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం అన్నవి వడ్డీ రేట్లను తగ్గించి, లిక్విడిటీ పెంచి వృద్ధి, డిమాండ్‌ పెరిగేందుకు దారితీస్తాయి. సర్దుబాటు విధానం విజయవంతం కావడం అన్నది తదుపరి దశ అమలుపైనే ఆధారపడి ఉంది. అంటే రుణ గ్రహీతలకు తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ అవసరాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. తక్కువ బేస్‌ రేటు ప్రయోజనాలు వచ్చే కొన్ని నెలల్లో కనిపిస్తాయి.

- కే జోసెఫ్‌ థామస్‌, ఎంకే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌

 

25 బేసిస్‌ పాయింట్ల మా అంచనాకు మించి రేట్ల తగ్గింపు జరిగింది. ఇది వృద్ధి పనితీరుపై ఆర్‌బీఐ ఆందోళనను తెలియజేస్తోంది. వృద్ధి తిరిగి కోలుకునేందుకు సత్వర చర్యలు తీసుకోవడం ఇందులో భాగమే. అయితే, మానిటరీ పాలసీ బదలాయింపు, ఎన్‌బీఎఫ్‌సీ రంగం పునురుత్తేజం కోసం ఎటువంటి చర్యలూ లేవు.

- సుజన్‌ హజ్రా, ఆనంద్‌ రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌

 

అంతర్జాతీయంగా తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం, డోవిష్‌ పాలసీ విధానాలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, ప్రతికూల బాండ్‌ ఈల్డింగ్స్‌ వంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ పాలసీది ఎంతో ఆహ్వానించతగినది. మార్కెట్ల అంచనాలకు అనుగుణంగా ఉంది. ఇది సర్దుబాటుతో కూడిన విధానం. వర్షాలు నిదానంగా పుంజుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది. దీంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు ఉన్న అవకాశాలను ఆర్‌బీఐ వినియోగించుకుంది. మార్కెట్లు స్వల్పకాలంలో ఉత్సాహాన్ని అందిపుచ్చుకోవచ్చు. 11,100-11,200 వరకు వెళ్లొచ్చు. కాకపోతే నిఫ్టీ 11,750కి పైన ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే రెండో దశ బేరిష్‌ ట్రెండ్‌లో ఉన్నాం. 

- ముస్తఫా నదీమ్‌, ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో
 You may be interested

రేట్ల కోతతో ఈ స్టాక్స్‌కు అనుకూలం...!

Wednesday 7th August 2019

ఆర్‌బీఐ వరుసగా నాలుగో విడత బుధవారం కీలక రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 35 బేసిస్‌ సాయింట్లను తగ్గించడం వల్ల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గి ఆర్థిక రంగం పునరుత్తేజం చెందుతుందని శామ్కో సెక్యూరిటీస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జిమీత్‌ మోదీ అభిప్రాయపడ్డారు. రేట్ల తగ్గింపు రుణాలపై ఆధారపడిన కంపెనీలకు, అదే సమయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రియల్టీ రంగానికీ ప్రయోజనం చేకూరుస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో

10900 దిగువున ముగిసిన నిఫ్టీ

Wednesday 7th August 2019

మార్కెట్‌ పతనాన్ని అడ్డుకోలేకపోయిన కోత తగ్గింపు  286 పాయింట్లు క్షీణించిన సెన్సె‍క్స్‌ రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లపై కోత విధించినప్పటికీ.., మార్కెట్‌ రెండోరోజూ నష్టంతోనే ముగిసింది. సెన్సెక్స్‌  286 పాయింట్ల నష్టంతో 36,690.50 వద్ద, నిఫ్టీ 92.75 పాయింట్లను కోల్పోయి 10,855.50 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీంగా నెలకొన్న బలహీన సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి భారీ క్షీణిత, ఆర్‌బీఐ 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి

Most from this category