News


మార్కెట్‌ పతనంలో ఈ 10 షేర్లను కొనవచ్చు

Monday 16th March 2020
Markets_main1584352731.png-32509

మార్కెట్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పడు నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. గడిచిన రెండు వారాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ 17.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ధీర్ఘకాలంలో ఈ షేర్లు రివకరి అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ తరుణంలో మంచి రాబడులను ఇచ్చే స్టాక్‌లకు ఎన్నుకోవడం కొద్దిగా కష్టం. తక్కువ వాల్యూయేషన్స్‌, బలమైన ఆర్‌ఓఈ(రెవెన్యూ ఆన్‌ ఈక్విటీ), స్థిరమైన ఆదాయం, గతంలో మంచి రిటర్న్‌ ఇచ్చిన చరిత్ర కలిగి ఓ 10షేర్లను ఎకనామిక్స్‌ టైమ్స్‌ అభ్యర్థన మేరకు ఆయా బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..!


షేరు పేరు: బాటా ఇండియా
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్వీజ్‌
ప్రస్తుత ధర: రూ.1,463 (16-03-2020నాటికి)
టార్గెట్‌ ధర: రూ.2,250
విశ్లేషణ: అసంఘటిత మార్కెట్లో 1,300 కి పైగా రిటైల్ షాపులతో అతిపెద్ద షూ రిటైలర్ వెలుగొందుతోంది. మార్జిన్లు మెరగవడంతో ప్రాఫిట్‌ వృద్ధి 20శాతం పెగవచ్చు. మూలధనంపై 50శాతం కోర్ రాబడితో పాటు బలమైన క్యాష్‌ ఫ్లో కారణంగా ఈ షేరును కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ చెబుతోంది. 

షేరు పేరు: బీపీసీఎల్‌
బ్రోకరేజ్‌ సం‍స్థ: ఎంకే గ్లోబల్‌
ప్రస్తుత ధర: రూ.376 (16-03-2020నాటికి)
టార్గెట్‌ ధర: రూ.570
విశ్లేషణ: పెట్టుబడుల ఉపసంహరణ(డిజిస్ట్‌మెంట్) ప్రక్రియ కొనసాగుతోంది. చమురు ధరలు దిగిరావడం కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడిచమురు ధర 20డాలర్లకి దిగిరావడంతో అటోఫ్యూయెల్‌ ఎక్సైజ్‌ను పెంచడానికి ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. ఈ నిర్ణయంతో ఈఆర్థిక సంవత్సరమంతా  కంపెనీ ఆదాయాలపై సానుకూలతను చూపవచ్చు. 

షేరు పేరు: ఐషర్‌ మోటర్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ ధర: రూ.24,000
ప్రస్తుత ధర: రూ.17,672(16-03-2020నాటికి)
విశ్లేషణ: స్వల్ప కాలంపాటు అనిశ్చితి కొనసాగినప్పటికీ.., ఆర్థిక సంవత్సరం 21లో రెండో త్రైమాసికంలో బలమైన రికవరి సాధించవచ్చు. ఇండియా పాటు ప్రపంచవ్యాప్తంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోడల్స్‌ మార్కెట్‌ విస్తరించే అవకాశం ఇందుకు కారణవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది.

షేరు పేరు: గుజరార్‌ గ్యాస్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఐఐఎఫ్‌ఎల్‌
ప్రస్తుత ధర: రూ.258 (16-03-2020నాటికి)
టార్గెట్‌ ధర: రూ.327
విశ్లేషణ: నిర్మాణాత్మక మార్పులను ప్రవేశపెట్టి గుజరాత్ గ్యాస్ దాని వాల్యూమ్ వృద్ధిని కొనసాగించాలని భావిస్తోంది. దిగివచ్చిన ఎల్‌ఎన్‌జీ ధరలు మార్జిన్లు, వ్యాల్యూమ్స్‌ను పెంచతాయని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది. 

షేరు పేరు: హెచ్‌డీఎఫ్‌సీ
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.2,067(16-03-2020నాటికి)
టార్గెట్‌ ధర: రూ.2,875
విశ్లేషణ: ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోంటున్నప్పటికీ.., తన తోటి కంపెనీలతో తక్కువ ఖర్చుతో ద్రవ్యత పెంచగలిగింది. వార్షిక ప్రాతిపాదికన రిటైల్‌ ఏయూఎం 15శాతం వృద్ధిని సాధించింది. స్థూల ఎన్‌పీఎల్‌ నిష్పత్తి 1.35శాతంతో ఆస్తి నాణ్యత ఎక్కువగా స్థిరంగా ఉంది. సంస్థ తన సహ కంపెనీల మార్కెట్ వాటాను పొందే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది.

షేరు పేరు: హిందూస్థాన్‌ యూనిలివర్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ ధర: రూ.2,490 
ప్రస్తుత ధర: రూ.2,022(16-03-2020నాటికి)

విశ్లేషణ: కరోనా వైరస్‌ సంబంధిత అమ్మకాలకు అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. జీఎస్‌కే విలీనం నుంచి మందుసూదుల వ్యాపారం కలిసొస్తుంది. క్రూడాయిల్‌ ధర పతనం, సబ్బు ధరల పెంపు ఈ కంపెనీకి కలిసొచ్చే అంశంగా ఉంది. 

షేరు పేరు: ఐసీఐసీఐ బ్యాంక్‌ 
బ్రోకరేజ్‌ సంస్థ: ఐఐఎఫ్‌ఎల్‌
టార్గెట్‌ ధర: రూ.640
ప్రస్తుత ధర: రూ.447(16-03-2020నాటికి)
విశ్లేషణ: ఆస్తి నాణ్యత ఆందోళనలను తగ్గిస్తోంది అనుబంధ సంస్థల లాభదాయకత ఆదాయ వృద్ధికి తోడ్పడుతుంది. రిటైల్ రుణాల వైపు మొగ్గు చూపడం ఆదాయాలకు స్థిరత్వాన్ని తెస్తుంది. 


షేరు పేరు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
బ్రోకరేజ్‌సంస్థ : షేర్‌ఖాన్‌
టార్గెట్‌ ధర: 1,710
ప్రస్తుత ధర: రూ.1,105(16-03-2020నాటికి)
విశ్లేషణ: ఏడాది గరిష్ట ధర నుంచి 34శాతం కరెక‌్షన్‌కు లోనైంది. క్రూడాయిల్‌ పతనంతో రిఫైనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే బలహీనమైన రీఫైనరీ మార్జిన్‌లను పరిపుష్టం చేస్తుంది. 


షేరు పేరు: శ్రీ సిమెంట్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
టార్గెట్‌ ధర: రూ.21,308
ప్రస్తుత ధర: రూ.24,500
విశ్లేషణ: మొదట్లో నిఫ్టీ -50 సూచీలో ఉండేంది. తర్వాత స్థానాన్ని కోల్పోయింది. అనంతరం మెరుగైన పనితీరుతో ఇప్పుడు యస్‌స్థానంలో తిరిగి చేరనుంది. 2020 మార్చి 31 నుంచి యస్‌బ్యాంక్‌ స్థానంలో శ్రీ సిమెంట్‌ రానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇది స్టాక్‌కు మద్దతునిచ్చే అవకాశం ఉంది.

షేరు పేరు: సన్‌ ఫార్మా
బ్రోకరేజ్‌ సంస్థ: ఐఐఎఫ్‌ఎల్‌
ప్రస్తుత ధర: రూ.384 (16-03-2020నాటికి)
టార్గెట్‌ ధర: రూ.500
విశ్లేషణ: అతిపెద్ద భారతీయ ఫార్మా సంస్థ. భారత్‌తో పాటు ఇతర దేశాల మార్కెట్లలో బలమైన తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను కలిగి ఉండటంతో ఈ షేరు కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక ఆదాయంలో స్వల్ప పెరుగుదల కూడా లాభదాయకతకు తోడ్పడుతుంది.You may be interested

మళ్లీ ప్రపంచ మార్కెట్లు బేర్‌

Monday 16th March 2020

ఫెడ్‌ ఎఫెక్ట్‌ నిల్‌.. 2,700 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 760 పాయింట్లు కుప్పకూలిన నిఫ్టీ యూరోపియన్‌ మార్కెట్లు 8 శాతం వీక్‌ యూఎస్‌ ఫ్యూచర్స్‌ 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌., ఐటీ, రియల్టీ పతనం కోవిడ్‌-19 ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఎకాఎకిన వడ్డీ రేట్లను 1 శాతంమేర తగ్గించేసింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 0-0.25 శాతానికి చేరాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఇటీవలే 0.5 శాతం

ఫిబ్రవరిలో టోకు ధరలు తగ్గాయ్‌

Monday 16th March 2020

 మనదేశంలో టోకు ధరలు ఫిబ్రవరిలో గణనీయంగా తగ్గాయి. ఉల్లిపాయలు, కూరగాయల రేట్లు తగ్గడంతో ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.26 శాతం తగ్గిందని వాణిజ్య పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. జనవరిలో టోకు ధరలు 3.1 శాతం ఉండగా ఫిబ్రవరిలో అది 2.26 తగ్గినట్లు తెలిపింది. కాగా టోకుధరల సూచి ప్రకారం 2018 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.93 శాతంగా ఉంది. ఈ జనవరిలో ఉల్లిపాయల టోకు

Most from this category