News


హెచ్‌డీఎఫ్‌సీ షేరును ఏం చేద్దాం?

Tuesday 14th May 2019
Markets_main1557822571.png-25734

బ్రోకరేజ్‌ల సలహాలు
క్యు4 ఫలితాల అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.
1. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2400 నుంచి 2350కు తగ్గించింది. కంపెనీ వృద్దిలో కార్పొరేట్‌ రుణాల కారణంగా మందగమనం కనిపించింది. ఆస్తుల నాణ్యత క్షీణించలేదు అందువల్ల అండర్‌రైటింగ్‌ను పట్టించుకోనక్కర్లేదు. నికరవడ్డీ మార్జిన్‌ అంచనాలు తగ్గడంతో ఈపీఎస్‌ అంచనాలు 1- 5 శాతం మేర తగ్గించింది. 
2. డాయిష్‌ బ్యాంక్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2300. స్థిరమైన ట్రెండ్స్‌ను ప్రదర్శించింది. ఆస్తుల నాణ్యత మెరుగైంది. ఏయూఎం వృద్ధి 15 శాతం వద్ద బలంగా ఉంది. లోన్‌గ్రోత్‌ అంచనాల కన్నా స్వల్పంగా తగ్గింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన ఎన్‌ఐఎం ఉంటుంది. 
3. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు. టార్గెట్‌ను రూ. 2360 నుంచి రూ. 2500కు పెంచింది. నికరలాభం అంచనాలను దాటింది. ఎన్‌ఐఐ, ట్రెజరీ ఆదాయాలు బాగున్నాయి. లోన్‌గ్రోత్‌లో మెరుగుదల వస్తుంది. కోర్‌ఎర్నింగ్స్‌, ఆర్‌ఓఈల్లో క్రమానుగత పెరుగుదల రావచ్చు. వచ్చే రెండేళ్లలో లోన్‌ వృద్ధి సరాసరిన 16 శాతం ఉండొచ్చు. దీనివల్ల ఎర్నింగ్స్‌ సైతం మెరుగవుతాయి. 



You may be interested

రికవరి బాటలో ఫార్మా షేర్లు

Tuesday 14th May 2019

గత ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టాలను చవిచూసిన ఫార్మా స్టాకులు మంగళవారం స్థిరమైన లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు 2శాతం లాభపడింది. ఔషధ ధరల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన సుమారు 20 కంపెనీలపై అమెరికాలోని 44 రాష్ట్రాలు కేసలు నమోదు చేయడంతో నిన్న ట్రేడింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం

జెట్‌ ఎయిర్‌వేస్‌ 12 శాతం డౌన్‌

Tuesday 14th May 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లకు నష్టాల కష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ కంపెనీ షేర్లు మంగళవారం మరో 12శాతం నష్టపోయాయి. కంపెనీ డిప్యూటీ ఛైర్మన్‌, ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేయడం ఇందుకు కారణమైంది. నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.125.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వ్యక్తిగత కారణాలతో కంపెనీకి డిప్యూటీ ఛైర్మన్‌, ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసరుగా సేవలు అందిస్తున్న అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. మే

Most from this category