News


బేర్‌ షాక్‌- ఇన్వెస్టర్ల కింకర్తవ్యం?

Monday 6th January 2020
Markets_main1578301752.png-30706

టెన్షన్ల షాక్‌- ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ఉన్నట్టుండి అమెరికా, ఇరాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు షాక్‌నిచ్చాయి. కొత్త ఏడాది(2020)లో సరికొత్త రికార్డులను సాధించే హుషారుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లను గత వారం అనుకోకుండా చెలరేగిన మధ్యప్రాచ్య వివాదాలు దెబ్బతీస్తున్నాయి. దీంతో శుక్రవారమే మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని చవిచూడగా.. తాజాగా నేడు(సోమవారం) పతన పరిస్థితులలో చిక్కుకున్నాయి. ఈ దశలో ఇన్వెస్టర్లు నిరాశకు లోనైనప్పటికీ ఇలాంటి అంశాలను అవకాశాలుగా మలచుకోవాలంటున్నారు స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు! వివరాలు చూద్దామా?

అవకాశంగా
స్టాక్‌ మార్కెట్‌ చరిత్ర ప్రకారం చూస్తే.. అనూహ్య విదేశీ పరిణామాల కారణంగా ఎదురయ్యే దిద్దుబాట్ల(కరెక్షన్లు)ను ఇన్వెస్టర్లు అవకాశాలుగా మలుచుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో నాణ్యమైన(క్వాలిటీ) కౌంటర్లను ఎంపిక చేసుకోవలసి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 700 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ సైతం 200 పాయింట్లకుపైగా కోల్పోయి ట్రేడవుతోంది. వరుసగా మూడు రోజుల్లో బ్యాంక్‌ నిఫ్టీ మొత్తం 1,000 పాయింట్లు పడిపోయింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో గోల్డ్‌ 10 గ్రాముల ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ రూ. 41,000 మార్క్‌ను అధిగమించాయి. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ గత 20 రోజుల చలన సగటు 12,100 పాయింట్ల కీలక స్థాయి దిగువకు చేరింది. ఇక బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం దాదాపు 2 శాతం క్షీణించాయి.

ప్రతిదాడులకు దిగితే
బాగ్దాద్‌ విమానాశ్రయంవద్ద డ్రోన్ల ద్వారా అమెరికా నిర్వహించిన దాడులతో ఇరాన్‌ జనరల్‌సహా ఇరాకీ అధికారులు కొంతమంది మరణించారు. దీంతో ఓవైపు ఇరాక్‌ సీరియస్‌కాగా.. ఇరాన్‌ సైతం మిసైళ్లను సంధించినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికన్లపై ఇరాన్‌ దాడులకు దిగితే.. ప్రతిదాడులు తప్పవంటూ తాజాగా అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ప్రపంచ ఇంధన సరఫరాలలో మూడో వంతు వాటా కలిగిన మధ్యప్రాచ్య ఆందోళనలు చమురు ధరలకూ రెక్కలిచ్చాయి. వెరసి పసిడి ఏడేళ్ల గరిష్టాన్ని తాకగా.. చమురు ధరలు 4 నెలల గరిష్టానికి చేరాయి.

దీర్ఘకాలిక దృష్టితో
సాధారణంగా బుల్‌ ట్రెండ్‌లను రాజకీయ ఉద్రిక్తతలు దెబ్బతీయలేవని చెబుతున్నారు స్టాక్‌ నిపుణులు. ఇందువల్ల దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు నాణ్యమైన కంపెనీల కౌంటర్లను పరిశీలించవచ్చని సలహా ఇస్తున్నారు. షేర్ల ధరలు తగ్గినప్పుడు పెట్టుబడులకు దిగవచ్చని, ట్రేడర్లు మాత్రం స్వల్పకాలిక హెచ్చుతగ్గులను తగినవిధంగా ఎదుర్కోవలసి ఉంటుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలియజేశారు. సాధారణంగా జియోపొలిటికల్‌ టెన్షన్లు స్వల్ప కాలిక కరెక్షన్లకు దారిచూపుతాయని.. దీనివల్ల దీర్ఘకాలిక బుల్‌ట్రెండ్‌ పట్టాలు తప్పే అవకాశాలు తక్కువేనని ట్రేడింగ్‌ బెల్స్‌ సహవ్యవస్థాపకులు అమిత్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. అయితే పరిస్థితులు మరింత దిగజారితే సమీపకాలంలో మార్కెట్లు పతనంకావచ్చని తెలియజేశారు.

నిఫ్టీ రేంజ్‌?
సాంకేతిక నిపుణు అంచనాల ప్రకారం చూస్తే.. నిఫ్టీ 12,000-12,300 శ్రేణిలో కన్సాలిడేట్‌ అవుతోంది. సోమవారం 12,139 స్థాయి దిగువకు చేరింది. ఇదేవిధంగా 12,000 స్థాయి బ్రేక్‌ అయితే అమ్మకాలు మరింత పెరిగే వీలుంది. ఈ స్థాయిలో నిఫ్టీకి మద్దతు లభించవలసి ఉంది. హయ్యర్‌ హై, లో నమోదుకావడం ద్వారా గత వారంతో పోలిస్తే స్వల్ప బేరిష్‌ కేండిల్‌ను వారపు చార్టులు సూచిస్తున్నాయి. అయితే కొంతమేర సానుకూల ధృక్పథం కనిపిస్తోంది. వెరసి 12,300 లేదా 12,000 స్థాయిలు బ్రేక్‌ అయితే తదుపరి ట్రెండ్‌కు సంకేతాలు వెలువడతాయని విశ్లేషిస్తున్నారు.  You may be interested

ట్రంప్‌ దెబ్బకు రూ. 3 లక్షల కోట్లు హుష్‌కాకి!

Monday 6th January 2020

సోమవారం మార్కెట్లు బేర్‌ గుప్పిట్లో విలవిల్లాడాయి. ఒక్కరోజులోనే రూ. 3 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇరాన్‌ మిలటరీ లీడర్‌పై అమెరికా దాడితో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలపై పడింది. మరోవైపు తమ బలగాలు వైదొలగాలని కోరితే ఇరాక్‌పై మునుపెన్నడూలేనంత ఆంక్షలు వేస్తానని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో దేశీయ మార్కెట్లు దాదాపు 2 శాతం పతనమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 సమయానికి

70డాలర్లకు క్రూడాయిల్‌... ఈ రంగ షేర్లకు కష్టాలే..!

Monday 6th January 2020

అంతర్జాతీయంగా బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 70డాలర్లకు చేరుకోవడంతో దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 72స్థాయికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశీయ స్టాకుల ర్యాలీ బ్రేకులు పడవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్ని భౌగోళిక ఉద్రిక్తతలు చల్లారకపోతే.., దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌,  విమానయాన, రసాయన రంగాలకు చెంది షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యే అవకాశం ఉందని వారంటున్నారు.  ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 9నెలల గరిష్టానికి ఎగిసిన నేపథ్యంలో

Most from this category