STOCKS

News


వొడాఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లను ఏం చేద్దాం?

Thursday 21st November 2019
Markets_main1574320838.png-29758

అనలిస్టుల సూచనలు
స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై రెండేళ్ల మారిటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది టెల్కోలకు పాజిటివ్‌ వార్తే కానీ వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లు మాత్రం గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏజీఆర్‌ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ సాయం ఏమీ ప్రకటించకపోవడంతో ఈ షేర్ల కౌంటర్లలో అమ్మకాలు పెరిగాయి. మధ్యాహ్న సమయానికి ఐడియా షేరు దాదాపు 4 శాతం, ఎయిర్‌టెల్‌ సుమారు 2.5 శాతం నష్టాల్లో ఉన్నాయి. ఇటీవల కొన్ని సెషన్ల పాటు ఈ రెండూ భారీ ర్యాలీ చేశాయి. తాజా వెనుకంజ నేపథ్యంలో ఈ రెండిటిపై అనలిస్టులు మిశ్రమ అంచనాలు వెలిబుచ్చుతున్నారు. 
= టెలికం షేర్లలో ‘వార్తల ఆధారంగా అమ్ము, పుకార్ల ఆధారంగా కొను’ సూత్రం నడుస్తోందని ఎలైక్సైర్‌ ఈక్విటీస్‌ ప్రతినిధి దీపన్‌ మెహతా చెప్పారు. చాలా పోర్టుఫోలియోల్లో ఇప్పటివరకు టెలికం షేర్లు లేవని, భవిష్యత్‌లో వీటిపై బడా ఇన్వెస్టర్ల కన్ను పడవచ్చని అంచనా వేశారు. టెలికంలో అధ్వాన్నం పూర్తయిందని భావించవచ్చన్నారు. కానీ వొడాఫోన్‌ఐడియా తిరిగి గాడిలో పడడం ఎంతవరకు సాధ్యమనేది చెప్పలేమన్నారు. కానీ ఎయిర్‌టెల్‌ మాత్రం సంక్షోభాన్ని అధిగమించి కొనసాగగలదని అంచనా వేశారు. ఇన్వెస్టర్‌ కోణంలో ఎయిర్‌టెల్‌ను కొనొచ్చని, కానీ ఇటీవలి ర్యాలీ కారణంగా కొంత కరెక‌్షన్‌ వచ్చాక ఇందులోకి ఎంటర్‌కావచ్చని సూచించారు. 
= టెలికం రంగంలో జియోపై పాజిటివ్‌గా ఉన్నామని హెమ్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ఆస్తా జైన్‌ చెప్పారు. జియోకు మరింతమంది కస్టమర్లు పెరిగే అవకాశముందని, అందువల్ల ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ కన్నా ఆర్‌ఐఎల్‌పై బుల్లిష్‌గా ఉన్నామని చెప్పారు. ఆర్‌ఐఎల్‌కు రూ.1800 టార్గెట్‌ ఇచ్చారు.
= పలు పాజిటివ్‌ వార్తలతో ఇటీవలి సెషన్లలో టెలికం షేర్లు మంచి ర్యాలీ చూశాయని, ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా తాజా వెనుకంజ సమంజసమేనని జియోజిత్‌ అనలిస్టు వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఏజీఆర్‌ రిలీఫ్‌నను ప్రభుత్వం ప్రకటించకపోవడంతో లాభాల స్వీకరణ వచ్చిందన్నారు. కంపెనీలకు ఇకపై నగదు ప్రవాహమే అతిపెద్ద ఇబ్బందని చెప్పారు. You may be interested

రికవరీ బాటలో బ్యాంకింగ్‌

Thursday 21st November 2019

-బీఎన్‌పీ పారిబా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం నుంచి మందగమనంలో ఉందని, ఫలితంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణాలివ్వడం తగ్గిందని, కానీ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం, బ్యాంకుల నియంత్రణ సామర్ధ్యం పెరగడం, తక్కువ పన్ను రేటు వంటి అంశాల వలన దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ రికవరీకి  సిద్ధంగా ఉందని బీఎన్‌పీ పారిబా పేర్కొంది. బ్యాంకుల డిజిటిల్‌ కార్యక్రమాలు పెరగడం, తక్కువగా శ్రామిక అవసరాలను ఉపయోగిస్తుండడం వంటి కారణాల వలన బ్యాంకుల ఆపరేషనల్‌ సామర్ధ్యం పెరిగిందని,

యూకో బ్యాంక్‌ 19శాతం అప్‌

Thursday 21st November 2019

ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ షేరు వరుసగా మూడో రోజూ లాభాల బాట పట్టింది. బుధవారం ఉదయం సెషన్‌లో ఈ షేరు దాదాపు 19శాతం లాభపడింది. బ్యాంక్‌ వెల్లడించిన క్యూ2 ఫలితాలను పరిశీలిస్తే... నికర నష్టాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయి. గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ

Most from this category