ఏ రంగం ఆకర్షణీయం..?
By Sakshi

ఎన్నికల అంకం పూర్తయ్యి మునుపటి ప్రభుత్వమే మరింత బలంగా కేంద్రంలో కొలువుదీరింది. దీంతో స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను తాకి, ఆ తర్వాత కన్సాలిడేషన్లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాలు ఖరీదైన వ్యాల్యూషన్లకు చేరగా, కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రంగాలవారీ విశ్లేషణ ఇలా ఉంది. ఆటోమొబైల్ బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు క్యాపిటల్ గూడ్స్ ఇన్ఫ్రా
ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం 18.1 పీఈ వద్ద ట్రేడవుతోంది. చారిత్రక సగటు పీఈ 16.9 కంటే 7 శాతం ఎక్కువ. విక్రయాలు తగ్గడం, బలహీన డిమాండ్ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, సాధారణ వర్షాలకు తోడు, 2020 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి బీఎస్6 వాహనాల ముందస్తు కొనుగోళ్లు సానుకూలమని మోతీలాల్ ఓస్వాల్ అంచనా. మే నెలకు సంబంధించి మారుతి సుజుకీ, ఎంఅండ్ఎం వాహనాలు 22 శాతం, 3 శాతం చొప్పున క్షీణించాయి. ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ కంపెనీల అమ్మకాలు వార్షికంగా చూస్తే మే నెలలో 7.7 శాతం క్షీణించాయి. ఎంఅండ్ఎం, ఎస్కార్ట్స్ ట్రాక్టర్ల అమ్మకాలు కూడా తగ్గాయి.
పుస్తక విలువకు ప్రైవేటు బ్యాంకులు 3 రెట్లు అధికంగా ట్రేడ్ అవుతున్నాయి. చారిత్రక సగటు 2.4రెట్ల కంటే 27 శాతం ఎక్కువ. పరిశ్రమకు మించి ప్రైవేటు బ్యాంకులు అధిక వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా. నిధుల వ్యయాలు పెరిగినా కానీ, ధరలు పెంచగల సామర్థ్యంతో వాటి మార్జిన్లు మెరుగుపడడం గమనార్హం. డిపాజిట్ల వృద్ధి మందగమనంతో నిధుల వ్యయాలు సమీప కాలంలో పెరుగుతాయని మోతీలాల్ ఓస్వాల్ అంచనా. ఇక ప్రభుత్వరంగ బ్యాంకులు పుస్తక విలువకు ఒక రెట్టు ధరకు ట్రేడ్ అవుతున్నాయి. చారిత్రక సగటు 0.9 రెట్లకంటే స్వల్పంగా అధికం. ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వహణ పనితీరు మోస్తరుగా మెరుగుపడింది. స్టాక్స్ వ్యాల్యూషన్లు కూడా కొంత మేర రికవరీ అయ్యాయి. అయితే, ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణ (విలీనాలు) ఇకపై వేగవంతం అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది.
పుస్తక విలువకు 3.6 రెట్ల వద్ద ఎన్బీఎఫ్సీ కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. చారిత్రక సగటుతో పోలిస్తే 21 శాతం అధికం. హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో అన్ని కంపెనీలూ వృద్ధి పరంగా మందగమనాన్ని చవిచూస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ విషయంలో మాత్రం ఈ తగ్గుదల పరిమితంగా ఉంది. వాహన ఫైనాన్స్ కంపెనీలు మాత్రం బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేశాయి.
క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు సగటున 24.5 రెట్ల పీఈ వద్ద ట్రేడవుతున్నాయి. చారిత్రక పీఈ 26.9 రెట్ల కంటే 9 శాతం తక్కువలోనే ఉన్నాయి. ఆర్డర్ల రాక నిదానించడం, మార్జిన్లపై ఒత్తిళ్లు స్వల్పకాలంలో ప్రభావం చూపనున్నాయి. అలాగే, తయారీ వ్యయాలకు అనుగుణంగా ధరలు పెంచలేని పరిస్థితిని కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్డర్ల రాక పుంజుకుంటుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా.
ఇన్ఫ్రా రంగం పుస్తక విలువకు 1.2 రెట్ల వద్ద ట్రేడవుతోంది. చారిత్రక సగటు పీబీతో పోలిస్తే 32 శాతం తక్కువ. ఎన్నికలు ముగియడంతో ఇన్ఫ్రా కంపెనీల వ్యాపారం మంచి వృద్ధిని అందుకుంటుందని మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అంచనా వేస్తోంది.
You may be interested
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌పై చిగురించిన ఆశలు
Thursday 13th June 2019మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు మే నెలలో క్రితం నెలతో పోలిస్తే రూ.16,000 కోట్లు పెరిగి రూ.25.43 లక్షల కోట్లకు చేరాయి. లిక్విడ్ ఫండ్స్‌లోకి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్లోకీ రూ.5,407 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్ నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన రూ.4,609 కోట్లతో పోలిస్తే పెరిగాయి. ప్రధానంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి మే నెలలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో సగం మేర
మూడురోజుల లాభాలకు బ్రేక్
Wednesday 12th June 2019మార్కెట్ ర్యాలీ మూడు రోజుల ముచ్చటగానే మిగిలింది. సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 193 పాయింట్ల నష్టంతో 39,757 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 10906 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని నెలకొన్న ప్రతికూల సంకేతాలకు తోడు సూచీల మూడు రోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, నేటి మార్కెట్ ముగింపు అనంతరం విడుదల కానున్న ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర