News


గ్రామీణ ఆర్ధికం మెరుగుపడితేనే వృద్ధి: డాబర్‌ సీఈఓ

Friday 28th June 2019
Markets_main1561718124.png-26664

  • బడ్జెట్‌ రాయితీలు, రుతుపవనాలతో గ్రామీణ ఆర్థికం పుంజుకొంటుంది
  • ఈ త్రైమాసికం గత త్రైమాసికం కన్నా మెరుగ్గా ఉంటుంది
  • లిక్విడిటీ సమస్య పరిష్కారం అవుతోంది

మార్కెట్‌ వాటా పెరిగితే కొత్త కొత్త ఆవిష్కరణలను ఆరోగ్య రక్షణ రంగంలో తీసుకొచ్చి వృద్ధిని సాధిస్తామని డాబర్‌ ఇండియా సీఈఓ మోహిత్‌ మల్హోత్రా ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.....

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితేనే...
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏర్పడిన మందగమనానికి కారణం దీర్ఘకాలీక శీతాకాలం అనుకున్నాం. ఎందుకంటే దీనివలన మన శీతల పానియాల వ్యాపారాలు దెబ్బతిన్నాయని భావించాం. కానీ ఈ మందగమననాన్ని ఏడాది మొదటి త్రైమాసికంలో కూడా చూశాం. దీనికి లిక్విడిటీ సమస్య, స్థూల ఆర్థిక కారకాలు వంటివి కారణమయ్యాయి. మొత్తం వ్యాపారాల పరంగా చూస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అర్బన్‌ ఆర్థిక వ్యవస్థకన్నా మెరుగ్గా ఉంది. ఫలితంగా ఈ క్వార్టర్‌ గత త్రైమాసికానికన్నా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.  అంతేకాకుండా మన దేశంలో 70 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎఫ్‌ఎమ్‌సీజీ వస్తువుల వినియోగంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పాత్ర అధికంగా ఉంది. డాబర్‌ ఉత్పత్తులనే తీసుకుంటే 45 శాతం వినియోగం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అర్బన్‌ ప్రాంతాలలో  కంటే 2-3 శాతం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు అసలైన వారి చేతికి అందక పోవడం కూడా మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడానికి కారణంగా మారింది . ఫలితంగా గ్రామీణ ఆదాయం క్షీణించి, వినియోగ సామర్ధ్యం పడిపోయింది. 
  
బడ్జెట్‌ ఉద్దీపనలు?
జులై 5న వెలువడనున్నా బడ్జెట్‌ ప్రకటన కోసం మేము ఎదురుచూస్తున్నాం. బడ్జెట్లో ఆర్ధిక ఉద్దీపనలను ప్రభుత్వం ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లడానికి అవి సహాయపడతాయి. రుతుపవనాలు సరియైనా సమయంలో వస్తే గ్రామీణ ఆర్థికం తొందరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హమీల మేరకు బడ్జెట్‌లో వ్యవసాయ ఆర్థిక రాయితీలు కలిపిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లగలుగుతుంది. 
       లిక్విడిటీ సమస్య  ప్రస్తుత ఆర్థిక త్రైమాసికంలో నెమ్మదిగా మెరుగుపడుతోంది. ఆర్బీఐ రెపో రేట్‌ను తగ్గించడంతో వినియోగదారులకు తక్కువ వడ్డిలకే రుణాలు అందనున్నాయి. లిక్విడిటీ సమస్య వలన బ్యాంక్‌లు రుణాలివ్వడంలో ఇబ్బందులను ఎదుర్కున్నాయి. హోల్‌ సేలర్‌ లేదా రిటైలర్‌లకు రుణాలను అందించినప్పుడే ఆర్థిక మందగమనం తగ్గుతుంది. 

జ్యూస్‌ సెగ్మెంట్‌, ఓరల్‌ కేర్‌ పై గురి..
     గత త్రైమాసికంలో దీర్ఘకాల శీతకాలం వలన పానియాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ పోటీ తివ్రత మార్కెట్‌లో ఉండడం వలన కంపెనీలు కార్బోనేటెడ్‌ పానీయాల తయారి నుంచి జ్యూస్‌ సిగ్మెంట్‌ వైపు నడుస్తున్నాయి. వినియోగదారులు కూడా వీటిని ఆదరిస్తున్నారు. మా వరకు చూసుకుంటే ఈ రంగంలో డాబర్‌ 56 శాతం వాటా కలిగి ఉంది. జ్యూస్‌ సెగ్మెంట్‌లో అనేక కొత్త ఆవిష్కరణలను తీసుకురావడానికి మేం కట్టుబడి ఉన్నాం.
     పైపూత ఔషదాల రంగంలో ప్రమాదం ఏమి లేదు. ఎందుకంటే సహజ, మూలిక, ఆయుర్వేదిక్‌ సిగ్మంట్‌లో సానుకూలత ఉంది. అంతేకాకుండా  ఆయుర్వేదిక్‌ 20శాతం వృద్ధి రేటుతో ఈ రంగంలో ముందుంది. తరుచుగా కాల్షియం కార్బోనేట్‌ టూత్‌పేస్ట్‌ వృద్ధి రేటు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతే మూలికాధరిత టూత్‌పేస్ట్‌ 20-25 శాతంతో వృద్ధి చెందుతోం‍ది. ఇలాంటి పరిణామాలు పైపూత ఔషదాల రంగంలో ముందు వరసలో ఉన్న డాబర్‌లాంటి కంపెనీలకు సానుకూలమైనవే. కానీ ధర విషయం ప్రభావితం చేసే అంశమని గుర్తుపెట్టుకోవాలి. 
     ప్రీమియం, ప్రఖ్యాత కంపెనీలు ధరను తగ్గించి రూ. 10కే అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందులో తప్పేమిలేదు. వినియోగదారులను దృష్ఠిలో పెట్టుకొని  మేము కూడా అలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నాము. బబుల్‌ బ్రాండ్‌ను రూ. 10 కే తీసుకొచ్చాం. కానీ వినియోగదారులు విలువలను తక్కువగా అనుసరించడం వలనేమో ఆ బ్రాండ్‌ తన ప్రకాశాన్ని కోల్పోయింది.
ఈ ఉత్పత్తిని రాయితి పైనే అందిస్తున్నాం. మార్కెట్‌లో ఈ ఉత్పత్తి సరికొత్తగా అందుబాటులోకి రావడం మీరు ఇక ముందు చూస్తారు.  పైపూత ఔషదాల రంగంలో మేము బలంగా ఉన్నాం. ఇప్పుడున్న సానుకూల పవనాలు ఈ రంగంలో మేం దూసుకుపోవడానికి సహాయపడతాయి. 

ఆరోగ్యపరిరక్షణకు పెద్ద పీట..
   డాబర్‌ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. వినియోగదారుల ఆలోచనలలోఉన్నది కూడా డాబర్‌ ఉత్పత్తులను వాడడం ఆరోగ్యపరమైనదనే . మాకున్న 40-50 శాతం మార్కెట్‌ వాటాలో డాబర్‌ చ్యావన్‌ప్రాస్‌, ఆరోగ్యరక్షణ శాఖల వాటానే 35శాతం-40శాతం వరకు ఉంటుంది. మేము ఆరోగ్యరక్షణకు కట్టుబడి ఉండడమే కాకుండా ఈ రంగంలో ధరలను నిర్ణయించే స్థాయిలో ఉన్నాం. మిగిలిన కంపెనీలు మమల్ని అనుసరించాలి. చ్యావన్‌ప్రాస్‌, పుదీనా హరా, హోనిటస్‌, లాల్‌ టైల్‌ మరికొన్ని బ్రాండ్‌లు వినియోగాదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే ఉత్పత్తులు. పోటి తీవ్రత తక్కువగా ఉన్న వినియోగదారుల ఆరోగ్య రక్షణ రంగంలో మా దృష్ఠిని కేంద్రికరించాం. మా ఎనిమిది పవర్‌ బ్రాండ్‌లలో ఐదు ఈ రంగంలోనే ఉన్నాయి. గత ఏడాది రెండంకెల వృద్ధిని సాధంచాం. ఈ ఏడాది కూడా దానిని కొనసాగిస్తామని నమ్ముతున్నాం. ప్రతి ఓటీసీ బ్రాండ్‌ రూ.100 కోట్ల స్థాయి దాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. 
   మొదటి త్రైమాసికం వరకు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఒక వేళ ద్రవ్యోల్బణం పెరిగితే మధ్యస్థ నుంచి సింగిల్‌ డిజిట్‌ పెరుగుదల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్కెట్‌ వృద్ధి రేటు 5- 6శాతం దగ్గర దోబూచులాడుతోంది. ఈ వృద్ధి రేటును దాటడానికి, మేమున్న రంగాలలో వీలున్నంత ఎక్కువ మార్కెట్‌ వాటాను దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇదంతా మార్కెట్‌ వృద్ధి పై ఆధారపడి ఉంది. మార్కెట్‌ వృద్ధి పెరిగితే  ఆరోగ్యరక్షణ రంగంలో కొత్త  ఆవిష్కరణలు తీసుకొస్తాము. 

 



You may be interested

11800ల దిగువకు నిఫ్టీ

Friday 28th June 2019

మార్కెట్‌ వారంతాన్ని నష్టాలతో ముగించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకు, మెటల్‌ షేర్ల పతనంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 192 పాయిం‍ట్లను కోల్పోయి 39,394.64 వద్ద, నిఫ్టీ 52.60 పాయింట్లు నష్టపోయి 11800ల దిగువన 11,789 వద్ద స్ధిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. నేటి నుంచి ప్రారంభం కానున్న జీ 20 సమావేశంలో ట్రంప్‌, జిన్‌పింగ్‌లు తమ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలకు

21ఏళ్ల తర్వాత యూరప్‌ స్టాక్స్‌600లో భారీ ర్యాలీ!

Friday 28th June 2019

సంవత్సర ప్రథమార్ధంలో భారీర్యాలీ నమోదు చేయడం యూప్‌ మార్కెట్లో 21 ఏళ్ల తర్వాత ఈ ఏడాది కనిపించింది. కేంద్ర బ్యాంకర్ల సానుకూల కామెంట్లు, బలమైన రీబౌండ్‌ కారణంగా యూరప్‌ స్టాక్స్‌ 600 సూచీ ఈ ఏడాది ఇంతవరకు 13 శాతం లాభపడింది. ఏడాది తొలి సగభాగంలో ఈ సూచీ ఇంతలా లాభపడడం 1998 తర్వాత ఇదే తొలిసారి. ఒకపక్క యూరప్‌లోని వివిధ దేశాల సూచీల్లో షార్ట్స్‌ ఎక్కువగా నమోదవుతున్నా, స్టాక్స్‌

Most from this category